Home Latest News caste certificate for dog | కుక్కకు క్యాస్ట్‌ సర్టిఫికెట్‌.. ఆధార్‌ కార్డు ప్రూఫ్‌గా పెట్టి...

caste certificate for dog | కుక్కకు క్యాస్ట్‌ సర్టిఫికెట్‌.. ఆధార్‌ కార్డు ప్రూఫ్‌గా పెట్టి మరి అప్లై..

caste certificate for dog | కుక్కకు కుల ధ్రువీకరణ పత్రం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? తాజాగా తమ శునకానికి క్యాస్ట్‌ సర్టిఫికెట్‌ కావాలని అప్లై చేశాడు. అంతే కాదు అప్లికేషన్‌ ఫామ్‌తో ఆ కుక్క ఆధార్‌ కార్డును కూడా జత చేశాడు. ఈ దరఖాస్తు చూసిన అధికారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆ తర్వాత తేరుకుని దరఖాస్తు చేసిన ఆకతాయి కోసం వెతుకులాట మొదలుపెట్టారు. బిహార్‌లోని గయాలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది.

కులాల ఆధారంగా బిహార్‌ ప్రభుత్వం ఇటీవల ఒక సర్వే చేపట్టింది. ఇందులో భాగంగా జనవరి 7 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తులు స్వీకరించారు. దీనికి రాష్ట్రవ్యాప్తంగా ఊహించని రెస్పాన్స్‌ వచ్చింది. అంచనాలకు మించి కుల ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తులు వచ్చాయి. తాజాగా వాటిని పరిశీలిస్తున్న గయాలోని అధికారులు టామీ అనే పేరుతో వచ్చిన అప్లికేషన్‌ చూసి కంగుతిన్నారు. దానికి కారణం అది మనిషి కోసం అప్లై చేసింది కాదు.. ఓ కుక్క కుల ధ్రువీకరణ కోసం వచ్చిన దరఖాస్తు అది. ఈ దరఖాస్తు ఒక్కటే అధికారులను ఆశ్చర్యపరచలేదు. ఈ దరఖాస్తుతో పాటు ఒక ఆధార్ కార్డు కూడా ఉండటమే అధికారులను షాక్‌కు గురిచేసింది.

ఆ ఆధార్‌ కార్డులో ఆ కుక్క పేరుతో పాటు తండ్రి పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు కూడా ఉన్నాయి. కుక్క పేరు టామి, తండ్రి పేరు గిన్ని, పుట్టిన తేదీ ఏప్రిల్‌ 14, 2022 అని ఉంది. ఇక అడ్రస్‌ విషయానికొస్తే పందేపోఖర్‌, పంచాయతీ రౌనా, వార్డు నంబర్‌ 13, గురారు సర్కిల్‌ అని ఉంది. పైగా ఆ ఆధార్‌ కార్డుపై ఆమ్‌ కుత్తా కా అధికార్‌ అని రాసి ఉంది. దీనికి సంబంధించిన ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇలా కుక్క కుల ధ్రువీకరణ పత్రం కావాలంటూ ఆకతాయిలు చేసిన చేష్టలపై అధికారులు సీరియస్‌గా ఉన్నారు. వారిని పట్టుకునేందుకు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Google Bonalu | గూగులమ్మకు బోనాలు.. వేములవాడ బద్దిపోచమ్మ గుడిలో సమర్పించిన ఫోక్‌ సింగర్స్‌ శిరీష, మధుప్రియ, మౌనిక

KCR on Adani | అదానీపై ఉన్న ప్రేమ దేశ ప్రజలపై ఉండాలి కదా.. ఎవరితో అండతో వేగంగా ఎదిగారు? నాందేడ్‌లో కేసీఆర్‌ కామెంట్స్

Traffic Challan | వాహనదారులకు గుడ్ న్యూస్.. ట్రాఫిక్ ఛలాన్లపై 50 శాతం డిస్కౌంట్

Transgender Pregnant | అబ్బాయిగా మారిన తర్వాత గర్బం దాల్చిన ట్రాన్స్‌జెండర్.. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మ

Anand Mahindra | హిండెన్‌బర్గ్ నివేదికపై స్పందించిన ఆనంద్ మహీంద్రా.. ఏమన్నాడంటే

Breaking News | పండుగ నాడు ఉచిత చీరల పంపిణీ… తొక్కిసలాటలో నలుగురు మృతి!

Vani Jairam | వాణీ జయరాం కుటుంబ నేపథ్యం తెలుసా.. ఒంటరిగా ఎందుకు ఉండాల్సి వచ్చింది!

Exit mobile version