Home Latest News Medical student Preethi | విషమంగా వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి.. సైఫ్‌ను కఠినంగా...

Medical student Preethi | విషమంగా వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి.. సైఫ్‌ను కఠినంగా శిక్షించాలన్న ఆమె తండ్రి!

Medical student Preethi | వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీలో వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్న వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అవయవాలు దెబ్బతిన్నాయని, మెదడు కూడా డ్యామేజ్‌ అయిందని తెలిపారు. ప్రస్తుతం ప్రీతికి వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

అసలేంజరిగిందంటే..

వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీలో ప్రీతి మెడిసిన్‌ చదువుతోంది. అయితే కాలేజీలో సీనియర్ల వేదింపులు గురిచేయడంతో బుధవారం మత్తు ఇంజిక్షన్‌ వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో అప్రమత్తమైన సహ విద్యార్థులు, వైద్య సిబ్బంది ప్రీతికి చికిత్స అందించారు. పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో హుటాహుటిన హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతున్న ప్రీతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.

ప్రీతి ఆత్మహత్యాయత్నం గురించి ఆమె తండ్రి నరేందర్‌ స్పందించారు. గత ఏడాది నవంబర్‌లో తన కూతురు పీజీ కాలేజీలో చేరిందని తెలిపారు. ఆ తర్వాతి నెల నుంచి సైఫ్‌ అనే సీనియర్‌ విద్యార్థి తన కూతురును ర్యాగింగ్‌ చేయడం మొదలుపెట్టాడని, ఈ విషయం తనకు చెప్పిందన్నాడు. దీంతో స్థానిక అధికారులు, పోలీసులకు సమాచారం అందించామని, తన కూతురుకు కూడా ధైర్యం చెప్పినట్లు నరేందర్‌ తెలిపాడు. ఇదే విషయం వర్సిటీ అధికారులకు తెలియడంతో పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేశారని మందలించినట్లు తెలిపాడు.

ప్రీతి మెరిట్‌ స్టూడెంట్‌ అని, కరోనా సమయంలోనూ ప్రాణాలు లెక్క చేయకుండా ధైర్యంగా సేవలందించిందని ఆమె తండ్రి నరేందర్‌ తెలిపాడు. తన కూతురు ఆత్మహత్యాయత్నం చేసిందంటే.. మాకు చెప్పని విధంగా ఎన్ని రకాలుగా హింసించాడో తెలియడం లేదన్నాడు. వెంటనే సైఫ్‌ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశాడు. మరోవైపు ప్రీతి తమ్ముడు పృథ్వీ కూడా ఈ ఘటనపై స్పందించాడు. సీనియర్ల వేధింపులపై ఫిర్యాదు చేసినా మేనేజ్‌మెంట్‌ పట్టించుకోలేదని ఆరోపించాడు.

మరోవైపు ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ప్రీతిని వేధింపులకు గురిచేసిన వైద్య విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. సీనియర్‌ విద్యార్థి సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు వేధింపుల కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Viral News | చిన్నారి చికిత్స కోసం రూ. 11.6 కోట్లు దానం.. అనామక వ్యక్తిపై నెటిజనుల ప్రశంసలు

ID card for Dogs | జీహెచ్‌ఎంసీ పరిధిలో కుక్కలకు ఐడీ కార్డులు.. మున్సిపల్ అధికారులకు కీలక ఆదేశాలు

Medical student Preethi | విషమంగా వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి.. సైఫ్‌ను కఠినంగా శిక్షించాలన్న ఆమె తండ్రి!

Zombie Drug | ఒళ్లు నొప్పుల కోసం వేసుకునే మందుతో జాంబీలుగా మారుతున్న అమెరికన్లు..

Tirupati City | రేపే తిరుపతి నగరం 893 వ పుట్టిన రోజు మహోత్సవం.. బర్త్ డేను ఎలా నిర్ధారించారో తెలుసా !

Exit mobile version