Home News AP Tirupati City | రేపే తిరుపతి నగరం 893 వ పుట్టిన రోజు మహోత్సవం.. బర్త్...

Tirupati City | రేపే తిరుపతి నగరం 893 వ పుట్టిన రోజు మహోత్సవం.. బర్త్ డేను ఎలా నిర్ధారించారో తెలుసా !

Tirupati City | కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి క్షేత్రం విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శ్రీ మహావిష్ణువు స్వయంభువుగా వెలిసిన ఈ క్షేత్రాన్ని జన్మలో ఒక్కసారైనా దర్శించుకోవాలని తెలుగు రాష్ట్రాల్లోని హిందువులు కోరుకుంటారు. గోవింద నామ స్మరణలతో ఏడుకొండలను ఎక్కి శ్రీవారిని దర్శించుకుంటారు. శ్రీనివాసుడి దర్శనంతో తమ జన్మ పావనమైందని భావిస్తుంటారు. అయితే ఏడుకొండల మీద ఉన్న తిరుమల క్షేత్రాన్ని ఎంత పవిత్రంగా చూస్తారో.. శ్రీవారి పాదాల చెంత కొలువైన తిరుపతి నగరాన్ని కూడా అంతే పవిత్రంగా చూస్తుంటారు. అలాంటి మహిమాన్విత నగరం గురువారం తన పుట్టిన రోజును జరుపుకోబోతుంది. అదేంటి నగరానికి బర్త్ డే ఏంటని ఆశ్చర్యపోతున్నారా? కానీ ఇదే నిజమేనండీ.. ఫిబ్రవరి 24వ తేదీన తిరుపతి నగరం తన 893వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోబోతోంది. దీనికోసం భారీగా ఏర్పాట్లు కూడా చేశారు.

ఎవరు మొదలుపెట్టారు?

తిరుపతి నగరానికి పుట్టిన రోజు జరిపే ఆనవాయితీకి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. గత ఏడాది ఘనంగా 892వ పుట్టినరోజు నిర్వహించారు. ఇప్పుడు వరుసగా రెండో ఏడాది కూడా తిరుపతి క్షేత్రానికి బర్త్ డే జరిపేందుకు సిద్ధమయ్యారు. ఈ నగరం 893వ పుట్టిన రోజు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కరపత్రాలను ముద్రించి ఆహ్వానాలు కూడా పంపించారు. రామానుజ పరంపరలో భాగమైన జీయర్ మఠం వద్దకు వెళ్లి పెద్ద జీయర్, చిన్నజీయర్‌లకు టీటీడీ ఆహ్వాన పత్రికలను కూడా అందజేసింది.

ఇదే పుట్టిన రోజు అని ఎలా నిర్ణయించారు?

తిరుపతి నగరం క్రీ.శ.1130వ సంవత్సరం ఫిబ్రవరి 24న ఆవిర్భవించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 893 సంవత్సరాల క్రితం గోవిందరాజ ఆలయం ప్రతిష్ట, మాడ వీధుల ఏర్పాటు ద్వారా తిరుపతి పట్టణ ఆవిర్భావానికి జగద్గురు రామానుజాచార్యులు నాంది పలికినట్లు శాసన ఆధారాలు పేర్కొంటున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి 20న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పురాతన శాసనాలు తెప్పించి.. ఇందుకు రుజువులు చూపించారు కూడా. తిరుపతి నగరం ఏర్పడిన తీరును వివరించారు. తాజాగా తిరుపతి నగర పుట్టినరోజు ఆహ్వాన పత్రికలో కూడా ఆ వివరాలను పేర్కొన్నారు. 112 ఏళ్ల వయసులో రామానుజాచార్యులు.. గోవిందరాజస్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్టించి, నాలుగు మాఢ వీధులను శంకుస్థాపన చేశారు. తిరుమల ఆలయానికి బ్రాహ్మణ అగ్రహారంగా ఉన్న ఆ పట్టణం తొలుత గోవిందరాజపురంగా పిలవబడింది. కాలక్రమంలో రామానుజాపురంగా మారింది. 1220-40 మధ్య కాలం నుంచి ఈ నగరాన్ని తిరుపతి అని పిలుస్తున్నారు. తిరుపతి నగరం పుట్టిన రోజు గురించి గోవిందరాజస్వామి గుడిలో నిత్య పూజా కైంకర్యంలో, మంత్ర పుష్పంలో ప్రతి దినం పలికే మంత్రంలో స్పష్టంగా ఉందని భూమన వివరించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Devotional | ఆడవాళ్లు కొబ్బరి కాయ ఎందుకు కొట్టవద్దు?

Black Thread | పిల్లల కాలికి నల్లదారం కడుతున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి.

Shankam | ఇంట్లో శంఖం ఉంచుకోవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

Exit mobile version