Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Today | రాశిఫలాలు (29-01-2023 )

Horoscope Today | రాశిఫలాలు (29-01-2023 )

Image Source : Pixabay

Horoscope Today | మేషం

కుటుంబసమస్యలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. నూతన కార్యక్రమాలను సానుకూలంగా పరచుకుంటారు. ధనలాభం పొందుతారు.

వృషభం

ఆర్థిక పరిస్థితి మెరుగపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. పనుల్లో విజయం సాధిస్తారు. సంగీత, సాహిత్యంపై ఆసక్తి చూపుతారు.

మిథునం

ప్రయాణాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. వాహన సౌఖ్యం పొందుతారు.

కర్కాటకం

రుణాలు తీరి ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు.

సింహం

వృత్తి, వ్యాపారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. స్వల్ప ధనలాభ సూచన ఉంది.

కన్య

దూర ప్రయణాలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు . సంఘ సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించండి.

తుల

ముఖ్యమైన పనుల్లో సన్నిహితుల సాయం అందుకుంటారు. బంధువులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. కోపతాపాలకు దూరంగా ఉండండి. సంగీతం, సాహిత్యంపై ఆసక్తి చూపుతారు.

వృశ్చికం

మిత్రులతో ఏర్పడిన విరోధాలు తొలగుతాయి. అనుకోని అతిథుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు.

ధనుస్సు

ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారమై ప్రశాంతత లభిస్తుంది. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. వాహన సౌఖ్యం పొందుతారు.

మకరం

ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సోదరులను కలిసి సంతోషంగా గడుపుతారు. విందువినోదాల్లో ఉల్లాసంగా పాల్గొంటారు. వాహనయోగం పొందుతారు.

కుంభం

బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు.

మీనం

భూవివాదాలు తీరి లబ్ది పొందుతారు. సోదరులతో ఏర్పడిన కలహాలు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. విదేశీయాన ప్రయత్నం ఫలిస్తుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

Lord ganesh in dreams | వినాయకుడు కలలో కనిపిస్తున్నాడా? ఏమవుతుందో తెలుసా !

Money in Dreams | కలలో డబ్బులు కనిపిస్తే అదృష్టమా? దురదృష్టమా?

Exit mobile version