Friday, April 19, 2024
- Advertisment -
HomeLatest NewsShraddha Walker Murder Case | మాంసం కుళ్లిపోకుండా ఎలా దాచి ఉంచాలో ఆఫ్తాబ్‌కు తెలుసు.....

Shraddha Walker Murder Case | మాంసం కుళ్లిపోకుండా ఎలా దాచి ఉంచాలో ఆఫ్తాబ్‌కు తెలుసు.. శ్రద్దా వాకర్‌ హత్య కేసులో సంచలన విషయాలు!

Shraddha Walker Murder Case | గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ హత్య కేసుకు సంబంధించి కోర్టులో వాదనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. నిందితుడు ఆఫ్తాబ్ కొద్ది కాలం చెఫ్‌ గా శిక్షణ పొందాడు. ఆ అనుభవంతోనే ఆమెను హత్య చేసినట్లు ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. హత్య అనంతరం శ్రద్దా మృతదేహాన్ని 35 భాగాలుగా నరికి, మూడు వారాలపాటు తన ఇంట్లోని ఫ్రిజ్‌లో దాచి ఉంచాడు.

ఈ క్రమంలో ఒక్కో శరీర భాగాన్ని ఢిల్లీలోని ఒక్కో చోట పాడేస్తూ వచ్చాడు. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. దీనిపై పోలీసులు విచారణ జరిపి నిందితుడు ఆఫ్తాబ్‌ను అదుపులోకి తీసుకున్నారు. గత నవంబర్ నుంచి ఆఫ్తాబ్ పూనావాలా పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఫిబ్రవరి 7న ఈ కేసులో 6,629 పేజీల చార్జిషీటును పోలీసులు దాఖలు చేశారు.

అనంతరం ఫిబ్రవరి 21న ఢిల్లీ కోర్టు దీనిపై విచారణ జరిపింది. ఈ సందర్భంగా పోలీసులు ఆఫ్తాబ్‌కు సంబంధించి కీలక విషయాలు కోర్టుకు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆఫ్తాబ్ చెఫ్‌గా పని చేసేవాడు. చెఫ్‌గా పని చేయడం వల్ల అతడికి ఏ కత్తి ఎలా వాడాలో తెలుసు. మాంసాన్ని ఎలా కట్ చేయాలో తెలుసు. అలాగే మాంసం కుళ్లిపోకుండా, ఫ్రిజ్‌లో ఎలా దాచి ఉంచాలో కూడా ఆఫ్తాబ్‌కు తెలుసు. తనకున్న అనుభవంతోనే ఆఫ్తాబ్ హత్య చేసి, ఆధారాలు చెరిపేసేందుకు ప్రయత్నించాడని పోలీసులు పేర్కొన్నారు.

ఈ కేసులో అతడే దోషి అని తేల్చేందుకు తగ్గ అన్ని శాస్త్రీయ, హేతుబద్ధ ఆధారాలు ఉన్నట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణ మార్చి 20కి వాయిదా పడింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Microsoft CEO Satya Nadella | కోడింగ్‌ రాకపోయినా సాఫ్ట్‌వేర్ జాబ్ చేయొచ్చు అంటున్న సత్య నాదెళ్ల.. ఎలా?

Viral News | విమానం గాల్లో ఉండగానే డోర్‌ తెరిచేందుకు యత్నం.. వద్దంటే ఏం చేశాడో తెలుసా?

Kim Jong un Sister | ఆ చర్యలను యుద్ధంగా భావిస్తాం: కిమ్‌ సోదరి!

Viral News | బైక్‌ మీద వెళ్తున్న వ్యక్తి నుంచి రూ. 40 లక్షలు చోరీ చేసిన దొంగలు!

H3N2 Influenza Virus | అసలు ఏంటీ హెచ్‌ 3 ఎన్‌ 2 ఇన్‌ ఫ్లూ ఎంజా.. లక్షణాలివేనా ?

Elon Musk | మస్క్‌ బాత్ రూంకి వెళ్లాలన్న వాళ్లు ఉండాల్సిందేనట.. !

Holi Celebrations | అమ్మాయిలూ.. రంగుల పండుగ నాడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

Bill Gates Drives Auto | ఆటో నడిపిన బిల్ గేట్స్.. రియాక్షన్‌ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా.. ఏంటా ఆటో స్పెషల్‌?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News