Home Latest News IND vs AUS | 39కే 4 వికెట్లు పడ్డా.. పైచేయి మనదే.. తొలి వన్డేలో...

IND vs AUS | 39కే 4 వికెట్లు పడ్డా.. పైచేయి మనదే.. తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం

IND vs AUS | టైమ్ 2 న్యూస్, ముంబై: బౌలర్ల కృషికి మిడిలార్డర్ సహకారం తోడవడంతో భారత జట్టు విజయం సాధించింది. స్వల్ప లక్ష్యఛేదనే అయినా.. ఆసీస్ బౌలర్లు నిప్పులు చెరుగుతుండటంతో గెలుపు కష్టమే అనుకున్నా.. మిడిలార్డర్ రాణించడంతో టీమ్ఇండియా గట్టెక్కింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం ఇక్కడి వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో హార్దిక్ సేన 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. దీంతో సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది.

మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 35.4 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 129/2తో పటిష్టంగా కనిపించిన ఆసీస్ ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి తక్కువ స్కోరుకే పరిమితమైంది. మిషెల్ మార్ష్ (65 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. జోష్ ఇంగ్లిస్ (26), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (22) తలా కొన్ని పరుగులు చేశారు. ఆసీస్ చివరి ఆరు వికెట్లు 19 పరుగుల తేడాలో కోల్పోవడం గమనార్హం. భారత బౌలర్లలో హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్, షమీ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.

అనంతరం లక్ష్యఛేదనలో టీమ్ఇండియా 39.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (91 బంతుల్లో 75 నాటౌట్; 7 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా.. రవీంద్ర జడేజా (69 బంతుల్లో 45 నాటౌట్; 5 ఫోర్లు), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (25; 3 ఫోర్లు, ఒక సిక్సర్) సత్తాచాటారు. ఒక దశలో 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన జట్టును రాహుల్-పాండ్యా ద్వయం ఆదుకుంది. పాండ్యా ఔటైనా.. జడేజా సాయంతో రాహుల్ మ్యాచ్ను ముగించాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 3, స్టొయినిస్ రెండు వికెట్లు పడగొట్టారు. ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న జడేజాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఆదివారం విశాఖపట్నం వేదికగా రెండో వన్డే జరుగనుంది.

రాహుల్ యాంకర్ ఇన్నింగ్స్

ఆసీస్‌కు తక్కువ పరుగులకు ఆలౌట్ చేసిన ఆనందం టీమిండియాకు ఎక్కువసేపు నిలువలేదు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఇషాన్ కిషన్ (3) ఔటయ్యాడు. శుభ్మన్ గిల్ (20)తో పాటు విరాట్ కోహ్లీ ఆదుకుంటారనుకుంటే.. రన్మెషీన్ కోహ్లీ (4) స్టార్క్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ మరుసటి బంతికే సూర్యకుమార్ (0) కూడా అదే తరహాలో ఔట్ కావడంతో 16 పరుగులకే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందనుకున్న పిచ్ అనూహ్యంగా పేసర్లకు సాయమందించగా.. స్ట్రెయిట్ లైన్లో బంతిని తప్పుడు అంచనా వేసిన వీరిద్దరూ పెవిలియన్ చేరిపోయారు. ఈ దశలో గిల్ కాసేపు పోరాడినా.. అతడి షాట్లలో ఆత్మవిశ్వాసం కనిపించలేదు. క్రీజులో ఉన్నంతసేపు తడబడ్డ గిల్ స్టార్క్ బౌలింగ్లోనే వెనుదిరిగాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన స్టాండిన్ కెప్టెన్ ఎదుర్కొన్న తొలి బంతికే బౌండ్రీ బాది తన ఉద్దేశాన్ని చాటాడు. రాహుల్తో కలిసి జట్టును సురక్షిత స్థానానికి చేర్చే క్రమంలో పాండ్యా ఔట్ కాగా.. ఆఖర్లో జడేజా రాణించాడు. రాహుల్తో కలిసి మరో వికెట్ పడకుండా మ్యాచ్ను ముగించాడు. ఈ జోడీ అభేద్యమైన ఆరో వికెట్కు 108 పరుగులు జోడించడంతో భారత్ సంబురాల్లో మునిగిపోయింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Pawan Kalyan | రోజుకు 2 కోట్లు.. వైరల్‌గా మారిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్

Junior NTR | ఎంత పని చేశావు తారక్.. ఫ్యాన్ వార్ కు పెట్రోల్ పోసాడుగా..!

Oscars 2023 | ఆస్కార్ అవార్డు పోగొట్టుకుంటే ఎలా? అప్పుడు అకాడమీ ఏం చేస్తుంది?

Air India | ఆన్‌లైన్‌లో చూశా.. మీరు ఎక్కువ ఫైన్ వేస్తున్నారు? జడ్జితో లొల్లి పెట్టుకుని జైలుకే వెళ్లిన వ్యక్తి

Silicon Valley Bank | 100 రూపాయలకే సిలికాన్ వ్యాలీ బ్యాంకు యూకే యూనిట్ దక్కించుకున్న హెచ్ఎస్‌బీసీ

TSPSC | యథావిధిగానే గ్రూప్‌-1 మెయిన్స్.. AE పరీక్షపై నిర్ణయం తీసుకుంటాం: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్ధన్‌ రెడ్డి

Exit mobile version