Tuesday, April 23, 2024
- Advertisment -
HomeEntertainmentManchu Vishnu vs Manoj | మంచు విష్ణు, మనోజ్ మధ్య గొడవలు ఎందుకొచ్చాయి? మనస్పర్థలకు...

Manchu Vishnu vs Manoj | మంచు విష్ణు, మనోజ్ మధ్య గొడవలు ఎందుకొచ్చాయి? మనస్పర్థలకు కారణమైన సారథి ఎవరు?

Manchu Vishnu vs Manoj | మంచు ఫ్యామిలీలో విబేధాలు ఉన్నాయా? అస్సలు వీళ్లిద్దరికి పడట్లేదా? కొన్నాళ్లుగా టాలీవుడ్‌లో ఇదే చర్చ జరుగుతోంది. ఈ మనస్పర్థల కారణంగానే మంచు మనోజ్ అందరికీ దూరంగా సైలెంట్‌గా ఉంటున్నాడని ప్రచారం జరిగింది. దీనిపై మంచు ఫ్యామిలీని ఎప్పుడు అడిగినా సరే అదేమీ లేదన్నట్టుగా సమాధానమిస్తూ వస్తున్నారు. కానీ మంట పుట్టిన తర్వాత పొగ రాకుండా ఉంటుందా? మంచు ఫ్యామిలీలో కూడా అలాగే గొడవలు బయటపడ్డాయి. ఇన్నిరోజులుగా దాచిపెడుతూ వస్తున్న ఓ నిజం ఇవాళ బట్టబయలు అయ్యింది. మనోజ్ సోషల్ మీడియాలో చేసిన పోస్టుతో మంచు ఫ్యామిలీలో ఉన్న తగాదాలు తేటతెల్లమయ్యాయి.

టాలీవుడ్‌లో ఎప్పట్నుంచో టాక్

మంచు బ్రదర్స్‌కి ఒకరంటే మరొకరికి పడటం లేదని టాలీవుడ్‌లో ఎప్పట్నుంచో టాక్ నడుస్తోంది. వీళ్ల మధ్య మనస్పర్థలకు అసలు కారణమేంటి? అనేది తెలియదు గానీ విబేధాలు ఉన్నాయని మాత్రం మంచు బ్రదర్స్ ప్రవర్తనతో ఎప్పుడో అర్థమైంది. ఎందుకంటే చాలా రోజులుగా మనోజ్ మంచు ఫ్యామిలీకి దూరంగానే ఉంటున్నాడు. మంచు లక్ష్మీతో గానీ.. విష్ణుతో గానీ ఈ మధ్య అస్సలు కనబడలేదు. కాదు.. కాదు.. అసలు వీళ్లిద్దరూ ఒకరు ఉన్న చోటుకి మరొకరు వెళ్లేందుకు కూడా ఇష్టపడట్లేదని తెలుస్తోంది. భూమా నాగిరెడ్డి చిన్న కూతురు మౌనికతో మంచు మనోజ్ రెండో పెళ్లి సమయంలోనే ఈ విషయం జనాలకు అర్థమైంది. మంచు లక్ష్మీప్రసన్న ఇంట్లో జరిగిన ఈ పెళ్లికి మంచు విష్ణు ఏదో చుట్టపుచూపుగా వచ్చి వెళ్లాడు. అంటీముట్టనట్టుగా కాసేపు ఉండి వెళ్లిపోయాడు. దీంతో వీళ్ల మధ్య ఏదో జరుగుతుందని అంతా అనుకున్నారు. ఆ తర్వాత కొద్దిరోజులకే మంచు మోహన్ బాబు బర్త్ డే వచ్చింది. పుట్టిన రోజు సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కూడా అంతే. ఒకరు ఉన్న చోటుకు మరొకరు అస్సలే రాలేదు. దీంతో మంచు బ్రదర్స్ ఒకరంటే మరొకరు ఉప్పు నిప్పులా ఉంటున్నారని అర్థమైపోయింది. అయినప్పటికీ తమ మధ్య విబేధాలు ఏమీ లేవని మంచు ఫ్యామిలీ చెప్పుకొచ్చింది. కానీ తాజాగా మంచు విష్ణు తీరుతో విసిగిపోయిన మనోజ్ తమ ఫ్యామిలీ గుట్టును బయటపెట్టాడు.

అసలేం జరిగింది?

మంచు మనోజ్ అనుచరుడు సారథి ఇంటికి వెళ్లిన విష్ణు అతనిపై దాడి చేశాడు. ఆ గొడవను ఆపలేకపోయిన మనోజ్.. అక్కడ జరిగిన తతంగం మొత్తాన్ని వీడియో తీశాడు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇళ్లలోకి వచ్చి మా వాళ్లను ఇలా కొడుతుంటారండీ.. ఇదీ ఇక్కడి పరిస్థితి అంటూ ఆ పోస్టులో మనోజ్ చెప్పుకొచ్చాడు. ఇలా ఆ వీడియోను పోస్టు చేశాడో లేదో.. అలా క్షణాల్లో వైరల్‌గా మారింది. మంచు బ్రదర్స్ మధ్య నిజంగానే గొడవలు ఉన్నాయన్న వార్త ఒక్కసారిగా ఫిలిం ఇండస్ట్రీలో గుప్పుమంది. ఇన్ని రోజులు నాలుగు గోడల మధ్యే ఉన్న తగాదాల గురించి ఇండస్ట్రీ మొత్తం వ్యాపించడంతో వాటిని కవర్ చేసేందుకు వెంటనే మోహన్ బాబు రంగంలోకి దిగాడు. మనోజ్‌తో మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టిన వీడియోను క్షణాల్లో డిలీట్ చేయించాడు. ఆ తర్వాత మంచు విష్ణు కూడా ఈ గొడవను సమర్థించే ప్రయత్నం చేశాడు. ” గురువారం ఉదయం మా మధ్య జరిగింది సాధారణ గొడవేనని.. సారథితో జరిగిన వాగ్వాదాన్ని మనోజ్ ఆపలేకపోయాడు. వీడియో తీశాడు. మనోజ్ చిన్నవాడు. ఇది స్పందించాల్సినంత పెద్ద విషయం కాదు” అంటూ చెప్పుకొచ్చాడు. కానీ వాళ్లెంత దాచిపెడతామని ప్రయత్నించినా.. మంచు బ్రదర్స్ మధ్య గొడవలు తారస్థాయికి చేరుకున్నాయన్నది మాత్రం నిజమని తెలుగు ప్రేక్షకులు అనుకుంటున్నారు.

అసలు ఎవరీ సారథి?

సారథి ఎవరో కాదు.. మోహన్‌బాబుకు సమీప బంధువు. ఆ రిలేషన్‌ కారణంగా మంచు ఫ్యామిలీకి సారథి దగ్గరయ్యాడు. అన్ని వ్యవహారాల్లో చురుగ్గా ఉండేవాడు. మొదట్నుంచి మంచు విష్ణుకు అనుచురిగా ఉన్నాడు. మా ఎన్నికల సమయంలోనూ విష్ణుతోపాటే సారథి ఉన్నాడు. ఆ తర్వాత పలు కారణాలతో విష్ణుకు దూరమయ్యాడు. మంచు మనోజ్‌కు దగ్గరయ్యాడు. ఆ తర్వాత మంచు బ్రదర్స్ మధ్య మనస్పర్థలు సృష్టించి ఉంటాడని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. తన గురించి అనుచితంగా మాట్లాడటం వల్లే గురువారం సారథిపై విష్ణు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో స్వల్పంగా గాయపడటంతో సారథిని ఆస్పత్రిలో జాయిన్ చేసి ట్రీట్‌మెంట్ ఇప్పించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Balagam in OTT | సైలెంట్‌గా రాత్రికి రాత్రే ఓటీటీలోకి వచ్చేసిన బలగం మూవీ.. ఎందులో స్ట్రీమింగ్‌ అవుతుందంటే..

Chiranjeevi vs Mohan babu | చిరంజీవితో గొడవలపై తొలిసారి నోరు విప్పిన మోహన్ బాబు

Allu Arjun | అల్లు అర్జున్ ట్విట్టర్‌లో నన్ను బ్లాక్ చేశాడు.. వైరల్‌గా మారిన వరుడు హీరోయిన్ ట్వీట్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News