Thursday, April 25, 2024
- Advertisment -
HomeEntertainmentNatu Natu song | గల్లీ బాయ్ పేరు.. అంతర్జాతీయ వేదిక పై.. గర్వంగా ఉందంటూ...

Natu Natu song | గల్లీ బాయ్ పేరు.. అంతర్జాతీయ వేదిక పై.. గర్వంగా ఉందంటూ ఎమోషన్‌ అయిన రాహుల్‌ సిప్లిగంజ్‌

Natu Natu song | ప్రతిష్టాత్మకమైన గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు రావడంతో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు రావడంతో తొందరలోనే అకాడమీ అవార్డు కూడా సొంతం చేసుకుంటుందని అంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలుగు వాళ్ల ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారని ఆర్‌ఆర్‌ఆర్‌ డైరెక్టర్‌ రాజమౌళి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణి, పాట రాసిన చంద్రబోస్‌, పాడిన కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ను అంతా పొగిడేస్తున్నారు. ఈ క్రమంలో గల్లీ బాయ్‌గా ఉన్న తన పేరు అంతర్జాతీయ అవార్డుల వేదికపై వినిపించడంతో రాహుల్‌ సిప్లిగంజ్‌ ఎమోషనల్‌ అయ్యాడు.

ఇప్పటి వరకు నేను పాడిన ఏ పాటకు కూడా అవార్డు రాలేదు. ఆ ఒక్క విషయంలోనే నేను ఎంతో బాధపడేవాడిని. కానీ ఆ భగవంతుడు ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో అవార్డు రావాలని రాసి పెట్టాడేమో… అందుకే ఇంతకాలం వేచి ఉండేలా చేశాడేమో అని రాహుల్‌ సిప్లిగంజ్‌ మీడియాకు తెలిపాడు. అంతర్జాతీయ వేదికపై ఈ గల్లీబాయ్‌ పేరు ప్రస్తావించడం ఎంతో గర్వంగా ఉందంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడు.

మళ్లీ ఇలాంటి సందర్భం వస్తుందో రాదో కూడా నాకు తెలియదు. నాకు జీవితాంతం గుర్తుండిపోయే సందర్భం ఇది అంటూ ఎమోషనల్‌ అయ్యాడు. తనకు ఈ అవకాశం ఇచ్చిన కీరవాణి, రాజమౌళి, ఆర్‌ఆర్ఆర్‌ చిత్ర బృందానికి మొత్తానికి ధన్యవాదాలు తెలిపాడు.

ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో నాటు నాటు సాంగ్‌కు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును ప్రకటించారు. లాస్‌ ఏంజెలిస్‌లో అట్టహాసంగా జరిగిన వేడుకలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీరవాణి ఈ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా అంతర్జాతీయ వేదికపై తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ పాటను తీసిన రాజమౌళికి, పాట పాడిన తన కుమారుడు కాలభైరవకి, రాహుల్‌ సిప్లిగంజ్‌ కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. వెండితెరపై తమ డ్యాన్స్‌తో అభిమానులను కట్టిపడేసిన రామ్ చరణ్‌, జూనియర్ ఎన్టీఆర్‌ కి శుభాకాంక్షలు తెలిపారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Natu Natu | ఉక్రెయిన్ అధ్యక్షుడి ఇంటి ముందే నాటు నాటు సాంగ్ చిత్రీకరణ.. పర్మిషన్ ఇవ్వడానికి కారణమిదే!

RRR Golden Globe Award | తాను రాసిన పాటకు గోల్డెన్ గ్లోబ్ రావడంపై భావోద్వేగానికి గురైన చంద్రబోస్.. ఏమన్నారో తెలుసా ?

RRR Sequel | ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌పై రాజమౌళి కీలక అప్‌డేట్.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన వేళ నిర్ణయం మార్చుకున్న జక్కన్న

RRR Naatu Naatu | రికార్డులు సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్.. నాటు నాటు సాంగ్‌కు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News