Home Latest News Gautam Adani | అదానీ ఒక్కడి కోసం రూల్స్ మార్చేశారు.. రాజ్యసభలో మోదీపై రాహుల్ గాంధీ...

Gautam Adani | అదానీ ఒక్కడి కోసం రూల్స్ మార్చేశారు.. రాజ్యసభలో మోదీపై రాహుల్ గాంధీ ఫైర్

Gautam Adani | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అదానీ గ్రూప్ వ్యవహారంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. మోదీతో ఉన్న సంబంధం వల్లే గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుడిగా ఎదిగాడని రాజ్యసభలో ఫైర్ అయ్యారు. అదానీ, మోదీ కలిసి ఉన్న ఫొటోను రాజ్యసభలో చూపించి.. వీళ్లిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే అదానీకి, మోదీకి మధ్య సంబంధాలు ఉన్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. వివిధ వ్యాపార రంగాల్లో అదానీ సంస్థలు ప్రవేశించడానికి వీలుగా నిబంధనలను అతనికి అనుకూలంగా మార్చుకుంటూ వచ్చారని విమర్శించారు. ఎయిర్‌పోర్టుల అభివృద్ధి విషయంలో ఆ రంగంలో అనుభవం ఉన్నవారే ప్రవేశించాలనే నిబంధన ఉండేదని గుర్తు చేశారు. కానీ అదానీ కోసం ఈ నిబంధనను మార్చేశారని తెలిపారు. అదానీకి ఆరు విమానాశ్రయాలను అప్పగించారని ఆరోపించారు. జీవీకే నుంచి ముంబై పోర్టును హైజాక్ చేశారని.. ఇందుకోసం సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు.

2014 వరకు ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ 609వ స్థానంలో ఉన్నారని.. అలాంటిది 2022 వచ్చేసరికి రెండో స్థానానికి ఎలా దూసుకొచ్చారని ప్రశ్నించారు. ఎనిమిదేళ్లలో అదానీ సంపద 8 బిలియన్ డాలర్ల నుంచి 140 బిలియన్ డాలర్లకు ఎలా పెరిగింది? ఏం అద్బుతం జరిగిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

తాను భారత్ జోడో యాత్ర చేపట్టిన తర్వాత కన్యాకుమారీ నుంచి కశ్మీర్ వరకు ఎక్కడికి వెళ్లినా అదానీ పేరే వినిపించేదని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. అదానీ అడుగుపెట్టిన ప్రతి చోట వ్యాపారాల్లో ఎలా సక్సెస్ అవుతున్నారంటూ ప్రజలు ఆశ్చర్యపోతున్నారని ఎద్దేవా చేశారు. జమ్మూ కశ్మీర్‌లోని యాపిల్స్ నుంచి పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రోడ్ల నిర్వహణ.. ఇలా సుమారు 10 రంగాల్లో అదానీ ఎలా వ్యాపారం చేస్తున్నారని ప్రశ్నించారు. మోదీ పర్యటించిన అన్ని దేశాల్లో అదానీకి కాంట్రాక్టులు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

PM Kisan | రైతులకు కేంద్రం మొండిచేయి.. పీఎం కిసాన్ డబ్బులపై కీలక ప్రకటన

Kadiyam Srihari | ఇక్కడ టైమ్‌ వేస్ట్‌.. ఏపీ వెళ్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉంది.. వైఎస్ షర్మిలకు కడియం శ్రీహరి హితవు

Babu mohan | జోగిపేట బీజేపీ కార్యకర్తను బండబూతులు తిట్టిన బాబుమోహన్.. బండి సంజయ్ ఎవడ్రా అంటూ ఫైర్

Teachers | టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. బదిలీ ప్రక్రియలో వాళ్లకూ ఛాన్స్

Turkey Earthquake | తుర్కియే, సిరియాలో భారీ భూకంపం వస్తుందని 3 రోజుల ముందే హెచ్చరిస్తే.. అంతా చులకనగా మాట్లాడారు..

Turkey Earthquake | ప్రపంచంలో ఇప్పటిదాకా వచ్చిన భారీ భూకంపాలు ఇవే..

Exit mobile version