Home Latest News IAF Jets Crash | ఒకేసారి వేర్వేరు రాష్ట్రాల్లో కూలిన 3 యుద్ధ విమానాలు!

IAF Jets Crash | ఒకేసారి వేర్వేరు రాష్ట్రాల్లో కూలిన 3 యుద్ధ విమానాలు!

IAF Jets Crash | కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే వేరు వేరు చోట్ల మూడు యుద్ధ విమానాలు కుప్పకూలడంతో భారత వాయుసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైయ్యింది. శిక్షణ తీసుకుంటున్న రెండు ఫైటర్ జెట్లు మధ్యప్రదేశ్‌లో కూలిపోగా.. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఓ యుద్ధ విమానానికి ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, పోలీసులు ప్రమాదస్థలికి చేరుకున్నారు.

భరత్‌పూర్ జిల్లా కలెక్టర్ అలోక్ రంజన్ మాట్లాడుతూ… విమానం కూలిన ప్రాంతంలో సహయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. విమానంలోని పైలట్ కోసం గాలిస్తున్నామని భరత్ పూర్ ఎస్పీ శ్యామ్ సింగ్ అన్నారు. సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ఈ విమానం కూలిపోయినట్లు అధికారులు, సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు.

అటు మధ్యప్రదేశ్ లోని మొరెనా సమీపంలో సుఖోయో-30 , మిరాజ్ అనే రెండు యుద్ధ విమానాలు కుప్పకూలాయి. రోజువారి శిక్షణలో భాగంగా గ్వాలియర్ ఎయిర్ బేస్ నుంచి గాల్లోకి ఎగిరిన కాసేపటికే ఈ రెండు విమానాలు కూలిపోయాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అధికారులు రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు.

వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. సుఖోయ్‌లో ఇద్దరు, మిరాజ్లో ఒక పైలట్ ఉన్నట్లు సమాచారం. వీరిలో ఇద్దరు ప్రాణాలతో బయటపడగా, మరోక పైలట్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గాల్లో ఒక్కసారిగా విమానాలు ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే అనుమానాలు ఉన్న నేపథ్యంలో విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

Exit mobile version