Home Lifestyle Do you know Christmas celebrations | క్రిస్మస్‌ను ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఎలా జరుపుకుంటారు?

Christmas celebrations | క్రిస్మస్‌ను ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఎలా జరుపుకుంటారు?

Christmas celebrations | క్రిస్మస్ అంటే క్రైస్తవులకు పెద్ద పండుగ. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటారు. అయితే ఈ వేడుకలు ఒక్కోదేశంలో ఒక్కోలా ఉంటాయి. కొన్ని దేశాల్లో క్రిస్మస్ ఈవ్‌తో మొదలవుతాయి. కానీ చాలా దేశాల్లో నెల రోజుల పండుగగా జరుపుకుంటారు. అంతేకాదు క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కు సంబంధించి ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన సంప్రదాయాలు ఉంటాయి. మరి ఏ దేశంలో ఎలా జరుపుకుంటారో చూద్దాం..

🎄మెక్సికో

జీసస్ జన్మస్థలమైన బెత్లెహమ్‌లో తొమ్మిది రోజుల పండుగగా క్రిస్మస్‌ను జరుపుకుంటారు. యేసు పుట్టకముందు ఆయన తల్లి మేరీ చేసిన 9 రోజుల ప్రయాణానికి గుర్తుగా తొమ్మిది రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తారు. పిల్లలు, పెద్దలు అందరూ ఎంతో ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇక సాయంత్రం వేళలో పిల్లలు పినోటా అనే గేమ్ ఆడుతారు.ఈ ఆటలో బాగంగా కాగితంతో తయారు చేసిన పెద్ద బొమ్మను ఉంచుతారు. దాన్ని పిల్లలు పగులగొట్టి అందులో ఉన్న బహుమతులను తీసుకుని సంబరపడతారు.

🎄స్వీడన్

స్వీడన్‌లోని కౌల్ నగరంలో పెద్ద గొర్రె విగ్రహాన్ని తయారు చేయడం సంప్రదాయంగా వస్తుంది. గొర్రె బొమ్మతో పాటు జీసస్ పుట్టుకకు సంబంధించిన దృశ్యాలను బహిరంగంగా ఏర్పాటు చేస్తారు. అంతేకాదు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకునేటప్పుడు కూడా అవి గొర్రె ఆకారంలో ఉండేలా జాగ్రత్త పడుతారు.

🎄చైనా

చైనాలో క్రిస్మస్ సందర్భంగా యాపిల్‌ను బహుమతిగా ఇస్తుంటారు. యాపిల్స్‌ను సెల్లోఫేన్ కవర్లతో కప్పి, వాటిపై క్రిస్మస్ శాంతి సందేశాలను రాసి లేఖను అందుకుంటారు. అందుకే దీనిని వాళ్లు పీస్ యాపిల్‌గా పిలుస్తారు. క్రిస్మస్ ఈవ్‌ను శాంతికి చిహ్నంగా జరుపుకుంటారు.

🎄జపాన్

జపాన్‌లో క్రిస్మస్‌ పండుగను ఇతర దేశాలతో పోలిస్తే భిన్నంగా జరుపుకుంటారు. ఇక్కడ ప్రతి క్రిస్మస్ పండుగకు KFC ఫుడ్‌తో సెలబ్రేషన్స్ చేసుకుంటారు. 1970ల్లో కేఎఫ్‌సీ తన మార్కెట్‌ను విస్తరించుకునేందుకు వినూత్నంగా మార్కెటింగ్ చేసింది. ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసి రకరకాల ఫుడ్ ఐటెంస్‌ను అందించింది. అప్పట్నుంచి జపనీయులకు క్రిస్మస్ వేడుకలు అంటే కేఎఫ్‌సీ స్టోర్స్‌కు వెళ్లడం ఆనవాయితీగా మారిపోయింది.

🎄ఆస్ట్రియా

ఆస్ట్రియాలో క్రిస్మస్ పండుగకు ముందు చిన్న పిల్లలను వీధుల్లోకి రానివ్వరు. పూర్వం సెయింట్ నికోలస్‌కు క్రాంపస్ అనే దుష్ట కవల సోదరుడు ఉండేవాడు. ఇతను క్రిస్మస్ పండుగకు ముందు పిల్లల్ని ఎత్తుకెళ్లేవాడని జనాలు నమ్మేవారు. అందుకే క్రిస్మస్ వచ్చిందంటే క్రాంపస్ పేరుతో భయపెట్టి పిల్లలను బయటకు వెళ్లనివ్వకపోవడం ఆచారంగా మారింది.

🎄ఉక్రెయిన్

ఉక్రెయిన్‌లో పూర్వం ఒక పేద వితంతువు ఉండేది. క్రిస్మస్ పండుగ జరుపుకునేందుకు ఆమె దగ్గర డబ్బు లేదు. దీంతో ఆ వితంతువు, ఆమె పిల్లలు దిగాలుగా కూర్చొని క్రిస్మస్ ఈవ్ గడిపేశారు. ఆమె కుటుంబాన్ని చూసి జాలిపడిన సాలెపురుగులు అందమైన సాలె గూడును అల్లాయి. క్రిస్మస్ ట్రీతో పాటు ఇంటిని మొత్తాన్ని అందంగా మార్చేశాయి. తెల్లారి లేచి చూసిన పిల్లలు ఎంతో ఆనందపడ్డారట. అప్పట్నుంచి క్రిస్మస్ రోజున ఇంటిని సాలెపురుగుల బొమ్మలతో అలంకరించడం సంప్రదాయంగా మారింది.

🎄నార్వే

క్రిస్మస్ పండుగ రోజున మాయ చీపురులపై ఎగురుతూ మాంత్రికులు తమ ఆహారం కోసం వెతుకుతారని నార్వే ప్రజలు నమ్ముతారు. ఇంట్లో చీపురు కనిపిస్తే మంత్రగత్తెలు అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయని చెప్పుకుంటారు. అందుకే క్రిస్మస్ రోజున చీపురులను కనిపించకుండా దాచిపెడతారు.

🎄చెక్ రిపబ్లిక్

పెళ్లికాని యువతుల కోసం చెక్ రిపబ్లిక్‌లో ఒక ఆచారం ఉంది. క్రిస్మస్ రోజున తమ షూని భుజాల మీద ఉంచుకుని ఇంటి డోర్ ముందు వంగుంటారు. అప్పుడు ఆ షూ కాళ్లపై పడితే ఏడాదిలోపే పెళ్లి అవుతుందని విశ్వసిస్తారు. అలా కాకుండా డోర్ బయట పడితే పెళ్లికి మరో ఏడాది వరకు ఆగాల్సిందే.

🎄పోర్చుగల్

పోర్చుగల్‌లో క్రిస్మస్ పండుగ రోజున తినేముందు ఎక్స్‌ట్రా ప్లేట్లలో ఆహారాన్ని ఉంచుతారు. ఈ పర్వదినాన మరణించిన తమ ప్రియమైన వారు తమతో కలిసి భోజనం చేస్తారని వాళ్లు విశ్వసిస్తారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Dhamaka review | రవితేజ ధమాకా రివ్యూ.. మళ్లీ ట్రాక్‌ ఎక్కాడా?

Kaikala Satyanarayana | హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చి.. ఆయన వల్లే విలన్‌గా మారిన కైకాల

18pages review | 18 పేజిస్‌ రివ్యూ.. నిఖిల్‌, అనుపమ మెస్మరైజ్‌ చేశారా?

Exit mobile version