Saturday, April 27, 2024
- Advertisment -
HomeNewsInternationalNew Corona Variant | అత్యంత ప్రమాదకారిగా కరోనా సూపర్ సబ్ వేరియంట్.. అమెరికాలో వైరస్...

New Corona Variant | అత్యంత ప్రమాదకారిగా కరోనా సూపర్ సబ్ వేరియంట్.. అమెరికాలో వైరస్ వ్యాప్తికి కారణమిదే.. భారత్‌లోనూ 26 కేసులు

New Corona Variant | చైనాతో పాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నట్లుగానే కొత్త రకం వేరియంట్ల వ్యాప్తి కూడా పెరుగుతోందని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు భారతదేశం అతీతం కాదని కన్సార్టియం ఇన్సాకాగ్ వెల్లడించింది. అమెరికాలో ప్రస్తుతం కరోనా వ్యాప్తికి కారణమైన XBB 1.5 వేరియంట్ కేసులు భారత్‌లో ఇప్పటివరకు 26 నమోదైనట్లు తెలిపింది. 11 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే ఈ 26 కేసులు వెలుగులోకి వచ్చాయని తెలిపింది. మరోవైపు BF.7 వేరియంట్ కేసులు కూడా 14కు చేరాయని ఇన్సాకాగ్ వెల్లడించింది.

ఓమిక్రాన్ XBB వేరియంట్, ఓమిక్రాన్ బీఏ.2 అనే రెండు సబ్ వేరియంట్ల వల్ల ఈ కొత్త రకం XBB 1.5 వేరియంట్ ఏర్పడిందని తేలింది. దీన్ని సూపర్ సబ్ వేరియంట్‌గా పరిశోధకులు పేర్కొంటున్నారు. దీని వల్ల ఆస్పత్రుల్లో చేరికలు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. ఈ సబ్ వేరియంట్‌కు శరీరంలోని కణాలను అంటిపెట్టుకునే శక్తి ఎక్కువగా ఉందని అంచనా వేస్తున్నారు. విపరీతమైన జలుబు ఉంటుందని, జ్వరం మాత్రం అంతమాత్రంగానే ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా కరోనా టీకా వేసుకున్న వాళ్లతో పాటు గతంలో కరోనా వచ్చిన వారిలో జలుబు విపరీతంగా ఉంటుందని నిపుణులు తెలిపారు.

ప్రస్తుతం అమెరికాలో నమోదవుతున్న కేసుల్లో XBB, XBB1.5లకు చెందిన వేరియంట్లే శాతం ఉన్నాయని, ప్రస్తుతం XBB 1.5 కేసులు 38 దేశాల్లో ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోందని కూడా తెలిపింది. అందుకే బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Pallavi Joshi | కశ్మీర్ ఫైల్స్ నటికి యాక్సిడెంట్.. గాయాలతోనే షూటింగ్‌లో పాల్గొన్న పల్లవి జోషి

vijay antony | మలేసియాలో షూటింగ్ స్పాట్‌లో తీవ్రంగా గాయపడ్డ బిచ్చగాడు హీరో

Hyderabad tragedy | పండుగపూట హైదరాబాద్‌లో విషాదం.. భార్యాపిల్లలను, తల్లిని చంపి వ్యక్తి బలవన్మరణం

nepal plane crash | నేపాల్‌లో విమానం కూలింది ఇలా.. ప్రమాదం జరిగే ముందు ఫేస్‌బుక్‌ లైవ్ పెట్టిన యూపీ యువకులు

Ambati Rambabu | నేను సంబరాల రాంబాబునే.. కానీ ప్యాకేజీ కోసం డ్యాన్స్ చేయను.. నాగబాబుపై ఏపీ మంత్రి అంబటి సెటైర్లు

Hyper Aadi | ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో హైపర్ ఆది పోటీ చేయబోతున్నాడా.. జనసేన తరఫున ఆ నియోజకవర్గం నుంచేనా ?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News