Home Business Refrigerator prices may hike | కొత్త సంవత్సరంలో సామాన్యులకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న...

Refrigerator prices may hike | కొత్త సంవత్సరంలో సామాన్యులకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న ధరలు

Image Source : freepik

Refrigerator prices may hike | కొత్త సంవత్సరంలో మొదలై రెండు రోజులు కూడా అయ్యిందో లేదో అప్పుడే సామాన్యులకు బిగ్ షాక్ తగిలింది. ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, సీలింగ్ ఫ్యాన్స్ ధరలు భారీగా పెరగుతున్నాయి. మోడల్‌ను బట్టి 5 నుంచి 8 శాతం వరకు ఈ ధరల పెంపు ఉండనుంది. లేబలింగ్ విషయంలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (BEE ) కొత్త నిబంధనలు ( bee labelling norms ) తీసుకొచ్చింది. జనవరి 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ధరలు పెంచనున్నట్టు రిఫ్రిరిజిరేటర్ల తయారీ కంపెనీలు గోద్రేజ్, హైయిర్, పానాసోనిక్ కంపెనీలు వెల్లడించాయి.

ఏమిటీ నిబంధనలు?

రిఫ్రిజిరేటర్ సామర్థ్యాన్ని తెలియజేయడానికి గతంలో కంపెనీలు గ్రాస్ కెపాసిటీని పేర్కొనేవి. కానీ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన స్టార్ రేటింగ్ నిబంధనల ప్రకారం.. కంపెనీలన్నీ తప్పనిసరిగా నెట్ కెపాసిటీని పేర్కొనాలి. అలాగే ఫ్రాస్ట్ ఫ్రీ మోడల్స్‌లోని ఫ్రీజర్స్, రిఫ్రిజిరేటర్ స్టోరేజ్ పార్టులకు వేర్వేరు స్టార్ లేబులింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం ఈ రెండింటికీ వేర్వేరు లేబుల్స్ వేయాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రస్తుతం 5 స్టార్ రేటింగ్ ఉన్న పరికరాలు 4 స్టార్‌కు మారతాయి. ఫైవ్ స్టార్ ప్రమాణాలతో కొత్త పరికరాలు తయారవుతాయి. దీనికోసం కొత్త ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ఎలక్ట్రానిక్ విడిభాగాలు అవసరం అవుతాయి. అయితే డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ తగ్గడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్స్ విడిభాగాల ధరలు పెరిగాయి. దీంతో తమ ఉత్పత్తులపై డాలర్ ప్రభావాన్ని తగ్గించేందుకు ధరలు పెంచాలని వివిధ ఎలక్ట్రానిక్ సంస్థలు నిర్ణయించుకున్నాయి.

ధరల పెంపు ఇలా..

తమ కంపెనీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు రెండు నుంచి మూడు శాతం వరకు పెరగొచ్చని గోద్రెజ్ అప్లియెన్సెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కమల్ నంది వెల్లడించారు. బీఈఈ కొత్త ప్రమాణాల ప్రకారం ఏసీలపై 5 నుంచి 8 శాతం, రిఫ్రిజిరేటర్లపై 2 నుంచి 5 శాతం వరకు ఈ ధరలు పెంచనున్నట్టు ఎల్‌ జీ సంస్థ వెల్లడించింది. తమ ఉత్పత్తుల ధరలు 2 నుంచి 4 శాతం వరకు ధరలు పెంచే యోచనలో ఉన్నట్టు హైయర్ పేర్కొంది. పానాసోనిక్ అయితే 5 శాతం మేర ధరలు పెంచాలని నిర్ణయించింది. కొత్త సంవత్సరం నుంచి స్టార్ రేటింగ్ ఉన్న సీలింగ్ ఫ్యాన్స్‌నే తయారు చేయాలి. విక్రయించాలి. కాబట్టి వీటి ధరలు కూడా 7 నుంచి 8 శాతం వరకు పెరగనున్నాయి.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Pawan Kalyan | టీడీపీ సభలో తొక్కిసలాటపై స్పందించిన పవన్‌ కళ్యాణ్‌.. తీవ్రంగా ట్రోల్స్‌ చేస్తున్న నెటిజన్లు

KCR | ఎమ్మెల్యేలు, సర్పంచ్‌లపై కేసీఆర్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. గెలిచినంక కొమ్ములొస్తున్నయ్‌ అంటూ సెటైర్లు!

KCR | ఏపీలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు.. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

Jeremy Renner | బాంబ్ సైక్లోన్ ఎఫెక్ట్.. తీవ్రంగా గాయపడ్డ అవెంజర్స్ ఫేమ్ మార్వెల్ సూపర్ హీరో జెరెమీ రెన్నర్‌.. పరిస్థితి విషమం

Exit mobile version