Tuesday, April 16, 2024
- Advertisment -
HomeEntertainmentVinaro Bhagyamu Vishnu Katha Trailer | సరికొత్త కాన్సెప్ట్‌తో కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము.....

Vinaro Bhagyamu Vishnu Katha Trailer | సరికొత్త కాన్సెప్ట్‌తో కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము.. ఈ సారి హిట్టు కొట్టెలా ఉన్నాడు..

Vinaro Bhagyamu Vishnu Katha Trailer | కిరణ్ అబ్బవరం సినీ గ్రాఫ్ చూసుకుంటే ఒక అడుగు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి పడుతుంది. కెరీర్ బిగెనింగ్ లో రాజావారు రాణివారు, ఎస్.ఆర్ కళ్యాణమండపం వంటి సినిమాలతో కమర్షియల్ హిట్లు సాధించిన కిరణ్.. ఆ తర్వాత హ్యట్రిక్ పరాజయాలను మూట గట్టున్నాడు. ఆఫర్లు వస్తున్నాయి కదా అని కథల గురించి ఆలోచించకుండా సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నాడు. దాంతో మొదటి రెండు సినిమాలతో ఏర్పరుచుకున్న కాస్తో కూస్తో మార్కెట్ కూడా ఇప్పుడు లేకుండా పోయింది. పైగా గత సినిమా ప్రమోషన్లలో కిరణ్ చేసిన హడావుడితో ట్రోలర్ రాయుళ్లకు టార్గెట్ అయ్యాడు. దీంతో మళ్లీ ట్రాక్ ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం కిరణ్ ఆశలన్నీ వినరో భాగ్యము విష్ణు కథా సినిమాపైనే ఉన్నాయి. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిత్రబృందం రిలీజ్ చేసిన పోస్టర్లు సినిమాపై కాస్త బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశాడు. లేటెస్ట్ గా రిలీజైన ట్రైలర్ ఆసక్తి పెంచుతుంది. ట్రైలర్ తోనే సినిమా కాన్సెప్ట్ పై క్లారిటీ ఇచ్చేశారు. ఫోన్ నెంబర్ నైబర్ అనే సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్నట్లు ట్రైలర్ లో చూపించారు. ఫోన్ నెంబర్ లో లాస్ట్ డిజిట్‌కి అటు పక్క ఒక నెంబర్, ఇటు పక్క ఒక నెంబర్ కు డయల్ చేస్తే ఎవరో ఒకరికి కనెక్ట్ అవుతుంది. అలా హీరోయిన్ కు తన నెంబర్ కి ఉన్న నైబర్ నంబర్స్ డయల్ చేస్తే అందులో ఒక నెంబర్ హీరో కిరణ్ అబ్బవరంకు, మరో నెంబర్ మురళీశర్మకు కనెక్ట్ అవుతుంది. అలాగే కిరణ్ అబ్బవరం నెంబర్ కి ఉన్న నైబర్ నంబర్స్ లో ఒకటి హీరోయిన్ ది కాగా మరొకటి విలన్ ది. ఇలా నైబర్ నంబర్స్ ని కాంటాక్ట్ అవ్వడం వల్ల హీరో, హీరోయిన్ లు అనుకోని ప్రమాదంలో పడతారు. దాని నుంచి వాళ్ళు ఎలా తప్పించుకున్నారు అనేది మిగిలిన కథ. హీరోహీరోయిన్లకు మురళీశర్మకు మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వించే విధంగా ఉన్నాయి. హీరో హీరోయిన్ కెమెస్ట్రీ బాగానే వర్కువుట్ అయినట్లు కనిపిస్తుంది. కిరణ్ యాక్షన్ ఈలలు వేయించేలా ఉంది. చైతన్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం వీర లెవల్లో ఉంది. ముఖ్యంగా ట్రైలర్ చివర్లో వచ్చిన మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తుంది. బన్నీ వాసు ఖర్చుకు వెనకాడకుండా సినిమాను రూపొందించినట్లు స్పష్టంగా తెలుస్తుంది.

నిజానికి ఫోన్ నెంబర్ నైబర్ అనేది ఫ్రెష్ సబ్జెక్ట్. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఇలాంటి సబ్జెక్ట్ లేదు. ఎగ్జిక్యూషన్ పర్ ఫెక్ట్ గా ఉంటే కిరణ్ కు కంబ్యాక్ ఇచ్చే సినిమా అవుతుంది. ఎస్.ఆర్ కళ్యాణమండపం తర్వాత మళ్లీ ఒక కంప్లీట్ ప్యాకేజీతో వస్తున్నట్లు తెలుస్తుంది. కాశ్మీరా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమానలో మురళి శర్మ కీలకపాత్ర పోషిస్తున్నాడు. గీతా ఆర్స్ట్ సంస్థ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. పైగా ఇప్పటివరకు రిలీజైన ప్రచార చిత్రాలు, టీజర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాకు పోటీగా అదే రోజున సార్ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటివరకైతే ఈ సినిమాపై పెద్దగా అంచనాల్లేవు కానీ, సితార సంస్థ నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రమోషన్ లు గట్రా గ్రాండ్ గా ప్లాన్ చేసి వారంలోనే కావాల్సినంత క్రేజ్ తీసుకొస్తుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Prabhas | ప్రభాస్‌కు అస్వస్థత.. షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్

Kirak RP | నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు టేస్ట్ బాగోలేదంటూ టాక్.. సీరియస్ అయిన కిరాక్ ఆర్పీ

Turkey Earthquake | ప్రకృతి ప్రకోపానికి 3800 మంది బలి.. చిగురుటాకులా వణికిపోతున్న తుర్కియే, సిరియా

Bhanupriya | మెమొరీ లాస్‌తో బాధపడుతున్న సీనియర్ హీరోయిన్.. సెట్స్‌లో డైలాగులు కూడా గుర్తుండట్లేదట

Jabardasth Varsha | రాత్రికి రాత్రే ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ చేశారు.. వీడియో పోస్టు చేసిన జబర్దస్త్ వర్ష.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

Allu Aravind | ఆమెకు ఆ అవసరం లేదు.. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డిపై అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Sundeep Kishan | రెజీనాతో డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో సందీప్ కిషన్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News