Home News International Putin | ఉక్రెయిన్‌పై సంచలన ఆరోపణలు చేసిన పుతిన్‌.. అలాంటి వారి ఆటలు సాగనిచ్చేదే లేదంటూ...

Putin | ఉక్రెయిన్‌పై సంచలన ఆరోపణలు చేసిన పుతిన్‌.. అలాంటి వారి ఆటలు సాగనిచ్చేదే లేదంటూ హెచ్చరిక!

Putin | ఉక్రెయిన్‌ దేశం మీద అణుబాంబులతో విరుచుకుపడుతున్న రష్యా తాజాగా సంచలన వ్యాఖ్యాలు చేసింది. ఉక్రెయిన్ సరిహద్దులోని దక్షిణ బ్రియాన్స్క్‌ రీజియన్‌లో తమ దేశ సైనికులు ఉగ్రవాదులతో పోరాడుతున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తెలిపారు. ఉక్రెయిన్‌ కు చెందిన విధ్వంసక బృందమే ఈ మారణ హోమానికి పాల్పడుతోందని పుతిన్‌ ఆరోపించారు.

ఉక్రెయిన్‌ మీద రష్యా సైన్యం ఎలాంటి కాల్పులు కానీ, దాడులు కానీ చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రష్యా తప్పుడు ప్రచారం చేస్తూ రెచ్చగొట్టాడానికి ప్రయత్నిస్తుందని ఉక్రెయిన్ ఆరోపించింది. రష్యా వెల్లడిస్తున్న ప్రకటనల బట్టి చూస్తే రష్యాకి వ్యతిరేకంగా ఉన్నవారు ఉక్రెయిన్‌ పౌరులపై దాడులకు పాల్పడి.. దానిని ఉక్రెయిన్‌ పై నెట్టివేయాలని చూస్తున్నట్లు జెలెన్‌ స్కీ ప్రభుత్వం విమర్శించింది.

ప్రత్యేక సైనిక చర్య పేరిట ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రకు పాల్పడిన తర్వాత సరిహద్దు ప్రాంతాల్లో గతేడాదిగా అస్థిరత నెలకొంది. బాంబు దాడులు, తుపాకీ కాల్పులు, కర్ఫ్యూలతో ఇరు దేశాల్లోనూ అనిశ్చితి నెలకొంది. గురువారం ఓ మీడియా ప్రసంగంలో పుతిన్‌ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లోని ఓ బృందం పసిపిల్లలు, స్థానిక ప్రజల మీద కాల్పులు జరుపుతోందని అన్నారు.

రష్యా చరిత్రను, భాషను దోచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ బృందాలు రెచ్చిపోతున్నాయని దాని వలన ఉపయోగం ఏమి ఉండదని ఆయన పేర్కొన్నారు. అలాంటి శక్తులు ఏమైనా ఉంటే అణిచివేస్తామని పుతిన్‌ పేర్కొన్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Rahul Gandhi | ఆ సమయంలో నన్ను చంపేసేవారమో.. రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు!

Emoji | ఎమోజీల ట్రెండ్‌ ఎలా మొదలైంది? అవి పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయి?

First Video on Youtube | యూట్యూబ్లో ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియో ఏంటో తెలుసా

CRED CEO | ఆ కంపెనీ సీఈవో జీతం కేవలం 15 వేలే.. ఎందుకలా?

Triangle Love Story | అబ్దుల్లాపూర్‌మెట్ తరహాలో ప్రేమించిన అమ్మాయి కోసం స్నేహితుడి హత్య.. 17 నెలల తర్వాత వెలుగులోకి.. ఆస్తిపంజరమే మిగిలింది

Telangana | నిప్పులాంటి మగాడివి అయితే ఏ అగ్గి నిన్నేం చేయలేదు.. అక్రమ సంబంధం రుజువు చేయాలని పంచాయతీ పెద్దల ఆటవిక తీర్పు

Exit mobile version