Wednesday, April 24, 2024
- Advertisment -
HomeLatest NewsJalebi Baba | భక్తి ముసుగులో 120 మంది మహిళలపై అత్యాచారం.. జిలేబీ బాబాకు 14...

Jalebi Baba | భక్తి ముసుగులో 120 మంది మహిళలపై అత్యాచారం.. జిలేబీ బాబాకు 14 ఏళ్ల జైలు

Jalebi Baba | జిలేబీ బాబాకు ఫతేహాబాద్ జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 120 మంది మహిళలపై అత్యాచారం చేసి, ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి డబ్బుల కోసం వేధించిన కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. 14 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 35 వేల జరిమానా విధించింది.

హరియాణాలోని ఫతేహాబాద్ జిల్లా తోహనా పట్టణంలో జీలేబీ బాబా జన్మించాడు. ఆయన అసలు పేరు అమర్ వీర్. 18 ఏళ్ల వయసులో ఫతేహాబాద్ వలస వచ్చి అక్కడే జిలేబీ దుకాణం పెట్టాడు. తనకు మంత్రాలు తెలుసని, దయ్యాలను వదిలిస్తా అంటూ అందరినీ నమ్మించాడు. బాబాగా పేరు మార్చుకున్నాడు. అమయాక మహిళలను మోసం చేస్తూ.. జిలేబీ దుకాణం నడిపే అమర్ వీర్ కాస్తా.. జిలేబీ బాబాగా మారిపోయాడు. తన వద్దకు వచ్చే మహిళలకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసి వీడియోలు తీసేవాడు. డబ్బులు ఇవ్వకుంటే వీడియోలు బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేసేవాడు.

అయితే నాలుగేళ్ల క్రితం జిలేబీ బాబా ఆగడాలు బయటపడ్డాయి. 2018లో ఓ ఆలయంలో తనపై అత్యాచారం చేశాడని అతనికి తెలిసిన వాళ్లలో ఒకరి భార్య జిలేబీ బాబాపై కేసు పెట్టింది. దీంతో విచారణ చేపట్టగా సంచలన విషయాలు బయటపడ్డాయి. మహిళలపై అత్యాచారాలకు సంబంధించిన 120 వీడియోలను పోలీసులు అతని ఫోన్లో గుర్తించారు. మహిళలకు మత్తు మందు ఇచ్చి అత్యాచారాలకు పాల్పడినట్లు తేల్చారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Veerasimha reddy Review | వీరసింహారెడ్డి రివ్యూ.. బాలయ్య మాస్ ఫార్ములా వర్కవుట్ అయ్యిందా?

India Vs New Zealand Tickets | ఉప్పల్‌ స్టేడియంలో 18న వన్డే మ్యాచ్.. టికెట్ల ధరలు ఎంత ? ఒక్కొక్కరు ఎన్ని టికెట్లు తీసుకోవచ్చు?

natu natu song | గల్లీ బాయ్ పేరు.. అంతర్జాతీయ వేదిక పై.. గర్వంగా ఉందంటూ ఎమోషన్‌ అయిన రాహుల్‌ సిప్లిగంజ్‌

Natu Natu | ఉక్రెయిన్ అధ్యక్షుడి ఇంటి ముందే నాటు నాటు సాంగ్ చిత్రీకరణ.. పర్మిషన్ ఇవ్వడానికి కారణమిదే!

Anupama parameswaran | డీజే టిల్లు సీక్వెల్‌లో అనుపమ ఫిక్స్.. అల్టర్‌నేట్ ప్రొఫేషన్ అంటూ పోస్టు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News