Home News AP Kadiyam Srihari | ఇక్కడ టైమ్‌ వేస్ట్‌.. ఏపీ వెళ్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉంది.....

Kadiyam Srihari | ఇక్కడ టైమ్‌ వేస్ట్‌.. ఏపీ వెళ్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉంది.. వైఎస్ షర్మిలకు కడియం శ్రీహరి హితవు

Kadiyam Srihari | తెలంగాణ బడ్జెట్‌పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ, మాజీ మంత్రి కడియం శ్రీహరి విరుచుకుపడ్డారు. రాష్ట్ర బడ్జెట్‌పై షర్మిల వ్యాఖ్యలు బాధకరమని అన్నారు. తెలంగాణలో తిరిగి సమయం వృథా చేసుకోవద్దని.. ఆంధ్రాకు వెళ్లి అక్కడి ప్రజలకు మొర పెట్టుకోమని హితవు పలికారు. రేపో మాపో ఏపీ సీఎం జగన్ జైలుకెళ్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం దక్కుతుందని జోస్యం చెప్పారు.

వైఎస్ కుటుంబం మొదట్నుంచి కూడా తెలంగాణకు వ్యతిరేకంగానే ఉందని కడియం శ్రీహరి అన్నారు. సమైక్యాంధ్ర తమ నినాదం అని షర్మిల తిరిగిన వ్యక్తి అని అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారని గుర్తు చేశారు. షర్మిలకు రాజకీయంగా అన్యాయం జరిగిందని కడియం శ్రీహరి అన్నారు. సీబీఐ కేసులో వైఎస్ జగన్ జైలులో ఉన్నప్పుడు షర్మిల, విజయమ్మలు పాదయాత్ర చేసి ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. కానీ ముఖ్యమంత్రి అయ్యాక జగన్.. తల్లీ చెల్లికి అన్యాయం చేశారని ఆరోపించారు. మీ కష్టంతో అధికారంలోకి వచ్చి.. మిమ్మల్ని అన్యాయం చేశారన్న విషయాన్ని వెళ్లి ఆంధ్రా ప్రజలకు మొర పెట్టుకోవాలని సూచించారు.

రేపో మాపో సీబీఐ కేసులోనో.. వివేకానంద రెడ్డి హత్య కేసులోనో వైఎస్ జగన్ జైలుకు పోతే షర్మిలకు సీఎం అయ్యే అవకాశం వస్తుందని జోస్యం చెప్పాడు. అందుకే తెలంగాణలో తిరిగి టైమ్ వేస్ట్ చేసుకోకుండా ఏపీకి వెళ్లాలని హితవు పలికారు. షర్మిలకు తెలంగాణలో తిరిగే నైతికత లేదని ఆరోపించారు. ఏపీలో రోజురోజుకీ జగన్ గ్రాఫ్ పడిపోతుందని తెలిపారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Teachers | టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. బదిలీ ప్రక్రియలో వాళ్లకూ ఛాన్స్

Turkey Earthquake | తుర్కియే, సిరియాలో భారీ భూకంపం వస్తుందని 3 రోజుల ముందే హెచ్చరిస్తే.. అంతా చులకనగా మాట్లాడారు..

Turkey Earthquake | ప్రపంచంలో ఇప్పటిదాకా వచ్చిన భారీ భూకంపాలు ఇవే..

Turkey Earthquake | ప్రకృతి ప్రకోపానికి 3800 మంది బలి.. చిగురుటాకులా వణికిపోతున్న తుర్కియే, సిరియా

BRS MLAs Poaching Case | ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు!

Exit mobile version