Home News International Viral News | బాల భీముడు.. భలే ముద్దొస్తున్నాడుగా.. 8 కేజీల బరువుతో శిశువు జననం

Viral News | బాల భీముడు.. భలే ముద్దొస్తున్నాడుగా.. 8 కేజీల బరువుతో శిశువు జననం

Viral News | సాధారణంగా తల్లి కడుపులో పిల్లలు రెండున్నర నుంచి నాలుగు కేజీల వరకు పెరుగుతుంటారు. బాగా పెరిగితే మరో కేజీ అంటే ఐదు కేజీల వరకు ఉంటారు. అంతకు మించి పిల్లలు పుడితే వామ్మో.. ఆరు కేజీల పిల్లలు కూడా ఉంటారా అన్న సందేహలు వస్తాయి. కానీ బ్రెజిల్‌లో ఏకంగా ఓ బుడతడు 8 కేజీల బరువుతో పుట్టాడు. రెండున్నర అడుగుల పొడవున్న ఈ బుడ్డోడిని బయటకు తీయడానికి వైద్యులు ఆపరేషన్‌ చేయాల్సి వచ్చింది.

సాధారణంగా మహిళలు గర్భంతో ఉన్న సమయంలో మధుమేహం బారిన పడితే 15 శాతం నుంచి 40 శాతం మంది పిల్లలు ఇలా అధిక బరువుతో జన్మిస్తారట. 35 సంవత్సరాల వయసు దాటిన తర్వాత గర్భం దాల్చితే కూడా ఇలా బరువు ఉన్న శిశువులు పుట్టే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు పుట్టిన బాల భీముడు ఇంత బరువుతో జన్మించడానికి గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఈ ప్రస్తుతం బుజ్జి భీముడి చిత్రాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Breaking News | శ్రీకాకుళం జిల్లాలో డ్రోన్ కలకలం.. మత్స్యకారులకు చిక్కిన10 అడుగుల విమానం

Vizag | రాజు ఎక్కడుంటే.. రాజధాని అక్కడే.. మూడు రాజధానులపై ఏపీ మంత్రి అమర్‌నాథ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Nirmala Sitharaman | బడ్జెట్‌ ప్రసంగంలో టంగ్‌ స్లిప్‌ అయిన నిర్మలమ్మ.. సభలో విరబూసిన నవ్వులు

Tarakaratna | 45 నిమిషాలు గుండె ఆగడంతో తారకరత్న మెదడు వాచింది.. ఆరోగ్య పరిస్థితి వివరించిన విజయసాయిరెడ్డి

Andhra Pradesh Capital | ఏపీ సీఎం జగన్‌ కీలక ప్రకటన.. ట్విటర్ ట్రెండింగ్‌లో నిలిచిన విశాఖపట్నం

Exit mobile version