Home News AP AP cabinet key decisions | ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పెన్షన్ల పెంపునకు మంత్రివర్గం...

AP cabinet key decisions | ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పెన్షన్ల పెంపునకు మంత్రివర్గం ఆమోదం

AP cabinet key decisions | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( YS Jagan mohan Reddy ) అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్ ( AP cabinet ) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న రూ. 2500 పెన్షన్ ను వచ్చే నెల నుంచి రూ. 2,750కి పెంచుతూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఫలితంగా ఆంధ్రప్రదేశ్ లో 62.31 లక్షల మంది పెన్షన్ దారులకు లబ్ధి జరగనుంది. 2023 జనవరి 1 వ తేదీ నుంచి పెంచిన పెన్షన్ అమలుకానుంది. మరోవైపు వైఎస్సార్ పశుబీమా పథకం ప్రతిపాదనలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వర్చువల్ క్లాసులు, ఫౌండేషన్ స్కూళ్లలో స్మార్ట్ టీవీ రూములను నాడు నేడు ద్వారా నిర్మించే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.

కడప జిల్లాలో 8200 కోట్ల పెట్టుబడితో JSW స్టీల్ ప్లాంటు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. SIPB ఆమోదించిన విద్యుత్తు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది . 6330 కోట్లతో ఏర్పాటు చేయనున్న అదాని విద్యుత్తు ప్రాజెక్టుకు , షర్టిసాయి ఎలక్ట్రికల్స్ నెలకొల్పే ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 21న వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. స్వయంగా ఎమ్మెల్యేలు, మంత్రులు విద్యార్థులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఉపాధ్యాయులకు బోధనేతర విధులు రద్దు చేస్తూ జారీ చేసిన జీవోకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండల కేంద్రాన్ని జుజ్జూరుకు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. బాపట్ల అర్భన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీ ల్యాండ్ అండ్ పట్టాదారు పాస్ బుక్ చట్టంలో సవరణలకు ఆమోదం తెలిపింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Anjali Marriage | అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. పెళ్లి వార్తలపై స్పందించిన అంజలి

India-China troops clash | భారత్-చైనా సరిహద్దులో ఘర్షణపై రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో కీలక ప్రకటన..

Congress political crisis | కాంగ్రెస్ కు రోగమొచ్చింది.. దాన్ని నయం చేయాల్సిందే.. దామోదర రాజనర్సింహా సంచలన వ్యాఖ్యలు

RRR | ఆర్ఆర్‌ఆర్ సినిమాకు క్యూ కడుతున్న అంతర్జాతీయ అవార్డులు.. రాజమౌళితో పాటు దుమ్మురేపుతున్న కీరవాణి

Exit mobile version