Saturday, April 20, 2024
- Advertisment -
HomeEntertainmentOscars 2023 | ఆస్కార్‌కి ఎంపికవడం అంత కష్టమా.. అవార్డు రావాలంటే ప్రమోషన్లకే అంత ఖర్చు...

Oscars 2023 | ఆస్కార్‌కి ఎంపికవడం అంత కష్టమా.. అవార్డు రావాలంటే ప్రమోషన్లకే అంత ఖర్చు పెట్టాల్సిందేనా?

Oscars 2023 | గత కొద్ది రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా ఆస్కార్‌ మేనియా నడుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ కి ఆస్కార్‌ రావాలని యావత్‌ భారతదేశం ఆశగా ఎదురు చూస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇండియాలో.. ముఖ్యంగా తెలుగునాట ఆస్కార్ పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

తాజాగా రెండు రోజుల క్రితం ఓ ప్రముఖ దర్శక నిర్మాత ఆస్కార్ సినిమా కోసం అంత ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఆ డబ్బును ఇస్తే ఓ పది సినిమాలు తీస్తామని పబ్లిక్‌ స్టేట్‌ మెంట్‌ ఇచ్చారు. దీని గురించి ఇండస్ట్రీలోని పెద్దలు కలగజేసుకుని కౌంటర్లు కూడా ఇస్తున్నారు.

RRR Natu Natu Song
Image Source : Twitter

అసలు ఎంతో కష్టతరమైన ఆస్కార్‌ అవార్డు రావాలంటే ముందుగా ఎలాంటి పరీక్షలను ఎదుర్కొవాలి ? ఎన్ని నియమాలను దాటుకొని ఆస్కార్‌ బరిలో నిలవాలి ? ఒకవేళ మొదటిసారి అవార్డు బరిలో నిలవకపోతే ఎన్ని సార్లు దానికి ఆప్లికేషన్‌ పెట్టుకోవచ్చు ? దానికి ఎలాంటి ప్రాసెస్‌ ఉంటుంది ? అనే విషయాలపై ఓ లుక్కేయండి..

ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక అవార్డుగా భావించే ఆస్కార్ అందుకోవాలంటే.. సినిమాలు ఎలా ఉండాలి? ఒక ఇండియన్ సినిమాను ఆస్కార్ బరిలో నిలబెట్టాలంటే ఎలాంటి షరతులు ఉంటాయి? అసలు ఆస్కార్ వరకు ఇండియన్ సినిమాలు వెళ్లాలంటే.. ఆ ప్రాసెస్ ఏంటి? దాని వెనుక ఆర్థికంగా ఎంత ఖర్చు అవుతుంది? అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మన సినిమాలకు ఆస్కార్స్ లో ‘బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్’ కేటగిరిలో అవకాశం ఉంటుంది. ఏ దేశం నుంచైనా ఆస్కార్ కి ఒక సినిమా ఎంపిక అవ్వాలంటే.. రెండు మార్గాలు ఉన్నాయి.

ఆస్కార్‌కి పంపాలంటే.. ప్రాసెస్‌ ఇదే

ప్రభుత్వమే తమ దేశం తరపున ఆస్కార్ కొట్టే ఛాన్స్ ఉన్న సినిమాను ఎంపిక చేసి అధికారికంగా పంపిస్తుంది. మన దేశంలో సినిమాలను ఆస్కార్ కి పంపేందుకు ‘ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ కమిటీ ఉంటుంది.

ఆస్కార్ నామినేషన్స్ కి వెళ్లే సినిమాల వెనుక ఎఫ్ఎఫ్ఐ అధ్యక్షుడు, ఆ అధ్యక్షుడు నియమించిన కమిటీ, చైర్మన్, సభ్యులు ఇలా చాలామంది ఉంటారు. ఇండియా నుంచి ఆస్కార్ కి అధికారికంగా వెళ్లాల్సిన సినిమాలేవో వారే నిర్ణయిస్తారు. ఈ ఏడాది ఆస్కార్ రేసులోకి ఇండియా నుండి గుజరాతీ మూవీ చెల్లో షో అఫీషియల్ ఎంట్రీ దక్కించుకుంది.

ఈ నిబంధనలు మస్ట్‌..

ఇక ఆస్కార్ కి ఎంపిక అయ్యేందుకు రెండో మార్గం జనరల్ కేటగిరి. దీనికి ఎవరైనా తమ సినిమాలను సబ్మిట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కొన్ని షరతులు ఉంటాయి. అవేంటంటే.. సినిమా ఆ ఏడాది జనవరి 1 నుండి డిసెంబర్ 31 లోపే రిలీజ్ అయ్యుండాలి. సినిమా ఖచ్చితంగా యూఎస్ లోని మెట్రో నగరాలలో మినిమమ్ వారం రోజులైనా థియేట్రికల్ రన్ అయ్యుండాలి. సినిమా రన్ టైమ్ 40 నిమిషాలకు పైనే ఉండాలి. మూవీని 35mm లేదా 70mm ఫార్మాట్ లో తీసుండాలి. ఫారెన్ మూవీ అయితే.. ఆడియో ట్రాక్ లో మినిమమ్ 50% పదాలు వేరే లాంగ్వేజ్ వి ఉండాలి. ఇలా చాలా కండిషన్స్ ఉన్నప్పటికీ, ప్రధానంగా మొదటి రెండు రూల్స్ తప్పనిసరి.

భారీ ఖర్చు చేయాల్సిందేనా ?

ఆ విధంగా ఎలిజిబుల్ అయిన సినిమాలను ఆస్కార్ వాళ్ళు ‘ఆస్కార్ రిమైండర్ లిస్ట్’ అని రిలీజ్ చేస్తారు. ఈ లిస్ట్ కేవలం అర్హత కలిగినవి అని చెప్పడానికి మాత్రమే. ఈ లిస్ట్ లో ఉన్న సినిమాలు.. ‘బెస్ట్ ఇంటెర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరిలో తప్ప మిగతా వాటిలో నామినేషన్స్ పొందే ఛాన్స్ ఉంటుంది. కానీ.. ఇదంతా భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఆస్కార్ క్యాంపైన్‌కు కనీసం ప్రస్తుత లెక్కల ప్రకారం సుమారు రూ.24 కోట్ల నుంచి 82 కోట్ల వరకు ఖర్చువుతుందని తెలుస్తుంది. మామూలుగా అయితే ఆస్కార్‌ పోటీలో నిలవాలంటే అయ్యే ఖర్చు అటూ ఇటూగా తక్కువలో తక్కువ 24 కోట్ల నుంచి 120 కోట్ల వరకు ఉంటుందట. ఒకప్పుడు పేపర్ యాడ్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు డిజిటల్ క్యాంపైన్ ఓ రేంజ్‌లో జరుగుతోంది.

ఇండియా నుండి ఆఫీషియల్ ఎంట్రీ రాలేదు కాబట్టి.. ఆర్ఆర్ఆర్ “బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్” కేటగిరీలో పోటీ పడే ఓ మంచి అవకాశం మిస్ చేసుకుందని చెప్పాలి. మరోవైపు ఆర్ఆర్ఆర్, చెల్లో షో సినిమాలతో పాటు బెస్ట్ డాక్యూమెంటరీ ఫిలింగా ‘ఆల్ దట్ బ్రీత్స్’, బెస్ట్ డాక్యూమెంటరీ షార్ట్ ఫిలింగా ‘ది ఎలిఫాంట్ విస్పరర్స్’ షార్ట్ లిస్ట్ కి ఎంపికయ్యాయి.

ఇలా ఎంపిక చేస్తారు

గవర్నమెంట్ అఫీషియల్ గా ఎంపిక చేయని సినిమాలకు ఛాన్స్ లేదా? అంటే.. వీటికి “బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్” కేటగిరీలో కాకుండా “బెస్ట్ పిక్చర్” కేటగిరిలో పోటీపడే ఛాన్స్ ఉంటుంది. ఇక జనరల్ గా ఆస్కార్ లో ఏ కేటగిరి అయినా 5 నామినేషన్స్ వరకే ఫైనల్ చేస్తారు. కానీ.. బెస్ట్ పిక్చర్ కేటగిరీలో 10 నామినేషన్స్ వరకు ఛాన్స్ ఇస్తారు. ఆర్ఆర్ఆర్ మూవీని రాజమౌళి టీమ్ భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తోంది. స్పెషల్ స్క్రీనింగ్స్ తో పాటు హాలీవుడ్ టాప్ డైరెక్టర్స్, రైటర్స్ కి సినిమా చూపించారు. ఇంత కష్టం దేనికి అంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆస్కార్ కమిటీ మెంబర్స్ కి.. ట్రిపుల్ ఆర్ మూవీని పరిచయం చేసి.. వారి ఓట్లు పొందటానికి.

ఇలా ప్రమోట్ చేసుకున్న సినిమాల్ని ఆస్కార్ కమిటీలో ఉన్నవారు నామినేట్ చేస్తే.. బెస్ట్ పిక్చర్ కేటగిరీలో షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే.. ముందుగా రిమైండర్ లిస్ట్ లో ఉన్న అన్నీ సినిమాలకు.. అన్నీ కేటగిరీల ఆస్కార్ మెంబర్స్ ఓటింగ్స్ వేస్తారు. అలా వివిధ రకాల రౌండ్స్ అయ్యాక.. నామినేషన్స్ లో పోటీపడే 5 సినిమాలను ఫైనల్ చేస్తారు.

పీఆర్‌ టీంలే కీలకం

ఇక విన్నర్ ఎవరో తెలియాలి కదా.. అందుకోసం మొత్తం వేల సంఖ్యలో ఉన్న ఓటింగ్ మెంబర్స్ మరోసారి ఫైనల్ ఓటింగ్ వేస్తారు. ఈ ఫైనల్ ఓటింగ్ ప్రతి కేటగిరిలోనూ జరుగుతుంది. ఇప్పుడు మన నాటు నాటు సాంగ్ కూడా.. ఇలా “బెస్ట్ ఒరిజినల్ సాంగ్” కేటగిరీలో ఉంది.

మరి ఆస్కార్ రిమైండర్ లిస్ట్ లో ఉన్న వందల సినిమాలను కమిటీ మెంబర్స్ చూస్తారా? అనంటే.. అన్ని సినిమాలు ఎవరూ చూడలేరు కదా! అందుకే మధ్యలో పిఆర్ ఏజెన్సీలు ఎంటరై.. బజ్ ఉన్న సినిమాలను ఆస్కార్ మెంబర్స్ కి సజెస్ట్ చేస్తాయి. ఆస్కార్ బరిలో నిలవాలంటే ముఖ్యంగా ఒక మంచి పీఆర్‌ని వెతికి పట్టుకోవాలి.

పీఆర్‌లకే అంత ఖర్చా..

ఆస్కార్‌లో విదేశీ భాషా చిత్రాల మీద పట్టు ఉన్న పీఆర్ కావాలి. ఇది అత్యంత కీలకం. ఆ స్థాయి పీఆర్‌లు ఇద్దరు నుంచి ముగ్గురు మాత్రమే ఉన్నారట. వాళ్లు అంత సులువుగా దొరకరు. షార్ట్ లిస్ట్ అవ్వడానికి ప్రమోషన్ల మీద కనీసం 15 వేల డాలర్లు మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు 12లక్షల 24వేల రూపాయలు, ఒకవేళ నామినేట్ అయితే అదనంగా సుమారు మరో 4 లక్షల 8 వేలు కేవలం పీఆర్‌కి మాత్రమే ఖర్చవుతాయని టాక్‌. ఆ విషయం దృష్టిలో పెట్టుకొనే కొంతమంది ఆస్కార్ క్యాంపెయినింగ్ కి, ఆస్కార్ ఆలోచనకి దూరంగా ఉంటారు. కానీ.. పెద్ద ప్రొడక్షన్ హౌస్ లు ఈ ఖర్చు పెట్టేందుకు ముందుకు వచ్చి, మాక్సిమమ్ సినిమాను కమిటీ దృష్టిలో పడేలా ప్రయత్నిస్తుంటాయి.

రాజమౌళి అండ్‌ టీమ్‌ చేస్తుంది ఇదే..

ఇన్ని రోజులు విదేశాల్లో రాజమౌళి అండ్ టీమ్ చేసిన పని ఇదే. ఇదిలా ఉండగా.. మరోవైపు సినిమాలకు లభించే ఇంటర్నేషనల్ అవార్డులు.. ఆస్కార్ కమిటీలో సినిమాపై హైప్ క్రియేట్ అయ్యేలా చేస్తాయి. ఆ విధంగా ఒక సినిమాకి ఆస్కార్ అవార్డు రావాలంటే.. దాని వెనుక చాలామంది జ్యూరీ మెంబర్స్ తో పాటు కొన్ని వేలమంది కమిటీ మెంబర్స్ ఓటింగ్స్ ప్రాసెస్ ఉంటుంది. సో.. కుంభస్థలం కొట్టాలి అనుకున్నప్పుడు బడ్జెట్ ని మించిన ఖర్చు కూడా భరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆస్కార్ కోసం తమ సినిమాలను తామే ప్రమోట్ చేసుకోవాలి అనేది వాస్తవం. ఆస్కార్ అవార్డు రావాలంటే ఇంత కష్టం ఉంటుంది. ఇన్ని సవాళ్లు ఉంటాయి. ఇంత యుద్ధం చేయాల్సి ఉంటుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Gruha Lakshmi Scheme | గృహలక్ష్మి పథకం విధివిధానాలు ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. దరఖాస్తులు ఎలా.. రూ.3లక్షలు ఎప్పుడు ఇస్తారు?

IND vs AUS | ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో క్రికెట్‌ మ్యాచ్‌.. భారత్‌, ఆస్ట్రేలియా నాలుగో టెస్టు ప్రత్యేక అతిథులుగా మోదీ, ఆంటోని ఆల్బనీస్‌

Microsoft CEO Satya Nadella | కోడింగ్‌ రాకపోయినా సాఫ్ట్‌వేర్ జాబ్ చేయొచ్చు అంటున్న సత్య నాదెళ్ల.. ఎలా?

Telangana Cabinet | సొంత స్థలం ఉన్న వాళ్లకు రూ.3లక్షల సాయం.. కొత్త పథకం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Cabinet | రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే..

Influenza | కాన్పూర్‌లో విపరీతంగా పెరుగుతున్న ఇన్ ఫ్లూ ఎంజా కేసులు.. ఎమర్జెన్సీ వార్డులు ఫుల్‌!

Traffic Challan | ప్రాణాలు తీసిన ట్రాఫిక్‌ చలాన్లు.. కట్టలేను సారు అన్నా వినలేదు.. హైదరాబాద్‌లో దారుణం!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News