Home News AP AP CM YS Jagan | ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డ...

AP CM YS Jagan | ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డ ఏపీ సీఎం జగన్.. అందరూ గజదొంగలే అంటూ ఆగ్రహం

AP CM YS Jagan | టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రజలకు మంచి చేస్తుంటే చంద్రబాబు అడ్డుపడుతున్నాడంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏనాడు ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేని రాజకీయ పార్టీలు, ప్రజల బాగోగుల గురించి ఆలోచించని నాయకులు ఈరోజు ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని చూసి ఓర్వలేకపోతున్నాయని అన్నారు. రాజమండ్రిలో పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్‌ బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ దిగజారిపోయిందని విమర్శించారు.

చంద్రబాబు చేస్తున్న కుళ్లు రాజకీయాల గురించి ప్రజలు ఆలోచించాలన్నారు. ” ఎన్టీఆర్‌ను తానే వెన్నుపోటు పొడిచి, తానే చంపేసి, సీఎం కుర్చీని కూడా లాగేసుకుని, పార్టీని, ఎన్టీఆర్ ట్రస్టును, ఎన్టీఆర్ శవాన్ని చంద్రబాబు లాగేసుకున్నాడు. మళ్లీ ఎన్నికలు వచ్చే సరికి ఎన్టీఆర్ అంతటి గొప్ప వాళ్లు ఉంటారా అంటూ ఫొటోకు దండేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తడు. పొడిచేది ఈయనే.. చంపేది ఈయనే.. మళ్లీ మొసలి కన్నీరు కార్చేది కూడా ఈయనే . ఎన్టీఆర్ అయినా.. ప్రజలు అయినా చంద్రబాబుకు తెలిసిన నైజం వెన్నుపోటు పొడవడం. ఫొటో షూట్లు, డ్రామాలు చేయడం, మొసలి కన్నీళ్లు కార్చడం. ఇదే చంద్రబాబు నైజం. ఇదే ఫొటో షూట్ల కోసం, డ్రోన్ షూట్ల కోసం ముఖ్యమంత్రిగా ఉన్పప్పుడు రాజమండ్రి గోదావరి ఫుష్కరాల సమయంలో 29 మందిని చంపేశాడు. కుంభమేళాలో తొక్కిసలాటలు జరగలేదా అంటూ నిస్సిగ్గుగా మాట్లాడిండు. మొన్న కందుకూరులో జనం తక్కువ వచ్చే సరికి ఇరుకు సందుల్లో జనాలను నెట్టి.. ప్రచార వాహనాన్ని తీసుకెళ్లాడు. తొక్కిసలాటకు కారణమయ్యాడు. 8 మందిని చంపేశాడు. మళ్లీ అక్కడే మౌనం పాటించాలని పిలుపునిచ్చాడు. చనిపోయిన కుటుంబాలకు చెక్కుల పంపిణీ పేరుతో నాటకాలాడాడు. తనే మనుషులను చంపిస్తడు. తానే ఒక మహోన్నత మానవతా వాదిలా డ్రామాలు ఆడుతడు చంద్రబాబు. ఇంత దారుణమైన రాజకీయాలు జరుగుతుంటే కూడా ఈనాడు రాయదు, ఆంధ్రజ్యోతి చూపదు, టీవీ 5 అడగదు, దత్తపుత్రుడు అంతకన్నా ప్రశ్నించడు” అంటూ చంద్రబాబుపై జగన్ ధ్వజమెత్తారు.

గుంటూరు, కందుకూరులో తానే పేదలను చంపేసి చివరికి వారు కూడా టీడీపీ కోసం త్యాగం చేశారని చంద్రబాబు నక్కజిత్తుల మాటలు మాట్లాడాడని జగన్ విమర్శించారు. చనిపోయిన వాళ్లలో ఎస్సీలు ఉంటే.. తన కోసం ఎస్సీలు ప్రాణ త్యాగం చేశారంటూ చంద్రబాబు దారుణంగా మాట్లాడాడు అంటూ విమర్శించారు. చావులను కూడా రాజకీయం కోసం ఉపయోగించుకునే వ్యక్తి చంద్రబాబు అంటూ తీవ్ర స్థాయిలో జగన్ ధ్వజమెత్తారు. కందుకూరులో 8 మందిని చంపేసినా కూడా చంద్రబాబు రక్తదాహం తీరలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ గుంటూరులో సభ పెట్టి.. కొత్త సంవత్సరం రోజే ఫొటో షూట్ల కోసం, డ్రోన్షషాట్ల కోసం ముగ్గురిని బలితీసుకున్నాడని ఆరోపించారు. గుంటూరు సభకు జనాలు ఎవరూ రారు అని భయపడి.. చీరల పంపిణీ పేరుతో నాటకాలు ఆడి చంద్రబాబు ముగ్గురి ప్రాణాలు తీశాడని వ్యాఖ్యానించారు. పైగా పోలీసులదే తప్పు అంటూ ఆ పాపం వారికి అంటగట్టే ప్రయత్నం చేశాడని విమర్శించారు. 45 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు వంకర బుద్ధి ఎలా ఉంటుందో.. ఎలా ఉందో 2014 నుంచి 2019 వరకు ప్రజలు అందరూ చూశారని గుర్తు చేశారు.

87,612 కోట్ల రైతుల రుణాలు మాఫీ చేస్తానని, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పి చంద్రబాబు రైతులను నట్టేట ముంచాడని అన్నారు. 14,204 కోట్ల రూపాయల అక్క చెల్లెమ్మల పొదుపు సంఘాల రుణాలను మాఫీ చేస్తానని, వారికి సున్నా వడ్డీకి కూడా రుణాలు ఇవ్వలేదన్నాడు. జాబు రావాలి అంటే బాబు రావాలి అన్నాడు.. జాబు రాకుంటే 2వేల నిరుద్యోగ భృతి అని పిల్లలను కూడా చంద్రబాబు మోసం చేశాడంటూ తీవ్ర స్థాయిలో విమర్శించాడు. 650 పేజీల మేనిఫెస్టోను చూపించి.. ప్రతి కులానికి ఇది చేస్తానని ఎన్నికల్లో మాటిచ్చి.. గెలిచిన తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. మేనిఫెస్టోను వెబ్ సైట్ నుంచి కూడా తీసేసి ప్రజలను నట్టేట ముంచాడన్నారు. అధికారం కోసం పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి ప్రజలు ఒక లెక్కనా అంటూ విమర్శించారు. ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా.. ప్రజలను ఎంత మోసం చేసినా ఈనాడు రాయదు, ఆంధ్రజ్యోతి చెప్పదు, టీవీ5 చూపదు, దత్తపుత్రుడు అంతకన్నా ప్రశ్నించడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లందరూ గజదొంగల ముఠా అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకురావడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు ఎంతలా కష్టపడుతున్నారో ప్రజలు ఆలోచన చేయాలంటూ పిలుపునిచ్చారు. ” మీ బిడ్డకు వీళ్ల మాదిరి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 , దత్తపుత్రుడి అండ ఉండకపోవచ్చు. కానీ మీ బిడ్డకు ఉన్నది దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులు మాత్రమే. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడిని చంద్రబాబు నమ్ముకోవచ్చు. కానీ మీ బిడ్డ మాత్రం ఒక ఎస్సీ, ఎస్టీని నమ్ముకున్నాడు. ఒక బీసీని నమ్ముకున్నడు. ఈరోజు రాష్ట్రంలో జరగుతున్నది కులాల యుద్దం కాదు. పేదవాళ్లు, పెత్తందారీ వ్యవస్థ మధ్య యుద్ధం జరగుతోంది. జాగ్రత్తగా ఆలోచన చేయండి.. పొరపాటు జరిగితే పేదవాడు నాశనం అయిపోతాడు. పేదవాడికి ఇంగ్లీష్ మీడియం చదువు వద్దు అంటున్నాడు. పేదవాడికి ఇళ్లు కట్టించొద్దు అంటున్నాడు. ఇటువంటి శక్తులతో మీ బిడ్డ పోరాటం చేస్తున్నాడు. ఈ పోరాటంలో మీ అందరి చల్లని ఆశిస్సులు ఉండాలి” అంటూ ప్రజలకు జగన్ పిలుపునిచ్చాడు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

BRS in Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కేసీఆర్‌ను స్వాగతిస్తారా ? బీఆర్ఎస్‌ వల్ల ఏపీలో దెబ్బ పడేది ఎవరికి?

Numaish 2023 | హైదరాబాద్‌లో జరిగే అతిపెద్ద ఎగ్జిబిషన్‌ నుమాయిష్‌ గురించి ఈ విషయాలు తెలుసా ? ఎంట్రీ ఫీజు ఎంతంటే?

Pawan Kalyan | టీడీపీ సభలో తొక్కిసలాటపై స్పందించిన పవన్‌ కళ్యాణ్‌.. తీవ్రంగా ట్రోల్స్‌ చేస్తున్న నెటిజన్లు

KCR | ఎమ్మెల్యేలు, సర్పంచ్‌లపై కేసీఆర్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. గెలిచినంక కొమ్ములొస్తున్నయ్‌ అంటూ సెటైర్లు!

KCR | ఏపీలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు.. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

Exit mobile version