Saturday, April 27, 2024
- Advertisment -
HomeEntertainmentSusmita Sen | బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌కు గుండెపోటు.. యాంజియోప్లాస్టీ ద్వారా చికిత్స

Susmita Sen | బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌కు గుండెపోటు.. యాంజియోప్లాస్టీ ద్వారా చికిత్స

Susmita Sen | బాలీవుడ్ నటి సుస్మితా సేన్ గుండెపోటుకు గురైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఇటీవల తనకు తీవ్ర గుండెపోటు వచ్చిందన్న విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. వాళ్ల నాన్నతో దిగిన ఫొటోను షేర్ చేసింది.

మీ గుండెను ధైర్యంగా, సంతోషంగా ఉంచుకోండి. ఆపద సమయంలో అది మీకు తోడుగా ఉంటుందని మా నాన్న ఎప్పుడూ నాతో చెబుతుండేవారు. నా విషయంలో ఇప్పుడు అది నిజమే అయ్యింది. కొద్దిరోజుల క్రితం నాకు హార్ట్ ఎటాక్ వచ్చింది. యాంజియోప్లాస్టీ చేశారు. స్టెంట్ కూడా వేశారు. ఆ టైమ్‌లో మా డాక్టర్ కూడా నాతో ఇదే అన్నారు. నా గుండె చాలా పెద్దదని ఆ డాక్టర్ అన్నాడు అంటూ సుస్మితా సేన్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఈ హార్ట్ ఎటాక్‌కు సంబంధించిన విషయాలను మరో పోస్టులో చెబుతానని.. ప్రస్తుతం తనను అభిమానించే ఫ్యాన్స్, సన్నిహితులకు విషయం చెబుదామని మాత్రమే ఈ పోస్టు చేస్తున్నానని పేర్కొంది.

యువతలో ఇటీవల హృద్రోగాలు ఎక్కువైపోయాయి. నాలుగు పదుల వయసులోకి కూడా రాకముందే గుండెపోటుతో కుప్పకూలుతున్నారు. అప్పటివరకు సరదాగా ఉండి ఒక్కసారిగా ప్రాణాలను కోల్పోతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు మరింత ఎక్కువయ్యాయి. అప్పట్లో పునీత్ రాజ్‌కుమార్, ఇటీవల నందమూరి తారకరత్న వరకు చాలామంది కార్డియర్ అరెస్ట్‌తో ప్రాణాలు విడిచారు. తారకరత్న మరణం తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు చాలానే చూశాం. ఇలా రోజు రోజుకీ గుండెపోటుతో మరణించేవాళ్లు పెరిగిపోయిన నేపథ్యంలో గుండెను పదిలంగా కాపాడుకోవాలని సుస్మితా సేన్ సూచించింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Triangle Love Story | అబ్దుల్లాపూర్‌మెట్ తరహాలో ప్రేమించిన అమ్మాయి కోసం స్నేహితుడి హత్య.. 17 నెలల తర్వాత వెలుగులోకి.. ఆస్తిపంజరమే మిగిలింది

Telangana | నిప్పులాంటి మగాడివి అయితే ఏ అగ్గి నిన్నేం చేయలేదు.. అక్రమ సంబంధం రుజువు చేయాలని పంచాయతీ పెద్దల ఆటవిక తీర్పు

Sunil | సునీల్ ఇంక హీరోగా పనికిరాడా.. విలన్ గా సెటిల్ అయిపోతాడా..?

Junior NTR | రామ్‌చరణ్‌ను పిలిచి ఎన్టీఆర్‌ను ఆహ్వానించరా.. నందమూరి ఫ్యాన్స్‌ ఫైర్‌.. క్లారిటీ ఇచ్చిన హెచ్‌సీఏ

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News