Saturday, September 23, 2023
- Advertisment -
HomeEntertainmentChiranjeevi vs Mohan babu | చిరంజీవితో గొడవలపై తొలిసారి నోరు విప్పిన మోహన్ బాబు

Chiranjeevi vs Mohan babu | చిరంజీవితో గొడవలపై తొలిసారి నోరు విప్పిన మోహన్ బాబు

Chiranjeevi vs Mohan babu | మెగాస్టార్ చిరంజీవి, మంచు మోహన్‌బాబు మధ్య వివాదాల గురించి టాలీవుడ్‌లో ఎప్పుడూ వార్తలు వస్తూనే ఉంటాయి. వీరిద్ధరి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుందని చెప్పుకుంటుంటారు. బయట ఈవెంట్స్‌లో, స్టేజీపై చిరు, మోహన్ బాబు ఆత్మీయంగా పలకరించుకున్నప్పటికీ వీళ్ల గొడవల గురించి ఆగడం లేదు. ఈ క్రమంలోనే ఫిలిం ఇండస్ట్రీలో జరుగుతున్న ఈ ప్రచారంపై మోహన్ బాబు స్పందించాడు. తమ కుటుంబాల మధ్య ఉన్న వివాదం గురించి క్లారిటీ ఇచ్చాడు.

తెలుగు సినీ పరిశ్రమ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అప్పట్లో వజ్రోత్సవం నిర్వహించారు. ఆ వేడుకల్లో చిరంజీవికి లెజండరీ అవార్డు ఇచ్చారు. ఆ టైమ్‌లో స్టేజీ మీద మోహన్‌బాబు మాట్లాడిన మాటలు పెను సంచలనం సృష్టించాయి. దీంతో చిరంజీవి ఆ అవార్డును తిరస్కరించాడు. అప్పట్నుంచే మెగా ఫ్యామిలీకి, మంచు ఫ్యామిలీకి మధ్య వార్ నడుస్తోందని సినీ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. ఈ క్రమంలో దీనిపై తాజాగా మోహన్ బాబు నోరు విప్పారు. చిరంజీవితో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఓ యూట్యూబ్‌ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చిరంజీవి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి మధ్య దూరం ఉందనే మాటల్ని ఆయన ఖండించారు. వీలు కుదిరిన ప్రతిసారీ మేమిద్దరం మాట్లాడుకుంటూనే ఉంటామని తెలిపారు.

వజ్రోత్సవాల్లో జరిగిన వివాదంపై మోహన్ బాబు మాట్లాడారు ‘‘సోషల్‌ మీడియాలో ఇలాంటి వార్తలెన్నో వస్తుంటాయి. ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు? ప్రస్తుతం మేము ఆనందంగా ఉన్నాం. పరిస్థితులు అనుకూలించకపోతే అన్నదమ్ములు, స్నేహితులు, ఆత్మీయుల మధ్య చిన్న చిన్న మాటలు, పట్టింపులు వస్తుంటాయి. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మా మధ్య ఎలాంటి దూరంలేదు. కాబట్టి ఈ విషయం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు.

‘మా’ ఎన్నికల విషయంలో మీ ఇద్దరి మధ్య ప్రతికూల వాతావరణం నెలకొన్నట్లు చెప్పుకొన్నారు’ అన్న ప్రశ్నకు ‘ఇప్పటికీ నాకు ఆ బాధ ఉంది. అలా ఎందుకు జరిగింది? అది తన తప్పా? నా తప్పా? అనేది ఇప్పుడు చర్చించాలనుకోవడం లేదు. ఈ మధ్యకాలంలో మేమిద్దరం వందసార్లు ఎదురుపడ్డాం. ఎప్పటిలాగే సరదాగా మాట్లాడుకున్నాం. బయటవాళ్లు అనుకోవడం తప్ప మా మధ్య ఎలాంటి దూరం లేదని స్పష్టం చేశారు. ‘మా’ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు తీసుకున్న విష్ణు ఇచ్చిన హామీలను చాలావరకూ పూర్తి చేశాడనీ, ‘మా’ బిల్డింగ్‌ ఒకటే పెండింగ్‌ ఉందని వివరించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Viral News | మగాళ్లంతా ఇలాంటి భార్యే కావాలని కోరుకుంటారేమో.. అంతమంచి ఆఫర్ ఇస్తే ఎవరైనా కాదనుకుంటారా?

Sri Rama Navami | సీతారాముల కళ్యాణం చూసేందుకు గుడికి వెళ్లి.. బావిలో పడి 12 మంది భక్తులు మృతి

Tamilnadu | తమిళనాడులో పెరుగు కోసం లొల్లి.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఎం

IAS Divya S Iyer | వాళ్లు నా బట్టలు విప్పేశారు.. లైంగిక వేధింపులను బయటపెట్టిన కలెక్టర్ దివ్య

Coronavirus | మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఒక్కరోజులోనే 3వేలకు పైగా కేసులు

World Idli Day | మనం రెగ్యులర్‌గా తినే ఇడ్లీ ఇండియాది కాదా? మరి ఎక్కడి నుంచి వచ్చింది?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News