Home Lifestyle Devotional Shani Pooja | శనివారం పాదరక్షలు పోతే అదృష్టమా? దురదృష్టమా?

Shani Pooja | శనివారం పాదరక్షలు పోతే అదృష్టమా? దురదృష్టమా?

Image Source : Wikipedia

Shani Pooja |శనిదేవుడు పేరు చెబితేనే చాలామంది భయపడతారు. శని దృష్టి పడితే అష్టకష్టాలు పడాల్సి వస్తుందని.. ఏళ్లనాటి శని కారణంగా కింగ్‌లా బతికినవాళ్లు కూడా అడుక్కుతినే స్థితికి వస్తారని చెబుతుంటారు. అందుకే శనిదేవుడి దృష్టి పడకుండా జాగ్రత్త పడుతుంటారు. ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రతి శనివారం ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. దీనివల్ల పడుతున్న బాధలు అన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. మరి శనిదేవుడి అనుగ్రహం పొందినట్టు ఎలా తెలుస్తుంది? ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి?

జాతకంలో శనిదోషం ఉంటే ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతూ ఉంటాయి. అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. అదే శనిదేవుడి అనుగ్రహం లభించినప్పుడు జీవితంలో మార్పులు వస్తుంటాయి. అంతా మంచే జరుగుతుంది. అప్పటి దాకా కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న జీవితానికి కాస్త ఉపశమనంగా అనిపిస్తుంది. ఏ పని మొదలుపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. సకల సౌకర్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇలాంటి సంకేతాలు కనిపిస్తుంటే శని దేవుడి అనుగ్రహం పొందినట్టే భావించాలి. ఇక శనివారం చెప్పులు, షూ పోయినా కూడా అది శుభ సంకేతమని చెబుతారు. ఈ రోజు పాదరక్షలు దొంగిలించబడితే శనిదేవుడు మీ పట్ల సంతోషంగా ఉన్నాడని అర్థం శనిదేవుడి ప్రసన్నం అయినట్టు సంకేతాలు కనిపించినప్పుడు ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేయాలి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

Exit mobile version