Home Lifestyle Horoscope & Vaasthu Daily Horoscope | రాశిఫలాలు (26-03-2023 )

Daily Horoscope | రాశిఫలాలు (26-03-2023 )

Image Source : Pixabay

Daily Horoscope | మేషం

సంఘంలో గౌరవం లభిస్తుంది. భూతగాదాలు తీరి ఊరట చెందుతారు. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. దూర ప్రాంతాల నుంచి కీలక విషయాలు గ్రహిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు.

వృషభం

ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. బంధువుల నుంచి ధన, వస్తు లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. క్రయవిక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు.

మిథునం

ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు వద్దు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు.

కర్కాటకం

బంధువుల నుంచి ధనలాభం పొందుతారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. పాత మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

సింహం

పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. నూతన ఒప్పందాల్లో తొందరపాటు వద్దు. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. కుటుంబసభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. పాత మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. నూతన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

కన్య

సన్నిహితులతో ఏర్పడి తగాదాలు తీరి ప్రశాంతత పొందుతారు. ఊహించని ప్రయాణాల్లో నూతన మిత్రులు పరిచయమవుతారు. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

తుల

ఆస్తి వివాదాలు తీరి ప్రశాంతత పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. విలువైన వస్తువులు, ఆభరణాల విషయంలో జాగ్రత్త అవసరం. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శుభవార్తలు వింటారు.

వృశ్చికం

ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుంచి ధన, వస్తు లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి.

ధనుస్సు

పని మీద ఫలితం వేరొక్కరిది అన్నట్టుగా ఉంటుంది. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ధనలాభం పొందుతారు.

మకరం

రుణాలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థికాభివృద్ది సాధిస్తారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుంభం

నూతన మిత్రులు పరిచయమవుతారు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. విలువైన వస్తువులు, ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సోదరులను కలుసుకుంటారు.

మీనం

ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. నూతన పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. వాహన సౌఖ్యం కలదు. వివాహ యత్నాలు సాగిస్తారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Eyes Twitching | కన్ను కొట్టుకుంటే ఏం జరుగుతుంది..ఎవరికి ఏ కన్ను అదిరితే మంచిది!

Variety Railway Station | ప్రయాణం చేయకపోయిన టికెట్లు కొంటాం అంటున్న దయాల్‌పుర్ గ్రామస్థులు!

Do You Know | రైలు చివరి బోగి మీద X ఎందుకు రాస్తారో తెలుసా?

CPR | గుండెపోటు వచ్చినవాళ్లకు సీపీఆర్ చేస్తే బతికే ఛాన్స్ ఉందా.. ఎలాంటి సమయంలో సీపీఆర్ చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

Raavi Chettu | రావి చెట్టు నీడ ఇంటి మీద పడితే అంత ప్రమాదామా?

Exit mobile version