Home Latest News Delhi Liquor Scam | ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కీలక మలుపు.. ఈడీ ఛార్జ్‌షీట్‌లో ఆ...

Delhi Liquor Scam | ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కీలక మలుపు.. ఈడీ ఛార్జ్‌షీట్‌లో ఆ సీఎం సహా కవిత, మాగుంట పేర్లు!

Delhi Liquor Scam | ఢిల్లీ లిక్కర్‌ స్కాం మరో కీలక మలుపు తిరిగింది. ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్‌ షీట్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించింది. ఈడీ ఛార్జ్‌షీట్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, తెలంగాణ ఎమ్మెల్సీ కవితతో పాటు వైసీపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సహా 17 మంది పేర్లను ఈడీ పేర్కొంది.

అయితే లిక్కర్‌ స్కామ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ పేరును ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 428 పేజీలతో కూడిన ఛార్జ్‌షీట్‌లో ఈడీ కీలక విషయాలను వెల్లడించింది. ఎక్సైజ్‌ పాలసీ రూపొందించే సమయంలో కేజ్రీవాల్‌ కు అత్యంత సన్నిహితుడైన విజయ్‌నాయర్‌తో మాట్లాడినట్లు వివరించింది. అసలు ఈ వ్యవహరం మొత్తాన్ని కూడా నడిపించింది విజయ్‌ నాయర్‌ అని పేర్కొంది. కేజ్రీవాల్ క్యాంప్ కార్యాలయంలోనే కుంభకోణానికి సంబంధించిన తతంగం అంతా నడిపించినట్లు తెలిపింది. సమీర్‌ మహేంద్రు స్టేట్‌ మెంట్‌ ఆధారంగా కేజ్రీవాల్‌ పేరు వెల్లడైంది.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత పేరును కూడా ఈడీ పేర్కొంది. ఇప్పటికే విచారించిన వారిలో ఆమె పేరును పేర్కొంది. అలాగే ఆధారాలను ధ్వంసం చేసిన వారిలో కవిత పేరును ప్రస్తావించింది. ఢిల్లీ ఒబెరాయ్‌ హోటల్‌లో జరిగిన సమావేశాల్లో ఆమె పాల్గొన్నట్లుగా ఛార్జ్‌షీట్‌లో అధికారులు తెలిపారు. మొత్తం 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు మోపింది.

లిక్కర్ కేసులో ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న నిందితులకు రౌస్‌ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ ను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలిపింది. అందులో పేర్కొన్న నిందితులకు నోటీసులు ఇచ్చింది. కేసు విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది.

అయితే జనవరి 6న 13,657 పేజీలతో అనుబంధ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది ఈడీ. ఇందులో కొందరి పేర్లు, ఏడు కంపెనీలను చేర్చింది. విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లిని నిందితులుగా పేర్కొంది. వారితోపాటు శరత్‌ చంద్రారెడ్డి, బినోయ్, అమిత్ అరోరాలను కూడా నిందితులుగా చేర్చింది. మొత్తం ఛార్జ్ షీట్ పై 428 పేజీలతో ఫిర్యాదు నివేదికను కోర్టుకు అందించింది ఈడీ.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Viral News | బాల భీముడు.. భలే ముద్దొస్తున్నాడుగా.. 8 కేజీల బరువుతో శిశువు జననం

Queen Elizabeth II | కరెన్సీ నోట్లపై క్వీన్ ఎలిజబెత్ ఫొటో తొలగింపు.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

Vistara | విమాన సిబ్బందిని తిట్టి.. అర్థనగ్నంగా నడిచిన ప్రయాణికురాలు.. ఆ తర్వాత ఏమైంది?

Indian Economy | 50 శాతం వాటా ఇండియా, చైనాదే అవుతోంది.. ఐఎంఎఫ్‌ కీలక వ్యాఖ్యలు

China | పెళ్లి చేసుకోకున్నా సరే పిల్లల్ని కనండి.. అన్ని బెనిఫిట్స్ ఇస్తామని ప్రోత్సహిస్తున్న చైన

Exit mobile version