Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Today | రాశి ఫలాలు ( 17-12-2022 )

Horoscope Today | రాశి ఫలాలు ( 17-12-2022 )

Image Source : Pixabay

Horoscope Today | మేషం

ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

వృషభం

మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూరప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు అనుకోని పదోన్నతులు పొందే సూచన. ఆహ్వానాలు అందుకుంటారు.

మిథునం

ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. విలువైన ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడులు పెరుగుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగులకు అనుకూలమైన సమయం.

కర్కాటకం

కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. కాంట్రాక్టులు దక్కుతాయి. సంతానానికి కార్యసిద్ధి.

సింహం

రుణాలు తీరి ఊరట చెందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. పనుల్లో ఎదురైనా ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం. నూతన వస్తువుల కొనుగోలు సూచన ఉంది.

కన్య

కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాలను సంతానం సాయంతో పూర్తి చేస్తారు. నూతన వస్తు, వస్త్ర కొనుగోలు సూచన ఉంది.

తుల

దూరపు బంధువులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. పరపతి పెరుగుతుంది. కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ది సాధిస్తాయి.

వృశ్చికం

పనులు చకాచకా సాగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు పొందే సూచన ఉంది.

ధనుస్సు

ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఇంటాబయటా ప్రోత్సాహం లభిస్తుంది. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. సంగీతం, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. వాహన యోగ సూచన ఉంది.

మకరం

రుణ ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. ముఖ్య వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు సామాన్యంగా ఉంటుంది.

కుంభం

కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. షేర్లు, భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు.

మీనం

బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. అనుకోని అతిథులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Vasthu | వాస్తు ప్రకారం కిచెన్ ఏ దిక్కున ఉండాలి? ఎందుకు?

Vasthu Tips | ఈశాన్యంలో బరువులు పెట్టవద్దని ఎందుకు అంటారు?

Vaasthu Tips | కొత్త ఇల్లు కొనేముందు ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి

Vaasthu Tips | ఈ చెట్లు మీ ఇంట్లో ఉంటే ఆర్థికంగా నష్టపోవడం ఖాయం

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Exit mobile version