Home News International Warship Sinks | సముద్రంలో మునిగిపోయిన నేవీ నౌక.. 31 మంది గల్లంతు

Warship Sinks | సముద్రంలో మునిగిపోయిన నేవీ నౌక.. 31 మంది గల్లంతు

Warship Sinks | థాయ్‌లాండ్‌లో ఓ యుద్ధ నౌక మునిగిపోయింది. గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్‌లో గస్తీ నిర్వహిస్తున్న నేవీ నౌక.. తుఫాను కారణంగా బోల్తా పడింది. స్థానిక కాలమాన ప్రకారం ఆదివారం రాత్రి 11:30 గంటలకు హెచ్‌టీఎంఏఎస్ నౌక నీటిలో మునిగిపోయింది. ప్రమాద సమయంలో వందమందికిపైగా నావికులు నౌకలో ఉన్నారు. ఈ ఘటనలో 75 మందిని కాపాడగా.. మరో 31 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం నౌకలు, హెలికాప్టర్ల సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఆదివారం సాయంత్రం థాయ్‌లాండ్‌లోని ప్రచుప్ ఖిరి ఖాన్ ప్రావిన్స్‌లో సముద్ర తీరానికి 20 నాటికల్ మైళ్ల దూరంలో నౌక గస్తీలో పాల్గొంది. అదే సమయంలో ఈదురుగాలుల కారణంగా సముద్రపు నీరు యుద్ధ నౌకలోకి చేరుకుంది. దీని వల్ల విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది.ఇంజిన్లు పనిచేయకపోవడం, కరెంట్ లేకపోవడం వల్ల నౌకలోకి భారీగా నీరు చేరడంతో ఒకవైపు వంగిపోయింది. మెల్లమెల్లగా నౌక నీటిలో బోల్తా పడిపోయింది. ఆ సమయంలో నౌకలో 106 మంది నేవీ సిబ్బంది ఉన్నారు. వీరిలో 75 మందిని రక్షించారు. నీటిలో గల్లంతైన 31 మంది కోసం ఆదివారం అర్ధరాత్రి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నౌకలు, హెలికాప్టర్ల సాయంతో గల్లంతైన వారికోసం వెతుకుతున్నారు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు కలుగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను థాయ్ నేవీ ట్వీట్ చేయడంతో వైరల్‌గా మారాయి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

New year celebrations | డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికితే ఆరు నెలల జైలు శిక్ష.. న్యూఇయర్ వేడుకల వేళ హైదరాబాద్ పోలీసుల షాక్

Rythu bandhu | తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతుబంధు పడేది అప్పట్నుంచే !!

IT Hubs in telangana | తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ విస్తరిస్తున్న ఐటీ.. ఏ జిల్లాలో ఐటీ హబ్‌లు ఏర్పాటు కాబోతున్నాయి?

Telangana Congress | తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ల అసమ్మతి రాగం.. రేవంత్ రెడ్డికి చెక్ పెట్టే ఆలోచనలో నేతలు.. భట్టికి కోమటిరెడ్డి ఫోన్

Exit mobile version