Home News AP AP CM Jagan mohan reddy | 32 మంది ఎమ్మెల్యేలకు ఏపీ సీఎం జగన్‌...

AP CM Jagan mohan reddy | 32 మంది ఎమ్మెల్యేలకు ఏపీ సీఎం జగన్‌ వార్నింగ్‌.. పద్దతి మార్చుకోకుంటే టికెట్‌ ఇచ్చేదే లేదు

AP CM Jagan mohan reddy | ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేలకు వార్నింగ్‌ ఇచ్చారు. పనితీరు మార్చుకోకుంటే వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల పనితీరుపై చేసిన సర్వే వివరాలను సీఎం జగన్ స్వయంగా వెల్లడించారు. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అమలు తీరుపై చర్చించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో ఈ ఏడాది మే 11 నుంచి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. నియోజకర్గంలో ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, నియోజకవర్గ సమన్వయకర్తలు గ్రామాల్లో తిరగాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని సూచించారు.

అయితే అనుకున్న స్థాయిలో ఈ కార్యక్రమం ముందుకు సాగట్లేదని భావించిన జగన్‌.. నిఘా వర్గాల ద్వారా గ్రౌండ్లో ఏం జరుగుతుందో నివేదిక తెప్పించుకున్నాడు. ఈ నివేదికలో 32 మంది ఎమ్మెల్యేలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వెనుకబడ్డారని తేలింది. దీంతో వారిని ముఖ్యమంత్రి హెచ్చరించారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఇలాగే నిర్లక్ష్యం చేస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. 2023లో మరోసారి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించనున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Avatar2 Review | అవతార్ 2 రివ్యూ.. జేమ్స్ కామెరూన్ మరోసారి మాయ చేశాడా?

Manchu Manoj | భూమా మౌనికతో త్వరలోనే పెళ్లి? మంచు మనోజ్ వ్యాఖ్యలకు అర్థం అదేనా?

Exit mobile version