Home Business Hallmark Gold | మీ బంగారు ఆభరణాలపై ఉన్న హాల్ మార్క్ అసలుదా.. నకిలీదా గుర్తించడం...

Hallmark Gold | మీ బంగారు ఆభరణాలపై ఉన్న హాల్ మార్క్ అసలుదా.. నకిలీదా గుర్తించడం ఎలా?

Hallmark Gold | ఎక్కడ బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినా BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్) మార్కును కచ్చితంగా చెక్ చేసుకోవాలి. బీఐఎస్ మార్కు త్రిబుజాకారంలోనే ఉంటుంది.

బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. కాబట్టి నగలపై స్వచ్ఛతను తెలియజేసే క్యారటేజ్ 22కే916 ఉందా లేదా అనేది చూసుకోవాలి.

సాధారణంగా 24 క్యారెట్ల బంగారం స్వచ్ఛమైనది. అయితే ఆభరణాలు తయారు చేయాలంటే వెండి, రాగి లాంటి ఇతర లోహాలను కలపాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా స్వచ్ఛతలో మార్పులుంటాయి. ముఖ్యంగా 14, 18, 22 క్యారెట్లలో హాల్ మార్క్ వేస్తారు. 22కే916 అనేది బంగారం హాల్ మార్క్ స్వచ్ఛతను సూచిస్తుంది.

నగలపై AHC గుర్తు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. బీఎస్ఐ లైసెన్స్ ఉన్న నగల వ్యాపారుల వద్దే ఆభరణాలు కొనుగోలు చేయాలి. ఏదైనా డౌట్ వస్తే కచ్చితంగా దుకాణాదారుడిని లైసెన్స్ అడగొచ్చు. బీఎస్ఐ మార్గదర్శకాల ప్రకారం వ్యాపరులు కచ్చితంగా కొనుగోలుదారులకు చూపించాల్సిందే. లైసెన్స్ లో ఉన్న చిరునామాలోనే నగలు అమ్ముతున్నాడో లేదో చూడాలి.

కొంతమంది వ్యాపారులు.. వినియోగదారులు కొనుగోలు చేసిన ఆభరణాలకు మొత్తంగా బిల్ వేస్తారు. కానీ తప్పనిసరిగా బిల్ బ్రేకప్ ను అడిగి తీసుకోవాలి. దీని వల్ల హాల్ మార్కింగ్ కోసం చార్జి ఎంత వేశారో తెలుస్తుంది.

అవన్నీ చూసిన తర్వాత కూడా మీరు కొనుగోలు చేసిన ఆభరణాలపై అనుమానం ఉంటే.. సొంతంగా AHC (ఎస్సేయింగ్ హాల్ మార్క్ కేంద్రం)లో డబ్బులు చెల్లించి తనిఖీ చేసుకోవచ్చు.

మీరు వ్యాపారి వద్ద కొనుగోలు చేసిన ఆభరణాల స్వచ్ఛతకు.. ఏహచ్ సీ వాళ్లు ఇచ్చిన నివేదికలో తేడాలున్నట్లైతే.. దుకాణాదారుడిని నిలదీయొచ్చు. వారిపై వినియోగదారుల ఫోరంలో కేసు కూడా వేయొచ్చు. నిజమే అని తేలితే సదురు వ్యాపారి పరిహారం కూడా చెల్లించాల్సి వస్తుంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

ఒక వ్య‌క్తి ఎన్ని ఏళ్లు కిరాయి ఉంటే ఆ ఇల్లు అత‌ని సొంత‌మ‌వుతుంది?

Exit mobile version