Home Entertainment Oscars 2023 | ఆస్కార్‌ వేదికపై ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోవడానికి కారణం అదేనా?

Oscars 2023 | ఆస్కార్‌ వేదికపై ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోవడానికి కారణం అదేనా?

Image Source : Twitter

Oscars 2023 | తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఈ ఏడాది ఇచ్చే ఆస్కార్‌ అవార్డులు ఎంతో ప్రత్యేకమైనవి. ఎందుకంటే ఆస్కార్ బరిలో తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ నిలవడమే అందుకు కారణం. నాటు నాటు పాటకు ఎలాగైన ఆస్కార్ వస్తుందన్న నమ్మకంతో ఉంది రాజమౌళి టీం. అదే గనుక జరిగితే భారతీయ సినిమాకు ఇది చారిత్రాత్మక విజయం అవుతుంది.

వరల్డ్ వైడ్‏గా ఉన్న సినిమా ప్రేమికులందరి చూపు ఇప్పుడు ఆస్కార్‏ పైనే ఉంది. మన తెలుగు కుర్రాళ్ళు ఆస్కార్ వేదికపైన నాటు నాటు అంటూ లైవ్‏గా పెర్ఫార్మ్ చేసి దుమ్ముదులపనున్నారు. అయితే రీసెంట్‎గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఆస్కార్ వేడకల్లో నాటు నాటు అంటూ డ్యాన్స్ చేయనున్నాడని, తన పెర్ఫార్మెన్స్‏తో ఫిదా చేస్తాడని ఫ్యాన్స్ ఊహించారు. కానీ అలాంటిదేమీ లేదని ఎన్టీఆర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశాడు.

”ప్రపంచవ్యాప్తంగా సినిమాను సెలబ్రేట్ చేసుకునే ఆస్కార్ అవార్డుల్లో భాగం కావడం కన్నా ఓ యాక్టర్, ఫిల్మ్ మేకర్ ఏం కోరుకుంటాడు? ఆస్కార్స్ రోజున ‘ఆర్ఆర్ఆర్’ హీరోగా లేదంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నటుడిగా నేను రెడ్ కార్పెట్ మీద నడవను. భారతీయుడిగా ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద నడుస్తా. నా గుండెల్లో దేశాన్ని నింపుకొని సగర్వంగా నడుస్తా” అని ఎన్టీఆర్ సమాధానం ఇచ్చారు.

‘నాటు నాటు…’ సాంగ్, అందులో స్టెప్పుల గురించి కూడా ‘ఎంటర్టైన్మెంట్ టునైట్’ షోలో ప్రస్తావన వచ్చింది. ఆ పాటకు స్టెప్పులు వేయడం వల్ల తన కాళ్ళు ఇంకా నొప్పి పెడుతున్నాయని ఎన్టీఆర్ సరదాగా వ్యాఖ్యానించారు. సినిమా విడుదల కాకముందే నుంచే ప్రమోషన్‌ వీడియోల్లో కూడా చరణ్‌, ఎన్టీఆర్ ఆ స్టెప్పుల గురించి రాజమౌళి ఎక్కడ తగ్గలేదని.. సుమారు 17 టేక్‌ లు చేయించారని చాలా సార్లు చెప్పారు.

నాటు నాటు పాటను లైవ్‏లో వింటే ఎవరికైనా ఊపు వస్తుంది, ఎవరైనా ఆడాల్సిందే, నాకాళ్లు ఇప్పటికీ ఆడతాయి కానీ వేదికపై కాదు. ఈ పాటకు నేను రామ్ డ్యాన్స్ చేస్తామా అంటే కచ్చితంగా చెప్పలేను, ఎందుకంటే ఇద్దరం రిహార్సల్ చేయలేదు. అందుకే మేము ఆస్కార్ వేదికపై పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నాం. ఆర్ఆర్ఆర్‏ను ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు అంటూ ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Gruha Lakshmi Scheme | గృహలక్ష్మి పథకం విధివిధానాలు ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. దరఖాస్తులు ఎలా.. రూ.3లక్షలు ఎప్పుడు ఇస్తారు?

IND vs AUS | ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో క్రికెట్‌ మ్యాచ్‌.. భారత్‌, ఆస్ట్రేలియా నాలుగో టెస్టు ప్రత్యేక అతిథులుగా మోదీ, ఆంటోని ఆల్బనీస్‌

Microsoft CEO Satya Nadella | కోడింగ్‌ రాకపోయినా సాఫ్ట్‌వేర్ జాబ్ చేయొచ్చు అంటున్న సత్య నాదెళ్ల.. ఎలా?

Telangana Cabinet | సొంత స్థలం ఉన్న వాళ్లకు రూ.3లక్షల సాయం.. కొత్త పథకం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Cabinet | రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే..

Influenza | కాన్పూర్‌లో విపరీతంగా పెరుగుతున్న ఇన్ ఫ్లూ ఎంజా కేసులు.. ఎమర్జెన్సీ వార్డులు ఫుల్‌!

Traffic Challan | ప్రాణాలు తీసిన ట్రాఫిక్‌ చలాన్లు.. కట్టలేను సారు అన్నా వినలేదు.. హైదరాబాద్‌లో దారుణం!

Exit mobile version