Home Latest News Basara | సరస్వతి అమ్మవారిపై రెంజర్ల రాజేశ్ అనుచిత వ్యాఖ్యలు.. బాసర బంద్‌కు పిలుపునిచ్చిన భక్తులు

Basara | సరస్వతి అమ్మవారిపై రెంజర్ల రాజేశ్ అనుచిత వ్యాఖ్యలు.. బాసర బంద్‌కు పిలుపునిచ్చిన భక్తులు

Basara | సరస్వతీ దేవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రెంజర్ల రాజేశ్‌పై చర్యలు తీసుకోవాలంటూ అమ్మవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆలయ అర్చలకులతో పాటు భక్తులు, స్థానికులు నిరసనలకు దిగారు. బాసర బంద్‌కు పిలుపునిచ్చారు. వీరికి వ్యాపారులు కూడా సహకరిస్తూ స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

రాజేశ్‌పై పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేస్తూ బాసరలో స్థానికులు, వ్యాపారులు, అర్చకులు రాస్తారోకోకు దిగారు. రాజేశ్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. దీంతో బాసరలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చేదాక ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. రాజేశ్‌పై చర్యలు తీసుకోవాలని బాసర అమ్మవారి ఆలయ అర్చకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల అయ్యప్ప స్వామిపై బైరి నరేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమయంలో రెంజర్ల రాజేశ్ ఆయన పక్కనే ఉన్నారు.

నరేష్ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సందర్భంలోనూ రాజేశ్ ఆయనకు మద్దతు ప్రకటించి మరింత ఆజ్యం పోశారు. ఈ క్రమంలోనే రాజేశ్‌పై చర్యలు తీసుకోవాలని అయ్యప్ప స్వాములు రెంజర్ల రాజేశ్ ఇంటిని ముట్టడించారు. పోలీసులు జోక్యం చేసుకుని క్షమాపణలు చెప్పించడంతో ఆందోళన విరమించారు. తాజాగా సరస్వతి అమ్మవారిపై రాజేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో బాసర బంద్‌కు పిలుపునిచ్చారు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

BRS in Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కేసీఆర్‌ను స్వాగతిస్తారా ? బీఆర్ఎస్‌ వల్ల ఏపీలో దెబ్బ పడేది ఎవరికి?

Numaish 2023 | హైదరాబాద్‌లో జరిగే అతిపెద్ద ఎగ్జిబిషన్‌ నుమాయిష్‌ గురించి ఈ విషయాలు తెలుసా ? ఎంట్రీ ఫీజు ఎంతంటే?

Pawan Kalyan | టీడీపీ సభలో తొక్కిసలాటపై స్పందించిన పవన్‌ కళ్యాణ్‌.. తీవ్రంగా ట్రోల్స్‌ చేస్తున్న నెటిజన్లు

KCR | ఎమ్మెల్యేలు, సర్పంచ్‌లపై కేసీఆర్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. గెలిచినంక కొమ్ములొస్తున్నయ్‌ అంటూ సెటైర్లు!

KCR | ఏపీలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు.. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

Exit mobile version