Home Latest News Kamareddy | కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ రైతుల ఆందోళన.. అసలేం జరిగింది ?

Kamareddy | కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ రైతుల ఆందోళన.. అసలేం జరిగింది ?

Kamareddy | టైం2న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్టణ నూతన మాస్టర్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. కుటుంబసభ్యులతో కలిసి రైతులు కలెక్టరేట్‌ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో వాటిని తోసుకుంటూ కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లారు. మరోవైపు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ, కాంగ్రెస్ నేతలు రైతులకు మద్దతుగా కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.

అసలేం జరిగింది..

కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలంటూ గత నెల రోజులుగా రైతులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. సాగు భూములను పరిశ్రమల జోన్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. పచ్చని పంటపొలాల్లో ఇండస్ట్రియల్ జోన్, గ్రీన్ జోన్ ఏర్పాటును నిరసిస్తూ ఇల్చిపూర్, అడ్లూర్ ఎల్లారెడ్డి, టెక్రియాల్, అడ్లూరు, లింగాపూర్ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ మార్చే వరకు ఆందోళన చేస్తామని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ హెచ్చరించింది. ఈ క్రమంలో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కారణంగా భూమి కోల్పోతామన్న భయంతో రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రైతులు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు.

సర్పంచ్‌పై దాడి

రైతు రాములు ఆత్మహత్య చేసుకోవడంతో అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు రాజీనామా చేశారు. ఉప సర్పంచ్ సహా ఆరుగురు వార్డు మెంబర్లు, పీఏసీఎస్ డైరెక్టర్ , ఆరుగురు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. రైతుల భూములను లాక్కునే మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే సర్పంచ్ రాజీనామా చేయకపోవడంతో ఆయనపై రైతులు దాడి చేశారు

స్పందించిన కేటీఆర్

కామారెడ్డి ఇండస్ట్రియల్ జోన్‌పై రైతులు చేస్తున్న ఆందోళనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. రైతులను ఇబ్బందులు పెట్టడానికి ప్రభుత్వం లేదని, సాయం చేయడానికే ఉందని కేటీఆర్ అన్నారు. అసలు మాస్టర్ ప్లాన్ సమస్య ఎందుకు వచ్చిందని మున్సిపల్ కమిషనర్‌ను ప్రశ్నించారు. ఇంకా మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ సేజీలోనే ఉందని ఈ విషయాన్ని ప్రజలకు ఎందుకు చెప్పలేకపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతు ఆత్మహత్యతో పరిస్థితి ఉద్రిక్తం

తన పంట భూములను ఇండస్ట్రియల్ జోన్‌లోకి మార్చడంతో మనస్తాపం చెందిన అడ్లూరు ఎల్లారెడ్డికి చెందిన పయ్యావుల రాములు అనే రైతు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో బాధిత కుటుంబసభ్యుల, రైతులు రాములు డెడ్ బాడీతో కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైతులు పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. రైతు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామ పాలకవర్గమంతా రాజీనామా చేసి గురువారం కామారెడ్డి కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Chitragupta Temple | హైదరాబాద్‌లో మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో చిత్రగుప్తుడి ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా?

Numaish 2023 | హైదరాబాద్‌లో జరిగే అతిపెద్ద ఎగ్జిబిషన్‌ నుమాయిష్‌ గురించి ఈ విషయాలు తెలుసా ? ఎంట్రీ ఫీజు ఎంతంటే?

Secunderabad Club | జూబ్లీ బస్టాండ్‌ దగ్గరున్న సికింద్రాబాద్‌ క్లబ్‌ గురించి ఈ విషయాలు తెలుసా.. 20 ఏళ్లు నిరీక్షించినా సభ్యత్వం కష్టమే!

Vegetarian City in India | ప్రపంచంలోనే మొదటి శాఖాహార నగరం గురించి తెలుసా ? అదీ.. మన భారత దేశంలోనే ఉంది.. ఎక్కడంటే?

Saleswaram Temple | నల్లమలలో ఉన్న సలేశ్వరం ప్రత్యేకత తెలుసా? ఏడాదిలో కొన్ని రోజులే ఈ గుడి తెరుస్తారు.. కారణమిదే!

Temples | ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

Exit mobile version