Tuesday, July 23, 2024
- Advertisment -
HomeLatest NewsHardik Pandya | ఈ మ్యాచ్‌ నెగ్గితే అతడే భావి భారత సారథి.. హార్దిక్‌ పాండ్యాపై...

Hardik Pandya | ఈ మ్యాచ్‌ నెగ్గితే అతడే భావి భారత సారథి.. హార్దిక్‌ పాండ్యాపై ప్రశంసలు కురిపించిన సునీల్‌ గవాస్కర్‌

Hardik Pandya | టైమ్‌ 2 న్యూస్‌, ముంబై: పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా నాయకత్వ లక్షణాలు తనను ఆకట్టుకున్నాయని క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరుగనున్న తొలి వన్డేలో పాండ్యా భారత జట్టును గెలిపిస్తే అతడిని భావి కెప్టెన్‌గా భావించొచ్చని సన్నీ అభిప్రాయపడ్డాడు.

ఈ ఏడాది ఆఖర్లో భారత గడ్డపై జరుగనున్న వన్డే ప్రపంచకప్‌ అనంతరం అతడికి జట్టు పగ్గాలు అప్పగించొచ్చని అన్నాడు. 29 ఏండ్ల పాండ్యా సారథ్య బాధ్యతలు అందుకున్న తొలిసారే గుజరాత్‌ టైటాన్స్‌కు ఐపీఎల్‌ టైటిల్‌ అందించిన విషయం తెలిసిందే. తాజాగా ముగిసిన ‘బోర్డర్‌-గవాస్కర్‌’ సిరీస్‌లో భారత జట్టు 2-1తో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ప్రారంభంకానుంది. వాంఖడే స్టేడియంలో జరుగనున్న తొలి వన్డేకు భారత రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అందుబాటులో ఉండటం లేదు. వ్యక్తిగత కారణాల వల్ల రోహిత్‌ దూరం కావడంతో ఆస్ట్రేలియాతో తొలి పోరుకు పాండ్యా జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.

పొట్టి ఫార్మాట్‌లో పాండ్యా సూపర్‌

గతేడాది ఐపీఎల్‌లో కొత్తగా చేరిన గుజరాత్‌ టైటాన్స్‌కు హార్దిక్‌ తొలిసారి సారథిగా వ్యవహరించి విజయపథాన నడిపిన నేపథ్యంలో గవాస్కర్‌ మాట్లాడుతూ.. ‘ఐపీఎల్లో అతడి నాయకత్వం నన్ను కట్టిపడేసింది. టీ20ల్లో జాతీయ జట్టుకు సారథ్యం వహించిన సమయంలోనూ అతడి సారథ్య పటిమ ఆకట్టుకుంది. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో అతడు టీమిండియాను గెలిపిస్తే.. అతడిని భావి వన్డే కెప్టెన్‌గా చూడొచ్చు. 2023 వన్డే ప్రపంచకప్‌ అనంతరం సారథ్య బాధ్యతలు అప్పగించేయొచ్చు. మిడిలార్డర్‌లో పాండ్యా జట్టులో ప్రధాన ప్లేయర్‌. గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున కూడా అతడు మిడిలార్డర్‌లోనే బ్యాటింగ్‌ చేశాడు. అయితే సారథి కావడంతో పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్‌ స్థానాన్ని మార్చుకున్నాడు. రెస్పాన్సిబులిటీ తీసుకునేందుకు అతడు సదా సిద్ధంగా ఉంటాడు. జట్టును ముందుండి నడిపించగలడని ఇప్పటికే రుజువైంది. తోటి ఆటగాళ్లకు అతడు భరోసా ఇస్తాడు. వారి సహజసిద్ధమైన ఆట ఆడేందుకు సహకరిస్తాడు. ఒక సారథికి ఉండాల్సిన ముఖ్య లక్షణం ఇదే’ అని గవాస్కర్‌ పేర్కొన్నాడు. ఇటీవలి కాలంలో భారత జట్టు ఎడతెరిపిలేని క్రికెట్‌ ఆడుతుండగా.. రోహిత్‌ గైర్హాజరీలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో హార్దిక్‌ జట్టుకు నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

TSPSC | టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు – Time2news.com

TSPSC Group 1 Question Paper Leak | గ్రూప్ 1 పేపర్‌ కూడా లీక్ అయిందా.. నిందితుడు ప్రవీణ్‌కు 103 మార్కులు ఎలా వచ్చాయి ?

Gruha Lakshmi Scheme | గృహలక్ష్మి పథకం విధివిధానాలు ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. దరఖాస్తులు ఎలా.. రూ.3లక్షలు ఎప్పుడు ఇస్తారు?

IND vs AUS | ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో క్రికెట్‌ మ్యాచ్‌.. భారత్‌, ఆస్ట్రేలియా నాలుగో టెస్టు ప్రత్యేక అతిథులుగా మోదీ, ఆంటోని ఆల్బనీస్‌

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News