Home Lifestyle Health Birth Defects | గర్భంలో ఉన్న శిశువులో లోపాలను ముందే గుర్తించడం ఎలా.. ఈ పరీక్షలు...

Birth Defects | గర్భంలో ఉన్న శిశువులో లోపాలను ముందే గుర్తించడం ఎలా.. ఈ పరీక్షలు చేపిస్తే తెలిసిపోతుంది

Birth Defects | గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డ పుట్టే వరకు తల్లిదండ్రుల్లో ఎన్నో అనుమానాలు, భయాలు ఉంటాయి. పుట్టే బిడ్డలో ఏదైనా లోపాలుంటే ఎలా.. ముందస్తుగా ఎలా గుర్తించాలి అన్న డౌట్లు ఉండటం సహజమే. అయితే ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయినప్పటి నుంచి వైద్యుల సలహాలూ, సూచనలు తప్పకుండా పాటించాలి. అనవసరంగా టెస్టులకు డబ్బులు ఖర్చుపెట్టడం ఎందుకు అనే ఆలోచన చేయకుండా.. వైద్యులు సూచించిన పరీక్షలు చేపించాలి. ముఖ్యంగా ఏ టైంలో ఎలాంటి పరీక్షలు చేపించాలంటే..

గర్భం దాల్చిన 90 రోజుల్లోనే తల, వెన్నెముక లోపాలు, ఇతరత్రా ఇబ్బందులను తెలుసుకునేందుకు న్యూరల్‌ ట్యూబ్‌ స్కాన్‌, డబుల్‌ స్క్రీన్ టెస్ట్‌ చేస్తారు. డౌన్స్‌ సిండ్రోమ్‌ లక్షణాలు తెలుసుకోవడానికి కూడా పరీక్షలున్నాయి. ఇది చేయించుకునే టైం దాటిపోతే క్వాడ్రపుల్‌ పరీక్ష చేయించుకోవచ్చు. దీని ద్వారా క్రోమోజోముల లోపాలను గుర్తించే అవకాశం ఉంటుంది.

180 రోజుల్లోపు బిడ్డలో ఏమైనా లోపాలుంటే టిఫా 2, ట్రిపుల్‌ స్క్రీన్‌ పరీక్షల్లో తెలిసిపోతుంది. బిడ్డ శరీరంలో అవయవాలు, వాటి ఎదుగుదలలో లోపాలు ఉంటే ఈ పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఉమ్మనీరు తీసి క్రోమోజోములను పరీక్షిస్తారు. 2డీ ఎకో పరీక్షలు చేస్తారు. కొన్నిసార్లు మరింత అవగాహన కోసం 3డీ, 4డీ స్కాన్‌లూ చేస్తారు. వీటి ద్వారా గ్రహణం, మొర్రి వంటి సమస్యలున్నా తెలుసుకోవచ్చు.

నెలలు నిండుతుంటే మాత్రం హై బీపీ, డయాబెటీస్‌ ఉన్న తల్లులు నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. ఎస్‌ఎస్‌టీ, నాన్‌స్ట్రెస్‌ టెస్ట్‌తో పాటు డాప్లర్‌ పరీక్షలు కూడా చేస్తారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Fact Check | 5G వ‌చ్చింద‌ని ఇండియాలో 3జీ, 4జీ మొబైల్స్‌ను ఆపేస్తున్నారా?

Whatsapp Tricks | ఫోన్ నంబ‌ర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్‌లో మెసేజ్ ఇలా పంపించండి

Google Search | గూగుల్‌లో ఈ ప‌దాల‌ను అస్స‌లు సెర్చ్ చేయ‌కండి

Exit mobile version