Home Latest News Drug case | డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈడీ నోటీసులు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే...

Drug case | డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈడీ నోటీసులు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి కూడా

Drug case | బెంగళూరు డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ( pilot rohith reddy ) డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ( ED ) నోటీసులు జారీ చేసింది. ఈనెల 19న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఆర్థిక లావాదేవీలపై రోహిత్‌కు ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అటు టాలీవుడ్ ప్రముఖ నటి రుకుల్ ప్రీత్ సింగ్ ( Rakul preet singh ) కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో టాలీవుడ్‌లో ఒక్కసారి కలకలం రేగింది.

ఈడీ నోటీసులపై రోహిత్ రెడ్డి స్పందించారు. తనకు నోటీసులు అందాయని అయితే వాటిని ఇంకా ఓపెన్ చేయలేదని చెప్పారు. నోటీసులు చదివిన తర్వాత దానిపై స్పందిస్తానని రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈనెల 19న విచారణకు హాజరవుతానని మాత్రం స్పష్టం చేశారు. బెంగళూరులోని ఓ పార్టీలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపై 2021లో డ్రగ్స్ కేసు నమోదైంది. కలహర్‌రెడ్డి అనే వ్యాపారవేత్తతో కలిసి బెంగళూరులోని డ్రగ్స్ పార్టీకి రోహిత్ రెడ్డి వెళ్లారని, సినీ నిర్మాత శంకర్ గౌడ ఆ పార్టీ ఇచ్చారని తెలుస్తోంది. అయితే ఆ పార్టీకి నైజీరియన్ల దగ్గరి నుంచి రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ చేరినట్లు బెంగళూరు పోలీసులు తేల్చారు. డ్రగ్స్ తీసుకున్నారన్న ఆరోపణలతో మస్తాన్, శంకర్ గౌడను పోలీసులు గతంలో అరెస్టు చేశారు. ఇదే కేసులో టాలీవుడ్ హీరో తనీష్‌ను కూడా విచారించారు.

అటు టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్‌సింగ్ కు కూడా ఈడీ డ్రగ్స్ కేసులో నోటీసులు జారీ చేసింది. ఈనెల 19న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే ప్రస్తుతం చెన్నైలో ఇండియన్ 2 షూటింగ్‌లో రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారు. ఇంకా తనకు ఈడీ నోటీసులు అందలేదని, నోటీసులపై నిర్ణయం తీసుకుంటానని ఆమె స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Aadhar Card Download | ఆధార్, పాన్ కార్డు అన్నీ వాట్సాప్ నుంచే ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

Hallmark Gold | మీ బంగారు ఆభరణాలపై ఉన్న హాల్ మార్క్ అసలుదా.. నకిలీదా గుర్తించడం ఎలా?

Change Name in Aadhar | పెళ్లి తర్వాత ఆధార్ కార్డులో పేరు మార్చుకోవడం ఎలా.. ఏమేం డాక్యుమెంట్లు అవసరం?

Personal Finance | ఒక వ్య‌క్తి ఎన్ని ఏళ్లు కిరాయి ఉంటే ఆ ఇల్లు అత‌ని సొంత‌మ‌వుతుంది?

Exit mobile version