Home News AP AP Special Status | ఆంధ్రప్రదేశ్‌కి షాకులమీద షాకులిచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ప్రత్యేక హోదా, పోలవరంపై...

AP Special Status | ఆంధ్రప్రదేశ్‌కి షాకులమీద షాకులిచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ప్రత్యేక హోదా, పోలవరంపై చేసిన కామెంట్స్‌తో దిమ్మతిరిగిపోయిందిగా!

AP Special Status | ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ప్రత్యేక హోదా ఇవ్వలేమని రాజ్యసభ వేదికగా మరోసారి స్పష్టం చేసింది. అసలా అంశమే ఉనికిలో లేదంటూ తేల్చి చెప్పింది. అటు నిర్ణీత గడువులోగా పోలవరం పూర్తి కావడం కూడా కష్టమేనంటూ బాంబు పేల్చింది. షెడ్యూల్‌ ప్రకారం 2024 మార్చి నాటికి పోలవరం పూర్తి కావాల్సి ఉందని కానీ వివిధ కారణాల వల్ల గడువులోగా పూర్తి కావడం కష్టమని కేంద్రం స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశం గురించి రాజ్యసభలో వైకాపా ఎంపీ పిల్లి సుభాష్‌చంద్ర బోస్‌ కేంద్రాన్ని ప్రశ్నించారు. అయితే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్‌ సింగ్‌ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. వివిధ కారణాలు, పరిస్థితుల వల్ల గతంలో అభివృద్ధి మండలి కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించిందని పేర్కొన్నారు. అయితే జనరల్‌ కేటగిరీ రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీకి సంబంధించి 14వ ఆర్థిక సంఘం ఎలాంటి వ్యత్యాసం చూపలేదన్నారు. ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగానే 2015-20 మధ్య రాష్ట్రాలకు పంచే పన్నుల వాటాను కేంద్రం పెంచిందన్నారు. నిధుల పంపిణీ ద్వారా ప్రతి రాష్ట్రానికి వనరులు అందించేందుకు కేంద్రం వీలైనంత వరకు ప్రయత్నం చేస్తుందన్నారు. నిధుల పంపిణీ అనంతరం వనరుల లోటు ఉంటే ఆయా రాష్ట్రాలకు రెవెన్యూ లోటు పూడ్చేందుకు గ్రాంట్స్‌ అందిస్తున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు.

అటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఖర్చు, జాప్యంపై వైకాపా ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌ శక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడు సమాధానం ఇచ్చారు. పోలవరం నిర్ణీత గడువులోగా పూర్తయ్యే అవకాశం లేదన్నారు. వాస్తవానికి 2024 మార్చి నాటికి పూర్తి కావాలని, కానీ గడువులోగా ప్రాజెక్టు పూర్తి కావడం కష్టమేనని స్పష్టం చేశారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Cyber Crime | 3 కోట్లకు కిడ్నీ అమ్మకానికి పెట్టి.. 16 లక్షలు పోగొట్టుకుంది..మోసపోయిన ఏపీ యువతి

Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర మెసేజ్‌లు వస్తున్నాయా? వాటిని ఇలా ఆపేయండి

Money Plant | మనీ ప్లాంట్‌ను ఏ దిక్కున పెంచాలి? ఇది ఎండిపోతే ఏమవుతుంది

Exit mobile version