Home Business Change Name in Aadhar | పెళ్లి తర్వాత ఆధార్ కార్డులో పేరు మార్చుకోవడం ఎలా.....

Change Name in Aadhar | పెళ్లి తర్వాత ఆధార్ కార్డులో పేరు మార్చుకోవడం ఎలా.. ఏమేం డాక్యుమెంట్లు అవసరం?

Change Name in Aadhar card After Marrige | బ్యాంకు లోన్ తీయాలన్నా.. బర్త్ సర్టిఫికెట్ తీయాలన్న, హెల్త్ ఇన్సూరెన్స్ కోసమైనా.. అన్నింటికీ ఆధార్ కార్డు తప్పనిసరి. అందులో ఉన్న పేరు, ఇంటిపేరు, పుట్టిన తేదీనే ఇప్పుడు అన్నింటికీ ప్రామాణికంగా చేసుకుంటున్నారు. అంత ప్రాముఖ్యమైన ఆధార్ కార్డులో తప్పులుంటే .. పరిస్థితేంటి? అందుకే ఆధార్ లో తప్పులను సరిదిద్దుకునేందుకు యూఐడీఏఐ వెసులుబాటు కల్పించింది. ముఖ్యంగా పెళ్లి తర్వాత అమ్మాయి ఇంటి పేరు మార్చుకునేందుకు కూడా అవకాశం కల్పించింది. అది కూడా ఉచితంగానే. ఎలాగంటే..

ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ లో ఆధార్ కార్డులో మార్పులు చేసుకునే వీలుంది. ఆన్‌లైన్ లో పేరు మార్చాలంటే.. ముందుగా ఆధార్ వెబ్‌సైట్ (https://uidai.gov.in/) ఓపెన్ చేసి.. హోం పేజిలోని మై ఆధార్ సెక్షన్లో Update your aadharపై క్లిక్ చేయాలి.

అనంతరం అప్డేట్ డెమోగ్రాఫిక్స్ డేటా ఆన్ లైన్ పై క్లిక్ చేస్తే.. ఆధార్ సెల్ఫ్ స‌ర్వీస్ అప్‌డేట్ పోర్ట‌ల్ ఓపెన్ అవుతుంది. అందులో ప్రొసీడ్ టూ అప్డేట్ ఆధార్ పై క్లిక్ చేయాలి.

ఆధార్ నంబ‌ర్‌, క్యాప్చా కోడ్ ఎంట‌ర్ చేసి Send OTPపై క్లిక్ చేయాలి.

రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్‌కు వ‌చ్చిన ఓటీపీని ఎంట‌ర్ చేసి లాగిన్ అయిన తర్వాత నేమ్ చేంజ్ ఆప్ష‌న్ ఎంచుకుని మారిన పేరు, ఇంటి పేరు వివ‌రాలు నమోదు చేయాలి.

ఆ త‌ర్వాత మ్యారేజ్ సర్టిఫికెట్ అప్‌లోడ్ చేసి స‌బ్‌మిట్ చేయగానే రిజిస్టర్డ్ నంబర్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.

ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసిన తర్వాత స‌ర్వీస్ రిక్వెస్ట్ నంబ‌ర్ వ‌స్తుంది.‌ దీని ఆధారంగా అప్‌డేష‌న్ స్టేట‌స్‌ను తెలుసుకోవ‌చ్చు.

Offlineలో మార్చ‌డ‌మెలా..

ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంట‌ర్‌కు నేరుగా లేదా అపాయింట్మెంట్ బుక్ చేసుకుని ఆ సమయానికి వెళ్లొచ్చు.

ఎన్‌రోల్‌మెంట్ సెంట‌ర్‌కు వెళ్లేప్పుడు కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ ఒరిజిన‌ల్స్‌ను తీసుకెళ్లాలి.

ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంట‌ర్లో సిబ్బంది ఒరిజిన‌ల్ డాక్యుమెంట్స్ స్కాన్ చేసుకుని తిరిగి ఇచ్చేస్తారు. ఆధార్‌లో కొత్త పేరు, ఇంటి పేరు ఎలా ఉండాలో సిబ్బందికి చెప్పి మార్పించుకోవాలి. బ‌యోమెట్రిక్ డేటాను కూడా అప్‌డేట్ చేస్తారు. ఈ ప్రక్రియ కోసం రూ.25 చెల్లించాల్సి ఉంటుంది.

ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి

పెళ్లి త‌ర్వాత‌ ఆధార్ కార్డులో పేరు మార్చేందుకు మ్యారేజి స‌ర్టిఫికెట్‌ స‌బ్‌మిట్ చేయాల్సి ఉంటుంది.

పాన్ కార్డు, పాస్ పోర్టు, ఓట‌ర్ ఐడీ, రేష‌న్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఏదైనా ప్ర‌భుత్వ గుర్తింపు కార్డు(ఫొటోతో ఉన్న‌వి), విద్యాసంస్థ‌ల ఐడీ కార్డులను పరిగణనలోకి తీసుకుంటారు. కాక‌పోతే వీటిల్లో పెళ్లి త‌ర్వాత మారిన పేరు, ఇంటిపేరు ఉండాలి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

ఒక వ్య‌క్తి ఎన్ని ఏళ్లు కిరాయి ఉంటే ఆ ఇల్లు అత‌ని సొంత‌మ‌వుతుంది?

Exit mobile version