Home News AP AP Holidays List | 2023లో 23 ప్రభుత్వ సెలవులే.. క్యాలెండర్ విడుదల చేసిన ఏపీ...

AP Holidays List | 2023లో 23 ప్రభుత్వ సెలవులే.. క్యాలెండర్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

AP Holidays List | వచ్చే ఏడాది 2023కి గానూ ఏపీ ప్రభుత్వం సెలవుల క్యాలెండర్‌ను విడుదల చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే సంవత్సరం 23 సాధారణ సెలవులు ఉంటాయని ప్రకటించింది. ఆప్షనల్ హాలీ డేస్ మరో 22 నిర్ణయించినట్టు తెలిపింది. ఈ మేరకు సెలవుల క్యాలెండర్‌ను విడుదల చేస్తూ ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సెలవుల క్యాలెండర్‌ ప్రకారం హిందువుల ప్రధాన పండుగలైన సంక్రాంతి, దుర్గాష్టమి, దీపావళి ఆదివారం రోజు రావడం గమనార్హం. ఇక భోగీ పండుగ రెండో శనివారం వచ్చింది.

రంజాన్, బక్రీద్, మొహర్రం, ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగల తేదీల్లో ఏవైనా మార్పులు చోటు చేసుకుంటే ముందస్తుగానే పత్రికా ప్రకటన ద్వారా ఆ విషయాన్ని తెలియజేస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. తిథుల ప్రకారం జరిగే హిందువుల పండుగల్లో మార్పులు వచ్చినా కూడా ముందస్తుగా తెలియజేస్తామని తెలిపింది.

ఉగాది, వినాయకచవితికి బ్యాంకులకు నో హాలీ డే

ఉగాది, శ్రీరామనవమి, వినాయక చవితి పండుగలకు రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై యునైటెడ్ ఫోరం ఆఫ్ ది బ్యాంక్ యూనియన్స్ నిరసన వ్యక్తం చేసింది. గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే చేస్తుందని.. హిందూ పండుగల రోజున బ్యాంకులకు సెలవులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి యూనియన్స్ కన్వీనర్ బీఎస్ రాంబాబు లేఖ రాశారు.

వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవులు ఇవే..

భోగీజనవరి 14శనివారం
సంక్రాంతిజనవరి 15ఆదివారం
కనుమజనవరి 16సోమవారం
రిపబ్లిక్ డేజనవరి 26గురువారం
మహాశివరాత్రిఫిబ్రవరి 18శనివారం
హోలీమార్చి 8బుధవారం
ఉగాదిమార్చి 22బుధవారం
శ్రీరామనవమిమార్చి 30గురువారం
బాబు జగ్జీవన్‌రామ్ జయంతిఏప్రిల్ 5బుధవారం
గుడ్ ఫ్రైడేఏప్రిల్ 7శుక్రవారం
అంబేడ్కర్ జయంతిఏప్రిల్ 14శుక్రవారం
రంజాన్ఏప్రిల్ 22శనివారం
బక్రీద్జూన్ 29గురువారం
మొహర్రంజూలై 29శనివారం
స్వాతంత్ర్య దినోత్సవంఆగస్టు 15మంగళవారం
శ్రీకృష్ణాష్టమిసెప్టెంబర్ 6బుధవారం
వినాయక చవితిసెప్టెంబర్ 18సోమవారం
ఈద్ మిలాద్ ఉన్ నబీసెప్టెంబర్ 28గురువారం
గాంధీ జయంతిఅక్టోబర్ 2సోమవారం
దుర్గాష్టమిఅక్టోబర్ 22ఆదివారం
విజయదశమిఅక్టోబర్ 23సోమవారం
దీపావళినవంబర్ 12ఆదివారం

Follow Us : FacebookTwitter

Read More Articles |

TTD EO | తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డికి జైలు శిక్ష.. ఏపీ హైకోర్టు ఉత్తర్వులు

AP cabinet key decisions | ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పెన్షన్ల పెంపునకు మంత్రివర్గం ఆమోదం

AP Special Status | ఆంధ్రప్రదేశ్‌కి షాకులమీద షాకులిచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ప్రత్యేక హోదా, పోలవరంపై చేసిన కామెంట్స్‌తో దిమ్మతిరిగిపోయిందిగా!

Cyber Crime | 3 కోట్లకు కిడ్నీ అమ్మకానికి పెట్టి.. 16 లక్షలు పోగొట్టుకుంది..మోసపోయిన ఏపీ యువతి

Varahi Registration | పవన్ కళ్యాణ్ వారాహి వివాదానికి ఫుల్ స్టాప్.. తెలంగాణలో రిజిస్ట్రేషన్ కంప్లీట్

Exit mobile version