Home Lifestyle Do you know Union Budget 2023 | కేంద్ర బడ్జెట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా

Union Budget 2023 | కేంద్ర బడ్జెట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా

Union Budget 2023 | సామాన్యుల నుంచి కార్పొరేట్ల వరకు దేశవ్యాప్తంగా బడ్జెట్‌పై గంపెడాశలతో ఎదురు చూస్తున్నారు. బడ్జెట్‌లో కొత్త పథకాలు ఏమైనా ఉంటాయా.. వేతన జీవుల ఆశలను కేంద్రం నెరవేరుస్తుందా.. కార్పొరేట్లకు అండగా ఏం నిర్ణయాలు తీసుకోబోతున్నారనే విషయాలపైనే అందరి దృష్టి ఉంది. అయితే భారత్‌లో తొలిసారి బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టారు ? రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్‌ నుంచి ఎప్పుడు విడదీశారు.. ఎక్కువ సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన వాళ్లు ఎవరు అనే విషయాలపై ఓ సారి లుక్కేయండి మరి..

1860 ఏప్రిల్‌లో తొలిసారి భారత బడ్జెట్‌ను ఇండియన్‌ కౌన్సిల్‌కు ఆర్థిక మంత్రిగా ఉన్న జేమ్స్ విల్సన్‌ ప్రవేశపెట్టారు.

స్వాంతంత్య్రానంతరం తొలి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది మాత్రం భారత తొలి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముగం.

కేంద్ర ఆర్థిక మంత్రి నుంచి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మొరార్జీ దేశాయ్‌ ఎక్కువసార్లు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. మొత్తం 10 సార్లు మొరార్జీ దేశాయ్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

1964, 1968లో మొరార్జీ దేశాయ్‌ పుట్టిన రోజు ( ఫిబ్రవరి 29)న బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.

ఆర్‌ వెంకట్రామన్‌, ప్రణబ్‌ ముఖర్జీ ఇద్దరూ ఆర్థిక మంత్రులుగా బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. అనంతర కాలంలో రాష్ట్రపతిగా సేవలందించారు.

ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు 1970-71లో స్వయంగా బడ్జెట్‌ణు ప్రవేశపెట్టారు.

యశ్వంత్‌ సిన్హా ఐదు సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో నాలుగు సార్లు భారత్ క్లిష్ట సమయాల్లోనే ఉంది. 1991లో ఫారెక్స్‌ సంక్షోభం.. 1999లో పోఖ్రాన్‌ పేలుళ్లు, 2000లో కార్గిల్‌ యుద్దం.. 2001లో గుజరాత్‌ భూకంపం..

సాధారణ బడ్జెట్‌ నుంచి రైల్వే బడ్జెట్‌ను 1924లో విడదీశారు. అదే ఏడాది రెండు బడ్జెట్‌లను విడివిడిగా పార్లమెంట్‌ ముందుకు తీసుకొచ్చారు. తిరిగి 2017లో రెండు బడ్జెట్లను ప్రధాని మోదీ సర్కార్ కలిపేసింది.

ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు బడ్జెట్ ప్రవేశ పెట్టింది ముగ్గరు. ఆ ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు. జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ ప్రధానులుగా ఉన్నప్పుడు స్వయంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.

తొలిసారి పేపర్‌లెస్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది నిర్మలా సీతారామన్‌. 2021 నుంచి పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత యూనియన్‌ బడ్జెట్ యాప్‌ ద్వారా విడుదల చేస్తున్నారు. డిజిటల్ బడ్జెట్‌గానూ దీనికి పేరు.

ఎక్కువ సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ రికార్డులకెక్కనున్నారు. ఇప్పటివరకు నాలుగు సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఐదోసారి ప్రవేశపెట్టబోతున్నారు.

ఎక్కువ సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలాసీతారామన్ ఖాతాలోనే ఉంది. 2019-20 బడ్జెట్‌లో ఏకంగా రెండు గంటల 17 నిమిషాలపాటు ప్రసంగించారు. ఆ తర్వాతి ఏడాది 162 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగాన్ని చదివి వినిపించారు. బడ్జెట్‌ చరిత్రలో ఇదే సుదీర్ఘమైన ప్రసంగం.

2003-04లో జస్వంత్‌ సిన్హా అత్యధికంగా 135 నిమిషాల పాటు బడ్జెట్‌ ప్రసంగం చేశారు.

మినీ బడ్జెట్‌ను తొలిసారి ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌. కరోనా సమయంలో మినీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి వచ్చింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Rishabh Pant | క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్‌.. పంత్ సర్జరీ సక్సెస్‌!

Hindenburg Report | హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. బిలియనీర్స్ టాప్ 10లో చోటు కోల్పోయిన అదానీ

Nitin Gadkari | 15 ఏళ్లు దాటిన ఆ వాహనాలన్నీ ఇక తుక్కే.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి

Adani Group | మీ మోసంతో జాతీయవాదానికి పోలికా? అదానీ గ్రూపులో అవకతవకలపై మండిపడ్డ హిండెన్‌బర్గ్

Exit mobile version