Home Latest News TSPSC | టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులు ఇక పోటీ పరీక్షలు రాయడానికి అనర్హులే.. కొత్త నిబంధన తీసుకొస్తున్న...

TSPSC | టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులు ఇక పోటీ పరీక్షలు రాయడానికి అనర్హులే.. కొత్త నిబంధన తీసుకొస్తున్న కమిషన్‌ !

TSPSC రాష్ట్రాన్ని కుదిపేసిన పేపర్‌ లీకేజీ ఘటనతో టీఎస్‌పీఎస్సీ అప్రమత్తమైంది. మరోసారి ఇలాంటి ఘటనలుపునరావృతం కాకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. పేపర్‌ లీకేజీలో ఇంటి దొంగల పాత్రే ఉందనితేలడంతో టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ఉద్యోగుల భర్తీకి కఠిన నిబంధనలను సిద్ధం చేస్తుంది. ఇకపై టీఎస్‌పీఎస్సీలో చేరేఉద్యోగులు భవిష్యత్తులో కమిషన్‌ పరిధిలో జరిగే ఎలాంటి పరీక్షలు రాయడానికి వీల్లేకుండా నిబంధన తీసుకురావాలనిఆలోచిస్తోంది. టీఎస్‌పీఎస్సీలో కాకుండా వేరే నియామక సంస్థల నోటిఫికేషన్లు రాసుకునే వెసులుబాటు కల్పించాలనిభావిస్తోంది. కొత్తగా రిక్రూట్‌ చేసుకునేవారికి అయితే సరే.. కానీ ఇప్పటికే ఉద్యోగంలో చేరిన వ్యక్తుల విషయంలో ఎలాంటినిబంధనలు విధించాలనే దానిపై కూడా టీఎస్‌పీఎస్సీ కసరత్తులు చేస్తుంది. దీనికోసం పలు నిబంధనలను తీసుకురావాలనిభావిస్తోంది. అవేంటంటే..

  • ఇప్పటికే ఉద్యోగంలో చేరిన వ్యక్తులు టీఎస్‌పీఎస్సీ పరిధిలోని పోటీ పరీక్షలకు సిద్ధం అవ్వాలని అనుకుంటే ముందుగానే కమిషన్‌కు సమాచారం ఇవ్వాలి.
  • పరీక్ష తేదీకి మూడు నెలల ముందు నుంచి ఫలితాలు వచ్చిన నెల రోజుల తర్వాత వరకు సెలవులో వెళ్లాలి. వెల్లే ముందు అండర్‌టేకింగ్‌ ఇచ్చి వెళ్లాలి. * ప్రిపరేషన్‌ సమయంలో బయట వ్యక్తులు ఎవరినీ కలవద్దు. ఈ మేరకు ఫిడవిట్‌ ఇవ్వాల్సి ఉంటుంది.
  • పరీక్షకు అప్లై చేసుకునే ముందు టీఎస్‌పీఎస్సీ నుంచి నో అబ్జక్షన్‌ సర్టిఫికేట్‌ తీసుకోవాలి.
  • ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు టీఎస్‌పీఎస్సీ పరీక్ష రాయాలని అనుకుంటే.. వారిని కమిషన్‌ నుంచి తొలగించాలని భావిస్తోంది.

కమిషన్‌లో ఉద్యోగాల భర్తీకి రెండంచెల విధానం

టీఎస్‌పీఎస్సీలో ఉద్యోగుల నియామక ప్రక్రియను కూడా మరింత కఠినతరం చేయాలని కమిషన్‌ భావిస్తోంది. కమిషన్‌లో ఉద్యోగాల భర్తీకి రెండంచెల విధానాన్ని అమలు చేయాలని అనుకుంటోంది. టీఎస్‌పీఎస్సీ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి సమగ్ర సమాచారం సేకరించాలని భావిస్తోంది. గతంలో అభ్యర్థి ఏ ఉద్యోగం చేశాడు? అక్కడ అతని ప్రవర్తన ఎలా ఉంది వంటి వివరాలను సేకరించిన తర్వాతనే రిక్రూట్‌ చేసుకోవాలని అనుకుంటుంది. దీంతో పాటు టీఎస్‌పీస్సీ కార్యాలయంలోకి విజిటర్స్‌కు అనుమతిని నిషేధించాలని.. ఎవరైనా ఫిర్యాదు చేసేందుకు వచ్చినా హెల్ప్‌ డెస్క్‌లోనే వినతిపత్రం అందజేసి వెళ్లిపోయేలా నిబంధన తీసుకురావాలని భావిసతోంది.

మేలో పరీక్షలు

పేపర్‌ లీకేజీ ఘటనతో రద్దయిన, వాయిదా పడిన పరీక్షలను మే నెలలో నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తుంది. దీనికి సంబంధించి వారం, పది రోజుల్లో నోటిఫికేషన్‌ ప్రకటించేందుకు కసరత్తులు చేస్తోంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Viral News | మగాళ్లంతా ఇలాంటి భార్యే కావాలని కోరుకుంటారేమో.. అంతమంచి ఆఫర్ ఇస్తే ఎవరైనా కాదనుకుంటారా?

Sri Rama Navami | సీతారాముల కళ్యాణం చూసేందుకు గుడికి వెళ్లి.. బావిలో పడి 12 మంది భక్తులు మృతి

Tamilnadu | తమిళనాడులో పెరుగు కోసం లొల్లి.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఎం

IAS Divya S Iyer | వాళ్లు నా బట్టలు విప్పేశారు.. లైంగిక వేధింపులను బయటపెట్టిన కలెక్టర్ దివ్య

Coronavirus | మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఒక్కరోజులోనే 3వేలకు పైగా కేసులు

World Idli Day | మనం రెగ్యులర్‌గా తినే ఇడ్లీ ఇండియాది కాదా? మరి ఎక్కడి నుంచి వచ్చింది?

Exit mobile version