Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Today | రాశిఫలాలు (01-02-2023 )

Horoscope Today | రాశిఫలాలు (01-02-2023 )

Image Source : Pixabay

Horoscope Today | మేషం

వ్యూహరచనలు చేస్తారు. పరపతి ఉపయోగించి పనులను సానుకూల పరచుకుంటారు. అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. మానసిక ప్రశాంతతను కలిగి ఉండండి.

వృషభం

మొండివాళ్లను ఒప్పించాల్సిన బాధ్యత మీపై పడుతుంది. విదేశీ ప్రయాణాలు, పాస్‌పోర్టు వీసా మొదలైన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. నూతన ఉద్యోగ యత్నాలు కలిసివస్తాయి.

మిథునం

పారిశ్రామిక వేత్తలకు అనుకూలిస్తుంది. కుటుంబంలోని వృద్ధుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఏవీ తలెత్తవు. రాజకీయాలకు ఆకర్షితులవుతారు.

కర్కాటకం

వివాదాలు ఆదిలోనే పరిష్కరించుకుంటారు. ప్రైవేటు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్స్ వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మెలకువలు పాటిస్తే లాభపడగలుగుతారు.

సింహం

శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. భాషారమైన ఇబ్బందులు ఏర్పడతాయి. స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్య

బాధ్యతలు మరింత పెరుగుతాయి. చేపట్టిన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. రావాల్సిన సొమ్ము చేతికందుతుంది. వినోద కార్యక్రమాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు.

తుల

చురుగ్గా ఉంటారు. మీ స్థాయి, గౌరవం పెంపొందుతాయి. కొనుగోలు అమ్మకాల్లో మెలకువలు పాటించండి. కీలక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. దైవ దర్శనం చేసుకుంటారు.

వృశ్చికం

ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఆదాయ మార్గాలు కలిసివస్తాయి. మీరు శత్రువులు అని భావిస్తున్నవారు నిజమైన శత్రువులు కారన్న విషయాన్ని గ్రహిస్తారు.

ధనుస్సు

దూర ప్రాంత యాత్రలకు అనుకూలమైన కాలం. కొత్త పరిచయాలు, స్నేహాలు వృద్ధి చెందుతాయి. గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇతరులకు మీ సలహాలు అందిస్తారు.

మకరం

చిన్నపాటి ఒడిదొడుకులు ఏర్పడినప్పటికీ పనులు సజావుగా సాగుతాయి. చర్చలు మిత్రుల రాక మొదలైన వ్యవహారాలు కాలక్షేపానికి కారణం అవుతాయి. దురభ్యాసాలకు దూరంగా ఉండండి.

కుంభం

స్పర్థలను రూపుమాపుకోవడానికి చేసే ప్రయత్నాలు కలిసివస్తాయి. విద్యార్థులకు శ్రమ అధికం మీద ఫలితాలు చేతికందుతాయి. ఆదాయాన్ని మించి ఖర్చులు చేస్తారు.

మీనం

నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. ప్రశాంతంగా కాలం గడుపుతారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

Exit mobile version