Friday, March 29, 2024
- Advertisment -
HomeLatest NewsIndia Vs New Zealand Tickets | ఉప్పల్‌ స్టేడియంలో 18న వన్డే మ్యాచ్.. టికెట్ల...

India Vs New Zealand Tickets | ఉప్పల్‌ స్టేడియంలో 18న వన్డే మ్యాచ్.. టికెట్ల ధరలు ఎంత ? ఒక్కొక్కరు ఎన్ని టికెట్లు తీసుకోవచ్చు?

India Vs New Zealand Tickets | ఈనెల 18 న భారత్, న్యూజీలాండ్ మధ్య హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం ( Uppal stadium ) లో తొలి వన్డే జరగనుంది. అయితే మ్యాచ్‌ టికెట్లకు సంబంధించిన హెచ్‌సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజహారుద్దీన్ ప్రకటన విడుదల చేశారు. మ్యాచ్ టికెట్లన్నీ ( match tickets ) ఆన్‌లైన్‌లోనే విడుదల చేస్తామని చెప్పారు. పేటీఎం వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేయొచ్చని వెల్లడించారు.

ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసిన తర్వాత కలెక్షన్ పాయింట్ల వద్ద ఫిజికల్ టికెట్లను కలెక్ట్ చేసుకోవాలి. క్యూఆర్ కోడ్ చూపిస్తే టికెట్లు ఇస్తారు. అయితే కలెక్షన్ పాయింట్ల వద్ద ఫిజికల్ టికెట్ పొందాలంటే మాత్రం ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరి. ఫిజికల్ టికెట్లను ఎల్బీ స్టేడియం, జీఎంసీ బాలయోగి స్టేడియం (గచ్చిబౌలి) లో జనవరి 15 నుంచి ఇవ్వనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఫిజికల్ టికెట్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.

గత ఏడాది సెప్టెంబర్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్ టికెట్ల కొనుగోలు విషయంలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. సికింద్రాబాద్ జింఖానా మైదానంలో టికెట్ల కోసం వచ్చిన క్రికెట్ అభిమానల మధ్య తొక్కిసలాట జరిగింది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మరోసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇప్పుడు హెచ్‌సీఏ ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నెల 18 న భారత్, న్యూజీలాండ్ మధ్య జరిగే వన్డే మ్యాచ్ టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారు.. టికెట్ల ధరలెంత.. ఒక్కొక్కరికి ఎన్ని టికెట్లు ఇస్తారు అనే వివరాలు మీకోసం..

అందుబాటులో అందుబాటులో ఉన్న టికెట్లు29,417
ఆన్‌లైన్లో అందుబాటులోకి వచ్చేదిజనవరి 13, 14, 15, 16 ( ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి )
13వ తేదీన 6 వేల టికెట్లు, 14న ఏడు వేలు, 15న ఏడు వేలు, 16న మిగిలిన టికెట్లు ఆన్‌లైన్లో అందుబాటులో ఉంటాయి.
టికెట్ల ధరలురూ.850, రూ. 1000, రూ.1250, రూ. 1500, రూ. 2500, రూ. 5000, రూ. 7500, రూ.9000, రూ. 10,000, రూ. 17,700, రూ.20,650.
ఒక్కొక్కరికి ఎన్ని టికెట్లుగరిష్ఠంగా 4 టికెట్లు కొనొచ్చు
కలెక్షన్ పాయింట్లుఎల్బీ స్టేడియం, జీఎంసీ బాలయోగి స్టేడియం (గచ్చిబౌలి)

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

natu natu song | గల్లీ బాయ్ పేరు.. అంతర్జాతీయ వేదిక పై.. గర్వంగా ఉందంటూ ఎమోషన్‌ అయిన రాహుల్‌ సిప్లిగంజ్‌

Natu Natu | ఉక్రెయిన్ అధ్యక్షుడి ఇంటి ముందే నాటు నాటు సాంగ్ చిత్రీకరణ.. పర్మిషన్ ఇవ్వడానికి కారణమిదే!

Anupama parameswaran | డీజే టిల్లు సీక్వెల్‌లో అనుపమ ఫిక్స్.. అల్టర్‌నేట్ ప్రొఫేషన్ అంటూ పోస్టు

RRR Sequel | ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌పై రాజమౌళి కీలక అప్‌డేట్.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన వేళ నిర్ణయం మార్చుకున్న జక్కన్న

AP Movie Tickets | వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమా నిర్మాతలకు గుడ్ న్యూస్.. ప్రేక్షకులకు షాక్.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News