Home Lifestyle Health Omicron BF.7 Symptoms | చైనాను వణికిస్తున్న ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ BF.7 లక్షణాలివే..

Omicron BF.7 Symptoms | చైనాను వణికిస్తున్న ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ BF.7 లక్షణాలివే..

Omicron BF.7 Symptoms | కరోనా కొత్త వేరియంట్‌తో ప్రపంచవ్యాప్తంగా వచ్చే మూడు నెలల్లో భారీగా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరణాలు కూడా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో అన్ని దేశాలు అప్రమత్తమవుతున్నాయి. భారత్‌ కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే మాస్కులు ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఒక్కరూ బూస్టర్‌ డోసు వేసుకోవాలని సూచించింది. అయితే అంతర్జాతీయ విమాన ప్రయాణానికి సంబంధించిన మార్గదర్శకాల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలు మాత్రం చేయాలని నిర్ణయించింది. కాగా కరోనా కొత్త వేరియంట్ వచ్చిన వాళ్లలో ప్రధానంగా ఈ లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ఈ లక్షణాలు ఉంటే కరోనా పరీక్షలు చేపించుకోవాలని సూచిస్తున్నారు.

లక్షణాలివే..

చైనాలో ప్రస్తుతం ఈ వేరియంట్‌ సోకిన వాళ్లలో సాధారణంగా కరోనాలో కనిపించే లక్షాణాలైన

  • జలుబు
  • దగ్గు,
  • గొంతునొప్పి,
  • తలనొప్పి ఉన్నాయని ఫరీదాబాద్‌లోని ఏషియన్‌ హాస్పిటల్స్‌ వైద్యులు డాక్టర్‌ చారు దత్‌ అరోరా తెలిపారు. వీటితో పాటు
  • శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు,
  • ముక్కు కారడం,
  • ఒళ్లు నొప్పులు,
  • అలసట,
  • కడుపునొప్పి,
  • విరేచనాలు వంటి లక్షణాలు కూడా కనిపించాయని అన్నారు. ఈ లక్షణాలుంటే కరోనా పరీక్ష చేపించుకోవాలని వైద్యులు సూచించారు.
    Corona Virus

    సాధారణంగా ఒమిక్రాన్‌తో పోలిస్తే కొత్త వేరియంట్‌ చాలా వేగంగా విస్తరిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని ఇంక్యూబేషన్‌ సమయం కూడా తక్కువగా ఉందని, లక్షణాలు లేకున్నా ఇతరులకు వేగంగా సోకుతుందని చెప్పారు. చైనాలో ఇంత వేగంగా విస్తరించడానికి కారణం ఇదేనని అన్నారు. ఒక్కరి నుంచి దాదాపు 10-18 మందికి విస్తరించే అవకాశం ఉందని హెచ్చరించారు. మరో మూడు నెలలు పరిస్థితి ఇలాగే ఉంటే చైనాలో దాదాపు 60 శాతం మంది కరోనా బారిన పడే అవకాశం ఉందన్నారు.

    Follow Us : FacebookTwitter

    Read More Articles |

    Omicron BF.7 variant | భారత్‌లోకి ప్రవేశించిన ఒమిక్రాన్ సబ్‌ వేరియంట్‌ BF.7.. చైనాను అతలాకుతలం చేస్తోంది ఇదే

    Adar Poonawalla on corona cases | కరోనా కేసులు పెరుగుతుండటంపై అదార్ పూనావాలా కీలక వ్యాఖ్యలు.. అప్రమత్తంగా ఉండాల్సిందే కానీ..

    Corona Alert | కరోనా అలర్ట్.. అంతర్జాతీయ ప్రయాణీకులపై ఆంక్షలు విధించే యోచనలో కేంద్రం?

    Corona | ప్రపంచవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోందా ? అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్ !

    China | చైనాలో కరోనా తెచ్చిన కష్టం.. నిమ్మకాయల కోసం ఎగబడుతున్న జనాలు.. కారణమిదే

    Exit mobile version