Home Latest News Bharat Biotech Nasal vaccine | కరోనా విలయతాండవం చేస్తున్న వేళ గుడ్‌న్యూస్.. కేంద్రం కీలక...

Bharat Biotech Nasal vaccine | కరోనా విలయతాండవం చేస్తున్న వేళ గుడ్‌న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం

Bharat Biotech Nasal vaccine | చైనా సహా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఇప్పటికే ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. అన్ని రాష్ట్రాలు అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో బెడ్లు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. మందులు, మందుల ధరలపై కూడా నిఘా పెట్టాలని రాష్ట్రాలకు సూచించారు. కరోనా వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని ప్రజలందరికీ బూస్టర్ డోసులు ఇవ్వాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సినేషన్ మరింత వేగవంతమయ్యేందుకు వీలుగా భారత్ బయోటెక్ డెవలప్ చేసిన రెండు చుక్కల నాజల్ టీకా ( Nasal vaccine )కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది.

ఇవాళ్టి నుంచి నాజల్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని కేంద్రం తెలిపింది. అయితే ప్రస్తుతానికి ప్రైవేటు ఆస్పత్రుల్లోనే ఈ నాజల్ వ్యాక్సిన్ లభ్యం కానుంది. కోవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు తీసుకున్నవాళ్లు ఎవరైనా ఈ నాజల్ టీకాను హెటిరోలాగస్ బూస్టర్‌గా తీసుకోవచ్చని అధికారిక వర్గాలు తెలిపాయి. భారత్ బయోటెక్ డెవలప్ చేసిన ఈ టీకా ఇన్‌కోవాక్‌ ( iNCOVACC ) ను బూస్టర్ డోస్‌గా వినియోగించేందుకు డీసీజీఐ నవంబర్‌లోనే అనుమతులు ఇచ్చింది. తాజాగా ఈ నాజల్ వ్యాక్సిన్‌కు కేంద్రం ఆమోదం లభించింది.

ఎవరు వేసుకోవచ్చు..

ప్రస్తుతం ఈ నాజల్ టీకాను 18 ఏళ్లు పైబడిన వారికే ఇవ్వనున్నారు. కొవాగ్జిన్, కోవిషీల్డ్ వేసుకున్న వారు ఎవరైనా ఈ టీకాను బూస్టర్ డోసుగా తీసుకోవచ్చు. అయితే ప్రైవేటు ఆస్పత్రుల్లోనే అందుబాటులో ఉండనుంది.

కరోనా ఇంజెక్షన్, నాజల్ వ్యాక్సిన్‌లో ఏది బెటర్?

సాధారణంగా కరోనా వ్యాక్సిన్‌ శరీరంలోకి ఎంటరయ్యేది ముక్కు, నోటి ద్వారానే. అక్కడి నుంచి గొంతులోకి, తర్వాత ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాస సమస్యలు వస్తాయి. ఇప్పుడున్న ఇంజెక్షన్‌ వ్యాక్సిన్‌తో పోలిస్తే నాజల్‌ వ్యాక్సిన్‌తో అదనపు ప్రయోజనాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. నాజల్‌ టీకాలు శరీరంలోకి కరోనా ప్రవేశించే ముక్కు, శ్వాసనాళం వద్దే రక్షణగా ఉండనుంది. అంతేకాదు వీటిని నిల్వ చేయడంలో కూడా పెద్దగా ఇబ్బందులు ఉండవు. పంపిణీ కూడా సులభం అవుతుందని నిపుణులు పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన అత్యున్నతస్థాయి సమావేశంలోనూ ఈ నాజల్‌ టీకా గురించి చర్చించారు. ఆ తర్వాత 24 గంటల్లోనే నాజల్ టీకాకు కేంద్రం ఆమోదం తెలిపింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Omicron BF.7 Symptoms | చైనాను వణికిస్తున్న ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ BF.7 లక్షణాలివే..

PM Modi meeting on corona | కరోనాపై ప్రధాని మోదీ అత్యున్నత సమావేశం.. ముప్పు తొలగిపోలేదు.. జాగ్రత్తగా ఉండాల్సిందేనని సూచన

Corona cases in India | భారత్‌లో పెరుగుతున్న ఒమిక్రాన్ BF.7 కేసులు.. అప్రమత్తమైన వైద్య మండలి.. కీలక ఆదేశాలు జారీ

Omicron BF.7 | కరోనా విషయంలో కర్ణాటక సర్కారు కఠిన ఆంక్షలు.. ఎక్కడికెళ్లినా తప్పనిసరిగా పాటించాల్సిందే!

Exit mobile version