Home News International Zombie Drug | ఒళ్లు నొప్పుల కోసం వేసుకునే మందుతో జాంబీలుగా మారుతున్న అమెరికన్లు..

Zombie Drug | ఒళ్లు నొప్పుల కోసం వేసుకునే మందుతో జాంబీలుగా మారుతున్న అమెరికన్లు..

Zombie Drug | కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఉడిందన్న సామేత విన్నారా? ఇప్పుడు అమెరికన్లు ఇదే అనుకుంటున్నారట. ఎందుకంటే ఒళ్లు నొప్పుల కోసం వేసుకునే మందుతో అక్కడి జనాలు జాంబీలుగా మారిపోతున్నారట. అమెరికాలోని మెజారిటీ నగరాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఇదే విషయాన్ని ప్రపంచంలోనే ప్రముఖ టైమ్ మ్యాగజైన్‌ పేర్కొన్నది.

ఇంతకీ ఆ మందు ఏంటనుకుంటున్నారా ? ‘జైలజీన్‌ (Xylazine)’ అనే డ్రగ్‌. దీన్ని అధిక మోతాదులో తీసుకోవడం ద్వారా శరీర చర్మం కుళ్లిపోయి జాంబీల మాదిరిగా కనిపిస్తున్నారట. దీన్ని ట్రాంక్‌ అనే పేరుతో కూడా పిలుస్తున్నారు. అమెరికాలోని చాలా నగరాల్లోని ప్రజలపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుందని కథనంలో పేర్కొన్నారు.

జంతువులకు వినియోగించే జైలజీన్‌..

ఒళ్లు నొప్పులకని వేసుకుంటున్న ఈ జైలజీన్‌ డ్రగ్‌ జంతువులకు వినియోగించే మందు. జంతువులకు వినియోగించేందుకు మాత్రమే ఎఫ్‌డీఏ అనుమతించిందట. అయితే ఇది మనుషులకు సురక్షితం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇది మోతాదులో వేసుకుంటే ఓకే కానీ.. హెరాయిన్‌లా వాడితేనే అసలు సమస్య అంటున్నారు. ఈ డ్రగ్‌ ఫిలడెల్ఫియాలో మొదలై.. అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కో.. లాస్‌ ఏంజిల్స్‌ వంటి నగరాలకు విస్తరించింది. ప్రస్తుతం ఈ డ్రగ్‌ను తక్కువ ధరకే వీధుల్లో అమ్మడం అక్కడి అధికారులను, ప్రజలను కలవరపెడుతోంది.

Exit mobile version