Home Lifestyle Devotional Tirumala | తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామికి ఏ రోజు ఏ నైవేద్యం సమర్పిస్తారు?

Tirumala | తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామికి ఏ రోజు ఏ నైవేద్యం సమర్పిస్తారు?

Image Source : Twitter/ttd

Tirumala | కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది తిరుపతి లడ్డూ. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదంగా ఇచ్చే లడ్డూ అంటే ఇష్టపడని వారుండరు. అయితే శ్రీవారికి లడ్డూలు ఒక్కటే కాకుండా ఇంకా చాలా రకాల నైవేద్యాలు సమర్పిస్తుంటారు. వాటిని కూడా ప్రసాదంగా అందజేస్తుంటారు. ఈ విషయం చాలామందికి తెలియదు. మరి ఏడుకొండలవాడికి ఏ రోజు ఏ నైవేద్యం సమర్పిస్తారు? ఎప్పుడెప్పుడు ప్రసాదం నివేదిస్తారో ఇప్పుడు చూద్దాం..

✬ శ్రీవారికి రోజూ త్రికాల నైవేద్యం ఉంటుంది. ఈ సమయాలను మొదటి గంట, రెండో గంట, మూడో గంట అని పిలుస్తుంటారు. తొలి నివేదన ఉదయం 5.30 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో గంట ఉదయం 10 గంటలకు, మూడో గంట రాత్రి 7.30 గంటలకు ఉంటుంది. స్వామి వారికి రోజూ ఒకే రకమైన ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించినప్పటికీ.. ప్రతి నివేదనలో వైవిధ్యం ఉండేలా చూస్తారు.

✬ గురు, శుక్ర వారాల్లో మాత్రం నైవేద్య సమయాల్లో మార్పులు ఉంటాయి. అది కూడా రెండో గంట సమయం మాత్రమే మారుతుంది. ఉదయం 10 గంటలకు ఉండే రెండో నివేదన ఉదయం 7.30 గంటలకే ఉంటుంది.

✬ ఉదయం 5.30 గంటలకు ప్రారంభమయ్యే నివేదనలో చక్ర పొంగలి, కదంబం, పులిహోర, దద్దోజనం, మాత్ర ప్రసాదాలతో పాటు లడ్డూలు, వడలు సమర్పిస్తారు. ఈ ప్రసాదాలను బేడి ఆంజనేయ స్వామివారితో పాటు ఉప ఆలయాలకు పంపిస్తారు.

✬ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే రెండో నివేదనలో పెరుగన్నం, చక్రపొంగలి, పులిహోర, మిర్యాల పొంగలి, సిరా, సేకరబాద్‌ నైవేద్యంగా సమర్పిస్తారు.

✬ రాత్రి 7.30 గంటలకు జరిపే మూడో గంటలో కదంబం, మొలహోర, తోమాల దోశలు, లడ్డూలు, వడలు నివేదిస్తారు.

ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు?

✬ గరుడ ప్రసాదంగా ప్రసిద్ధి చెందిన ఆదివారం పిండిని ఆదివారం శ్రీవారికి సమర్పిస్తారు. అప్పట్నుంచి ఒక్కరోజు ప్రసాదాల సంఖ్య పెరుగుతూ వస్తుంది.

✬ సోమవారం విశేష పూజ సందర్భంగా 51 పెద్ద దోసెలు, 51 చిన్న దోసెలు, 51 పెద్ద అప్పాలు, 102 చిన్న అప్పలు నైవేద్యంగా సమర్పిస్తారు.

✬ మంగళవారం రోజూ సమర్పించే ప్రసాదాలతో పాటు మాత్ర ప్రసాదాన్ని నివేదిస్తారు.

✬ బుధవారం పాయసం, పెసరపప్పును ప్రత్యేకంగా సమర్పిస్తారు.

✬ గురువారం తిరుప్పావడ సేవ సందర్భంగా జిలేబి, మురుకులు, పాయసాన్ని నివేదిస్తారు.

✬ అభిషేక సేవ సందర్భంగా శ్రీవారికి శుక్రవారం పోళెలు సమర్పిస్తారు.

✬ శనివారం కదంబం, చక్రపొంగంలి, పులిహోర, దద్దోజనం, మిర్యాల పొంగలి, లడ్డూలు, వడ, సిరా, సేకరబాద్‌, కదంబం, మొలహూర, తోమాల దోసెలు నివేదిస్తారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

Lord ganesh in dreams | వినాయకుడు కలలో కనిపిస్తున్నాడా? ఏమవుతుందో తెలుసా !

Money in Dreams | కలలో డబ్బులు కనిపిస్తే అదృష్టమా? దురదృష్టమా?

Exit mobile version