Anupama parameswaran | గత ఏడాది వచ్చిన డీజే టిల్లు సినిమా యూత్‌కు తెగ నచ్చేసింది. సిద్ధూ జొన్నలగొడ్డ డైలాగ్ డెలివరీ, నేహా శెట్టి యాటిట్యూడ్ సినిమాకు మంచి బజ్ తీసుకొచ్చింది. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ తీసుకొస్తామని అప్పుడే ప్రకటించారు. టిల్లు స్క్వైర్ అనే టైటిల్‌ను కూడా అనౌన్స్ చేశారు. కానీ హీరోయిన్ మాత్రం ఫైనల్ కాలేదు. నేహా శెట్టికి బదులు ఈ సినిమాలో మరో హీరోయిన్‌ను తీసుకుంటామని చెప్పడంతో ఎవర్నీ తీసుకుంటారా అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూశారు. ఈ క్రమంలో చాలా పేర్లు వినిపించాయి. అనుపమ పరమేశ్వరన్ పేరును కన్ఫార్మ్ చేసినప్పటికీ ఆమె కూడా తప్పుకుందని వార్తలు వచ్చాయి. కానీ ఎట్టకేలకు టిల్లు స్వ్కైర్‌లో హీరోయిన్ ఎవరనేది కన్ఫార్మ్ అయిపోయింది.

డీజే టిల్లులో రాధిక పాత్రలో నేహా శెట్టి యాక్టింగ్‌ను ఎవరు మరిచిపోలేరు. ఆ క్యారెక్టర్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు టిల్లు స్క్వైర్‌లో రాధిక రోల్‌లో మరో హీరోయిన్ కనిపిస్తుందని చెప్పేసరికి ఆ రేంజ్‌లో ఎవర్ని చిత్ర బృందం ఎంపిక చేస్తుందనే ఉత్కంఠ ఏర్పడింది. దీంతో చాలామంది హీరోయిన్ల పేర్లు తెర మీదకు వచ్చాయి. కానీ అనుపమ పరమేశ్వరన్‌ను ఎంపికచేశామని చిత్ర బృందం ప్రకటించింది. అయినప్పటికీ ఈ పుకార్లు ఆగలేదు. పలు కారణాలతో అనుపమ ఈ సినిమా నుంచి తప్పుకుందని వార్తలు వచ్చాయి. ఆమె ప్లేస్‌లో మీనాక్షి చౌదరి ఎంపికైందని వినిపించింది. కొద్దిరోజులకే పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా కన్ఫార్మ్ అయ్యిందని ప్రచారం జరిగింది. ఈ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ అడుగుతున్నట్టు కూడా పుకార్లు వచ్చాయి. టిల్లు స్క్వైర్ మూవీ హీరోయిన్ గురించి ఇంత చర్చ జరిగినా చిత్ర బృందం మాత్రం సైలెంట్‌గా ఉండిపోయింది. కానీ అనుపమనే ఈ సినిమా హీరోయిన్‌గా నటిస్తోందని కన్ఫార్మ్ అయిపోయింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టుతో దీనిపై స్పష్టత ఇచ్చింది.
టిల్లు స్వ్కైర్ సెట్స్‌లోకి తాజాగా అడుగుపెట్టిన అనుపమ.. సిద్దూ జొన్నలగొడ్డ జుట్టుకు జెల్ రాస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఇది నా అల్టర్‌నేట్ ప్రొఫెషన్ నవ్ ( ఇదే ఇప్పుడు నా ప్రత్యామ్నయ వృత్తి ) అంటూ రాసుకొచ్చింది. ఇప్పుడు హీరోయిన్ కన్ఫర్మ్ కావడంతో రాధిక రోల్‌లో అనుపమ ఎలా కనిపిస్తుందో చూడాలనే ఇంట్రెస్ట్ ఫ్యాన్స్‌లో పెరిగిపోయింది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Nabha Natesh | నభా నటేశ్‌కు యాక్సిడెంట్.. పలు సర్జరీలతో కోలుకున్న ఇస్మార్ట్ బ్యూటీ
KGF Chapter3 | కేజీఎఫ్ సీక్వెల్స్‌లో రాఖీ భాయ్ ఉండడు.. బాంబు పేల్చిన హోంబలే బ్యానర్స్
Vaarasudu | వెనక్కి తగ్గిన దిల్ రాజు.. వారసుడు సినిమా రిలీజ్ వాయిదా
Sreemukhi | మరీ ఇంత ఘోరమా.. పెళ్లి వార్తలపై స్పందించిన బుల్లితెర యాంకర్ శ్రీముఖి