Home Latest News New year celebrations | డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికితే ఆరు నెలల జైలు శిక్ష.. న్యూఇయర్...

New year celebrations | డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికితే ఆరు నెలల జైలు శిక్ష.. న్యూఇయర్ వేడుకల వేళ హైదరాబాద్ పోలీసుల షాక్

New year celebrations | న్యూఇయర్ వేడుకల్లో ధూంధాం చేద్దాం.. తెల్లారేదాకా ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే మీ ప్లాన్స్ అన్నీ చేంజ్ చేసుకోవాల్సిందే. కొత్త సంవత్సరం రోజున అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత రోడ్లపై తిరిగేతే సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి హైదరాబాద్ పోలీసులు సిద్ధమయ్యారు. కొత్త సంవత్సరం వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు హైదరాబాద్ పోలీసులు కఠిన నియమాలు అమలు చేస్తున్నారు.

పబ్బులకు స్ట్రాంగ్ వార్నింగ్

ఎక్సైజ్ శాఖ నిర్దేశించిన సమయం వరకే మద్యం విక్రయాలు జరపాలని హైదరాబాద్ పోలీసులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పబ్బుల్లోకి మైనర్లను అనుమతించవద్దని ఆదేశించారు. అలాగే న్యూఇయర్ ఈవెంట్స్ కోసం 10 రోజుల ముందే పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. పబ్బులు, ఈవెంట్స్‌లో అశ్లీల నృత్యాలు ప్రోత్సహిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. పబ్బుల్లో 45 డెసిబుల్స్ కంటే ఎక్కువ సౌండ్ రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. అలాగే సామర్థ్యం కంటే ఎక్కువగా ఈవెంట్స్ పాసులు కూడా ఇవ్వరాదని సూచించారు. న్యూఇయర్ వేడుకల్లో గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తాగి బండి నడిపితే ఆరు నెలల జైలు శిక్ష

న్యూఇయర్ వేడుకల సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే రూ.10 వేల జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. అదే మైనర్లు వాహనం నడుపుతూ దొరికితే బండి యజమానిపై కేసు నమోదు చేస్తామన్నారు. పబ్బులు, ఈవెంట్లకు వచ్చిన వారు తిరిగి వెళ్లడానికి క్యాబ్‌ సర్వీస్ అందించాల్సిన బాధ్యత నిర్వాహకులదేనని స్పష్టం చేశారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

AP CM Jagan mohan reddy | 32 మంది ఎమ్మెల్యేలకు ఏపీ సీఎం జగన్‌ వార్నింగ్‌.. పద్దతి మార్చుకోకుంటే టికెట్‌ ఇచ్చేదే లేదు

Avatar2 Review | అవతార్ 2 రివ్యూ.. జేమ్స్ కామెరూన్ మరోసారి మాయ చేశాడా?

Macherla | రణరంగంగా మారిన మాచర్ల.. టీడీపీ, వైసీపీ శ్రేణుల వీరంగంతో హైటెన్షన్..

Exit mobile version