Monday, March 27, 2023
- Advertisment -
HomeNewsAPAmbati Rambabu | నేను సంబరాల రాంబాబునే.. కానీ ప్యాకేజీ కోసం డ్యాన్స్ చేయను.. నాగబాబుపై...

Ambati Rambabu | నేను సంబరాల రాంబాబునే.. కానీ ప్యాకేజీ కోసం డ్యాన్స్ చేయను.. నాగబాబుపై ఏపీ మంత్రి అంబటి సెటైర్లు

Ambati Rambabu | ఏపీలో వైసీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. సంక్రాంతి పండుగ పూట కూడా ఏపీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఒకరిపై ఒకరు ట్వీట్లతోనే సెటైర్లు, కౌంటర్లు వేసుకుంటున్నారు. భోగి పండుగ సందర్భంగా మహిళలతో కలిసి ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఉత్సాహంగా డ్యాన్సులు వేశారు. భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ఆ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసి జనసేన నేత, సినీ నటుడు నాగబాబు ఓ ట్వీట్ చేశారు.

సంబరాల రాంబాబు గారు మీరు డ్యాన్స్ మహత్తరంగా చేశారు. పోలవం పూర్తి చేసి డ్యాన్స్ చేసి ఉంటే మహత్తరంగా ఉండేది అంటూ నాగబాబు ట్వీట్ చేశాడు. నాగబాబు ట్వీట్‌కు అంబటి రాంబాబు కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. అవును నేను సంబరాల రాంబాబునే అని అంటూనే నాగబాబు, పవన్ కళ్యాణ్‌పై సెటైర్ వేశారు. నువ్వు, నీ తమ్ముడు అన్నట్టు నేను సంబరాల రాంబాబునే !కానీ.. ముఖానికి రంగు వేయను.. ప్యాకేజి కోసం డ్యాన్స్ చేయను అంటూ స్ట్రాంగ్‌గా కౌంటరిచ్చాడు. అంతటితో ఆగకుండా పోలవం మేమే పూర్తిచేస్తాం.. చంద్రబాబు, పవన్ బాబు, నాగబాబుతో డ్యాన్స్ చేయిస్తాం అని మరో ట్వీట్ చేశారు. దీంతో మరోసారి వైసీపీ వర్సెస్ జనసేనగా మారిపోయింది. కామెంట్లలో వైసీపీ, జనసేన కార్యకర్తలు, అభిమానుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

అంతకుముందు రణస్థలంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అంబటి రాంబాబు విడుచుకుపడ్డారు. అంబటి రాంబాబు కాదు సంబరాల రాంబాబు అంటూ కామెంట్ చేశాడు. దీనికి అంబటి అప్పుడే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నేను సంబరాల రాంబాబు అయితే.. నువ్వు కల్యాణాల పవన్‌వి అంటూ సెటైర్ వేశారు. పీకే అంటే పిచ్చి కుక్క అని కూడా కామెంట్ చేశారు. ఈ వివాదం సద్దుమణుగుతున్న టైమ్‌లోనే నాగబాబు ట్వీట్ చేసి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మరింత రెచ్చగొట్టారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Nitiin & Rashmika Mandanna | మరోసారి జోడీ కట్టబోతున్న నితిన్, రష్మిక.. భీష్మ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

Shweta basu prasad | కొత్త బంగారు లోకం హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది?

Rajamouli | ప్రభాస్ ముందు హృతిక్ నథింగ్.. బాలీవుడ్ హీరోపై చేసిన కామెంట్స్‌పై రాజమౌళి వివరణ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News